Sunday, May 3, 2020

AP EDUCATION ACADEMIC YEAR START WITH AUGUST 2020

AP EDUCATION ACADEMIC YEAR  START WITH AUGUST 2020

ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ లో కీలక మార్పులు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 12 నుంచి April 23 వరకు విద్యా సంవత్సరంగా ఉండేది. అయితే కరోనా ఉధృతి తగ్గకపోవడంతో ఈ.  సంవత్సరం ఆగష్టు నుంచి 2021 జులై వరకు విద్యా సంవత్సరం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్ వల్ల మార్చి నెల మూడవ వారం నుంచి పిల్లల చదువులకు బ్రేక్ పడింది. పరీక్షలు ముగియకుండానే అర్ధాంతరంగా విద్యాసంవత్సరం ముగిసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించకుండానే 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రమోట్ చేస్తున్నట్టు ప్రకటన చేశాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం విద్యా సంవత్సరం క్యాలెండర్ ను మారుస్తూ నిర్ణయం తీసుకుంది.


ఏపీ ప్రభుత్వం ఆగష్టు 1 నుంచి 2021 జులై 31 వరకు విద్యా సంవత్సరంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేసిన రెండు వారాల తరువాత పదో తరగతి పరీక్షలు జరిగే అవకాశం ఉంది.

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఇకపై ఇంటర్ ఉంటే మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని కీలక ప్రకటన చేసింది. దశాబ్దాల నుంచి దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే పదవ తరగతి అర్హతగా ఉంది. త్వరలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలకు కనీస అర్హత గురించి పూర్తి విషయాలను వెల్లడించనుంది. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయంతో పాటు అకడమిక్ క్యాలెండర్ విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది.


0 comments:

Post a Comment