కర్నూలు జిల్లా పట్టణ స్థానిక సంస్థల (Urban Local Bodies) 2వ సాధారణ ఎన్నికలు – 2026 కు సంబంధించి Presiding Officer (PO) / Assistant Presiding Officer (APO) నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం లిస్టు సుమారు 1200 పేజీలు ఉండటంతో, అందులో మీ ఆర్డర్ వెతకడం కష్టం. అందుకే ఈ పేజీలో మీ CFMS ID ఎంటర్ చేస్తే మీ ఒక్కరి ఆర్డర్ మాత్రమే PDF గా డౌన్లోడ్ అయ్యే సౌకర్యం ఏర్పాటు చేశాం.
🗳️ PO / APO ఆర్డర్ డౌన్లోడ్ – CFMS ID తో
| CFMS ID | |
| ఉద్యోగి పేరు | |
| ఆర్డర్ పేజీ నంబర్ |
మొదటిసారి సెర్చ్ చేసినప్పుడు ఆర్డర్ ఫైల్ లోడ్ అవ్వడానికి కొన్ని సెకన్లు పడుతుంది. తర్వాత సెర్చ్‌లు వేగంగా వస్తాయి. ఈ పేజీ నుంచి మీ ఆర్డర్ మాత్రమే డౌన్లోడ్ అవుతుంది – పూర్తి లిస్టు కాదు.
ఆర్డర్ డౌన్లోడ్ చేసే విధానం
- పై బాక్స్‌లో మీ CFMS ID టైప్ చేయండి (Payslip / CFMS పోర్టల్‌లో ఉంటుంది).
- “ఆర్డర్ వెతకండి” బటన్ నొక్కండి.
- మీ పేరు, పేజీ నంబర్ కనిపించాక “నా ఆర్డర్ డౌన్లోడ్” నొక్కండి. PO_APO_Order_మీCFMSID.pdf పేరుతో ఫైల్ సేవ్ అవుతుంది.
- ఆర్డర్ ప్రింట్ తీసి, కింద ఉన్న Acknowledgement భాగం సంతకం చేసి సంబంధిత అధికారికి ఇవ్వండి.
ముఖ్యమైన తేదీలు
| అంశం | వివరాలు |
|---|---|
| ఆర్డర్ నంబర్ | H1/569/Local Body Elections/2026, తేదీ 16-10-2026 |
| శిక్షణ తరగతి | 18-10-2026, ఉదయం 10 గంటలకు (మీ ఆర్డర్లో ఉన్న తేదీ/సమయం చూసుకోండి) |
| శిక్షణ వేదిక | Govt. Junior College (Town), Opp. Coles Church, Near Old Control Room, Kurnool |
| పోలింగ్ తేదీ | 28-10-2026, ఉదయం 7.00 నుండి సాయంత్రం 5.00 వరకు |
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
నా CFMS ID ఎంటర్ చేసినా “దొరకలేదు” అని వస్తోంది?
CFMS ID సరిగ్గా ఉందో ఒకసారి చెక్ చేయండి. అయినా రాకపోతే, మీకు డ్యూటీ వచ్చిందో లేదో సంబంధిత అధికారి (కార్యాలయ అధిపతి / MEO / ఎన్నికల సెల్) ద్వారా తప్పనిసరిగా తెలుసుకోండి. ఇతర కేటగిరీ (OPO మొదలైనవి) ఆర్డర్లు విడిగా వస్తే ఇక్కడే అప్డేట్ చేస్తాం.
మొబైల్లో డౌన్లోడ్ అవుతుందా?
అవుతుంది. Chrome బ్రౌజర్ వాడితే మంచిది. డౌన్లోడ్ అయిన ఫైల్ “Downloads” ఫోల్డర్లో ఉంటుంది.
నా పేరులో / మొబైల్ నంబర్లో తప్పు ఉంటే?
ఆర్డర్లో వివరాలు తప్పుగా ఉంటే శిక్షణ తరగతి రోజున లేదా మీ మండల విద్యాశాఖాధికారి (MEO) ద్వారా ఎన్నికల సెల్‌కు తెలియజేయండి.
ఈ సౌకర్యం ఉద్యోగుల సౌలభ్యం కోసం మాత్రమే. ఆర్డర్‌లోని వివరాలు Collector & District Election Authority, Kurnool జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారమే ఉంటాయి.