Monday, December 28, 2020

JAGANANNA AMMAVODI

The Hon’ble Chief Minister, Government of Andhra Pradesh has announced a flagship programme “AMMA VODI” as a part of “NAVARATNALU” for providing financial assistance to each mother or recognized guardian in the absence of mother, who is below poverty line household, irrespective of caste, creed, religion and region to enable her to educate her child/children from Class I to XII (Intermediate Education) in all recognized Government, Private Aided and Private Unaided schools/ Jr. Colleges including Residential Schools/Colleges in the State from the Academic year 2020-2021.

CONTACT US

4th Floor, B block, VTPS Rd, Bhimaraju Gutta,

Ibrahimpatnam, Andhra Pradesh 521456.

Phone : 9705655349, 9705454869

Email : apcse.@ap.gov.in

జగనన్న అమ్మఒడి పథకానికి సంభందించి ఇంటర్ మొదటి సంవత్సరం అర్హుల జాబితా విడుదల అయ్యింది, అర్హుల జాబితా గత సంవత్సరం విద్యార్థులు ఎక్కడ పదవతరగతి చదివారో ఆ High School లాగిన్ లో లిస్ట్స్ ఇవ్వడం జరిగింది.

All the DyEOs and MEOS are  informed that Intermediate 1st year list of eligible candidates are enabled in previous studying school (10th class).Hence they're requested to issue instructions  to the Headmasters of secondary schools in their jurisdictions to download the list and publish on the notice board and take necessary action as per the instructions issued earlier.

అమ్మవడి 2020 - 21 కి సంబంధించి జిల్లాలో చదువుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు యొక్క జాబితాను వారి పూర్వపు పదోతరగతి చదివిన పాఠశాల నందు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కావున విద్యార్థులు ఆయా పాఠశాలకు వెళ్లి తమ పేర్లను చూసుకొని వలసినదిగా తెలపడమైనది. ప్రధానోపాధ్యాయులు వారి వారి అమ్మఒడి లాగిన్ నుండి ఈ విద్యార్థుల జాబితాను డౌన్లోడ్ చేసుకొని పాఠశాల నందు ప్రదర్శించ వలెను. మరియు గ్రామ సచివాలయం నందు సంతకము చేసి ఇవ్వవలెను. ఈ జాబితాలో ineligibility పొందిన విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు వారి యొక్క అర్హతకు సంబంధించిన పత్రములతో  కూడినఅర్జీలను సంబంధిత గ్రామ సచివాలయం నందు సమర్పించ వలెను. ప్రధానోపాధ్యాయులకు ఈ క్రింది తెలిపిన సౌకర్యములను కల్పించబడినవి

1. ఆధార్ నెంబర్ సరి చేయుట

 2. అర్హత కలిగిన తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ సరి చేయుట

3.  అర్హత లేకపోయినా నేను అర్హతగల జాబితాలో ఉన్న విద్యార్థులను అనర్హత జాబితాలో చేర్చుట

 3. ఆక్టివ్ డ్రాప్ అవుట్ లో ఉన్న విద్యార్థులను ట్యాగింగ్ చేయుట

 4. అనాధ విద్యార్థులను ఖరారు చేయుట మరియు వారికి బ్యాంక్ అకౌంట్  ఓపెన్ చేయుట.

 ఈ కార్యక్రమం మొత్తం 30.12.2020 లోపు పూర్తి అగునట్లు చూడవలెను.

జగనన్న అమ్మఒడి పథకంకు సంభందించి లేటెస్ట్ జీ.ఓ. నెంబర్ 63, Dt. 28.12.2020 విడుదల, ఈ ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు కూడా 14000 Rs. ఇచ్చి Toilet maintanence కు స్కూల్ a/c కు 1000 లు క్రెడిట్  చేయబడును ప్రైవేటు స్కూల్ విద్యార్థులకు కలెక్టర్ ఆధ్వర్యంలో లోని DTMF కు క్రెడిట్ చేయడం జరుగుతుంది.

