WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

INTER ONLINE CLASSES

INTER ONLINE CLASSES 2020-21

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైతే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. మొత్తం పాఠాలను నిపుణులైన లెక్చరర్లతో వీడియో రికార్డు చేయించనున్నారు. ఆ వీడియోలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. వీటిని ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా వినియోగించుకోవచ్చు. జూన్‌ నుంచి ఆన్‌లైన్‌ వీడియోలు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులకు ఏదైనా పాఠం అర్థం కాకపోయినా, రెడ్‌జోన్‌లో ఉండి తరగతులకు హాజరుకాలేని వారు సైతం వాటిని వినియోగించుకోవచ్చు.

👉రూపకల్పన ఇలా..


* ఒకపాఠంపై ముగ్గురు, నలుగురు లెక్చరర్ల నుంచి పాఠ్యాంశాలు (కంటెంట్‌) స్వీకరిస్తారు. ఎంపికైన వారినుంచి పాఠం రికార్డు చేస్తారు.

* తేలికగా అర్థమయ్యేందుకు అవసరమైన వీడియోలను జత చేస్తారు.

* ఇంటర్‌ అకడమిక్‌ జూన్‌నుంచి ప్రారంభమవుతుంది. ఆ నెలకు ఒక్కో సబ్జెక్టు నుంచి 3 పాఠాలు అవసరం కానున్నాయి. ముందు వాటిని పూర్తి చేస్తారు.

* మొదటి ఏడాది ప్రవేశాలు జాప్యం కానున్నందున ముందుగా రెండో ఏడాది పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.