ప్రశ్నలు
ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించిన AP Special TET – 2026 పరీక్ష రాసినవారు తమ Response Sheet ను అధికారిక సైట్ sptet.apcfss.in లో ఒక్కో ప్రశ్నగా మాత్రమే చూడగలరు. 150 ప్రశ్నలూ ఒక్కొక్కటి తెరిచి లెక్కపెట్టడం కష్టం. ఈ పోస్ట్‌లోని కోడ్‌ను కాపీ చేసి, Response Sheet పేజీలో అడ్రస్ బార్‌లో పేస్ట్ చేస్తే చాలు – మొత్తం స్కోర్, సెక్షన్ వారీ మార్కులు, మీ కేటగిరీకి అర్హత వచ్చిందా లేదా అనేది అదే పేజీలో కనిపిస్తుంది. ఏ APK ఇన్‌స్టాల్ చేయాల్సిన పని లేదు.
| పరీక్ష | AP Special TET 2026 (In-Service Teachers) |
| అధికారిక సైట్ | sptet.apcfss.in |
| మొత్తం మార్కులు | 150 (నెగటివ్ మార్కులు లేవు) |
| ఏమి చూపిస్తుంది | మొత్తం స్కోర్, శాతం, సెక్షన్ వారీ సరైనవి/తప్పు/వదిలినవి, తప్పు ప్రశ్నల నంబర్లు, అర్హత |
| మీ డేటా | మీ ఫోన్/కంప్యూటర్‌లోనే లెక్కిస్తుంది – ఎక్కడికీ పంపదు, సేవ్ చేయదు |
3 స్టెప్స్‌లో మీ స్కోర్
అదే Chrome లో sptet.apcfss.in తెరిచి లాగిన్ అయి, మెనూలో Response Sheet తెరవండి.
పైన ఉన్న అడ్రస్ బార్ (వెబ్‌సైట్ పేరు ఉన్న చోట) నొక్కి, ఉన్నదంతా తీసేయండి. ముందుగా ఇది టైప్ చేయండి:
వెంటనే దాని తర్వాత Paste చేసి Go / Enter నొక్కండి. 1–2 నిమిషాల్లో మీ స్కోర్ కార్డ్ అదే పేజీపై వస్తుంది (ఆ సమయంలో పేజీని తాకకండి).
ముఖ్యం: javascript: అనే పదం చేతితో టైప్ చేయాలి. Chrome పేస్ట్ చేసినప్పుడు ఆ పదాన్ని తీసేస్తుంది, అందుకే కాపీ కోడ్‌లో అది ఉండదు.
ఇంకా సులభం: ఒకసారి బుక్‌మార్క్ సేవ్ చేసుకోండి (ఐచ్ఛికం)
కంప్యూటర్ Chrome: ఈ బటన్‌ను Bookmarks bar లోకి లాగండి → TET Score. తర్వాత Response Sheet పేజీలో దాన్ని నొక్కితే చాలు.
మొబైల్ Chrome: ఈ పేజీని ☆ బుక్‌మార్క్ చేసి, Bookmarks లో దాన్ని Edit చేసి Name: TET Score, URL: javascript: టైప్ చేసి కాపీ కోడ్ పేస్ట్ చేయండి. తర్వాత Response Sheet లో అడ్రస్ బార్‌లో "TET Score" టైప్ చేసి ☆ సూచన నొక్కండి.
అర్హత మార్కులు (150 కి)
| కేటగిరీ | శాతం | కనీస మార్కులు |
|---|---|---|
| OC / EWS | 60% పైగా | 90 |
| BC | 50% పైగా | 75 |
| SC / ST / PwBD / Ex-Servicemen | 40% పైగా | 60 |
తరచుగా అడిగే ప్రశ్నలు
ప్ర: ఇది నా పాస్‌వర్డ్ లేదా మార్కులను ఎక్కడికైనా పంపుతుందా?
జ: లేదు. మీరు లాగిన్ అయిన అధికారిక పేజీలో కనిపించే Correct Option, Chosen Option లను మాత్రమే చదివి, మీ బ్రౌజర్‌లోనే లెక్కిస్తుంది. ఏ సర్వర్‌కూ పంపదు.
ప్ర: పేస్ట్ చేసి Enter నొక్కితే Google సెర్చ్ వచ్చింది?
జ: javascript: సరిగ్గా టైప్ కాలేదని అర్థం (ఉదా: jascript:, javascrip: అని పొరపాటు, లేదా చివర : మర్చిపోవడం). అడ్రస్ బార్ ఖాళీ చేసి javascript: టైప్ చేసి, తర్వాత పేస్ట్ చేయండి.
ప్ర: ఒక ప్రశ్నకు రెండు సరైన ఆప్షన్లు (ఉదా: 2, 3) ఉంటే?
జ: మీరు ఎంచుకున్నది వాటిలో ఏదైనా ఒకటి అయితే మార్కు ఇస్తుంది.
ప్ర: "చదవలేకపోయినవి" అని వస్తే?
జ: నెట్ స్లోగా ఉన్నప్పుడు ఇలా జరగవచ్చు. పేజీ రిఫ్రెష్ చేసి స్టెప్ 3 మళ్లీ చేయండి.
ప్ర: ఇదే నా ఫైనల్ రిజల్ట్‌నా?
జ: కాదు. ఇది initial key ఆధారిత అంచనా. అధికారిక final key, ఫలితాల తర్వాత మార్కులు మారవచ్చు.