అమ్మ ఒడిలో WITH HELD లో ఉంచబడ్డ విద్యార్థుల రేషన్ కార్డులను పరిశీలిస్తే , వాళ్ల తల్లుల రేషన్ కార్డులో ఆ పిల్లల వివరాలు నమోదు కాలేదని గమనించండి . అందువల్ల ఈ సమస్యను పరిష్కరించడానికి వారి వార్డు వాలంటీర్ లను సంప్రదించమని , వారి ద్వారా మ్యాపింగ్ మరియు ఈ కేవైసీ చేయించుకోవాలని విద్యార్థులకు లేదా వారి తల్లిదండ్రులకు తెలియజేయవలసినది. ఇలా ఈ కేవైసీ మరియు మ్యాపింగ్ చేయించిన 24 గంటల నుండి రెండు రోజుల లోపల  విద్యార్థు లు ఎలిజిబుల్ అవుతారని సమాచారం. కాబట్టి mother aadhar not tallied అని రిమార్క్స్ ఉన్న విద్యార్థులకు కు ఈ కేవైసీ మరియు మ్యాపింగ్ చేయించవలసినది.

అమ్మఒడి సమాచారం :మీ పాఠశాల లో ఎవరైనా విద్యార్ధులకు ఆధార్ నాట్ వ్యలిడ్ అనివస్తే మీ గ్రామ వాలంటీరు ద్వారా AEPDS(AADHAR ENABLED PUBLIC DISTRIBUTION SYSTEM) లో కుంటుంబంలో 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ధంబ్ వేయవలెను. అంతకు ముందే అందరూ e- KYEC చేయించు కొనవలెను. అప్పుడు 24 గంటల తరువాత  ఆ విద్యార్థి ఎలిజిబుల్ లిస్టులోనికి వస్తారు.

అమ్మఒడి పథకానికి అర్హత కలి గిన, అర్హత లేని, విత్ హెల్త్ జాబితాలోని లోపాలు సరి చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ. అమ్మ ఒడి లబ్దిదారుల జాబితాలను ప్రతి పాఠశాలలో నోటీసు బోర్డులో ఉంచాలని సూచించారు. లోపాలు సరిచేసిన తుది జాబితాను ఈ నెల 29వ తేదీన హెచ్ఎం, పీసీ కమిటీ సభ్యుల సంతకాలతో గ్రామ సభ ఆమోదానికి సమర్పించాలని, 30న ఆమోదించిన జాబితాను ఎంఈఓ కార్యాలయంలో అందజేయాలని వెల్లడించారు.


పేద విద్యార్థుల తల్లులకు అమ్మఒడి పథకం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ చదివే అర్హులకు రూ.15వేల చొప్పున నగదు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాల్లో అర్హుల జాబితాను అధికారులు విడుదల చేశారు. నమోదులో చిన్న, చిన్న తప్పులతో ఎక్కువమంది అనర్హులుగా మిగిలిపోయారు. ఇలాంటి వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈనెల 29 సాయంత్రం 5 గంటలలోపు అర్హులు తప్పులు సరిచేసుకోవచ్ఛు సంబంధిత ఆధారాలతో సచివాలయాలకు వెళ్లి సంక్షేమ సహాయకుణ్ని కలిసి వివరాలివ్వాలి. అమ్మఒడి కొత్త వర్షన్‌ సాఫ్ట్‌వేర్‌తో మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించారు. రేషన్‌ కార్డు సమస్యతో అమ్మఒడి పథకంలో అనర్హులుగా తేలినవారు ఇప్పుడు తప్పులు సరిచేసుకోవచ్చని మండల విద్యాధికారి వెంకటరమణ నాయక్‌ సూచించారు. విద్యుత్తు బిల్లు తక్కువ వచ్చిందని లెటర్‌, వీఆర్వోతో భూమి ఎక్కువ లేదని మరో పత్రం, ప్రభుత్వ ఉద్యోగి పిల్లలు కాదన్న ఆధారం, ఆదాయపన్ను కట్టలేదని ధ్రువీకరణ పత్రం, ఇలా ఆరు రకాల పరిశీలనలకు సంబంధించిన వివవరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాలన్నారు. ఈనెల 29వ తేదీ వరకు అవకాశం ఉంది. ఒక పాఠశాలలో చదివి మరో బడిలో చేరిన వారు కూడా గుర్తింపుకార్డు చూపి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.


 JAGANANNA AMMAVODI GUIDELINES

SEARCH CHILD DETAILS FOR AMMAVODI 2020-21

AMMAVODI 2020-21 DISTRICT WISE LOGINS









1 comment: