Sunday, December 1, 2019

FIT INDIA SCHOOL WEEK PROGRAM

శారీరక సౌష్టవం వారోత్సవాల కార్యక్రమం 


How to participate?

“Schools shall ensure that all Students’, Parents, Staff and Management shall actively participate in the proposed Fitness Week Celebration. The Schools may create a new page on their website titled “Fit India School Week” and a brief about the activities undertaken and related pictures/videos be uploaded on it.

Schools should register themselves on official Fit India Portal: http://fitindia.gov.in/fit-india-school-week and upload the pictures/videos related to the event.

All schools will be recognised in form of Digital Certificate which they can download from Fit India Portal after successful conduct of the Fit India School Week

 I have read and understood the concept of Fit India School Week event guidelines. I agree to follow the guidelines of organising/joining an Event

FIT INDIA SCHOOL REGISTRATION 


DOWNLOAD FIT INDIA SCHOOL RATING CIRCULAR


Day Activity

01 DAY
(i) Morning Assembly – Yoga for all
(ii) Activities on Fitness and Nutrition for Students and Staff

02 DAY
(i) Morning Assembly – Free hands exercise for all
(ii) Mental Fitness Activities (Ex. Debates, Symposium, Lectures by Sports Psychologists)

03 DAY
(i) Beginning of “Fitness Assessment” of Students through KHELO INDIA App.
(ii) Poster making Competition for all Students on theme “Fit Body – Fit Mind – Fit Environment”

04 DAY
(i) Physical Activities for all Students including Dance, Aerobics, Yoga, Martial Arts, Rope-Skipping, Gardening etc.
(ii) Essay/Poem Writing Competition for all Students on theme “Fit India School”

05 DAY
Fitness/Sports Quiz for all Students

06 DAY
Competition for Students, Staff and Parents in Traditional/Indigenous/Regional Games – To celebrate the Unity in Diversity of our Nation and to maintain and strengthen the fabric of traditionally existing emotional bonds between the people of our Country; Engagement Matrix between States and UTs have been done. Against each pair of State/UTs, the suggestive traditional games list too has been given. Schools may engage its students in minimum one game of its choice from the partner state (Refer annexure “A”).
Children, Parent and Teacher participants may also participate in exploring the history and interesting facts of the indigenous games from partner States.

DOWNLOAD TELUGU GUIDELINES

తరగతి గదిలో నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థుల్లో శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం శారీరక సౌష్టవ ఉత్సవాలను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత గురుకుల మునిసిపల్ సాంఘిక సంక్షేమ గిరిజన పాఠశాలల్లో శారీరక వారోత్సవాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఏక్ భారత్ శ్రేష్ట భారత్ లో భాగంగా దేశవ్యాప్తంగా వినియోగంలో ఉన్న భాషలను మరొక రాష్ట్రానికి పరిచయం చేయాలని ఉద్దేశంతో భాష పరిచయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి రాష్ట్రాన్ని మరో రాష్ట్రం తో అనుసంధానం చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా మన రాష్ట్రాన్ని పంజాబ్ తో అనుసంధానం చేసి రోజు పాఠశాల అసెంబ్లీలో కొన్ని పంజాబీ పదాలను చెప్పించి వాటికి అర్థాలను విద్యార్థులకు తెలియ జేయాల్సి ఉంది. విద్యార్థులు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలని భావిస్తున్నారు.

వారోత్సవాల షెడ్యూల్

తొలి రోజు ఉదయం అసెంబ్లీలో యోగసాధన చేయించడం తో పాటు విద్యార్థులు ఉపాధ్యాయులకు శారీరక దారుఢ్యం పోషణ పై అవగాహన కల్పిస్తారు. రెండో రోజు అసెంబ్లీలో చేతులతో వ్యాయామం మానసిక ఆరోగ్యం పై అవగాహన కోసం చర్చలు క్రీడా మానసిక తత్వవేత్తల తో ఉపన్యాసాలను నిర్వహిస్తారు. మూడోరోజు ఖేల్ ఇండియా మ్యాప్ ద్వారా విద్యార్థుల ఫిట్నెస్ అసెస్మెంట్ ప్రారంభమవుతుంది. ఫిట్ బాడీ ఫిట్ మైండ్  ఫిట్ ఎన్విరాన్మెంట్ అనే అంశాలపై విద్యార్థులకు పోస్టర్ తయారీపై పోటీలను నిర్వహిస్తారు. నాలుగో రోజు నృత్యం ఏరోబిక్స్ యోగా మార్షల్ ఆర్ట్స్ రోప్ స్కిప్పింగ్ గార్డెనింగ్ తదితర అంశాల్లో విద్యార్థులకు శిక్షణ కల్పిస్తారు. ఐదో రోజు విద్యార్థులందరికీ ఫిట్నెస్ స్పోర్ట్స్ క్విజ్ నిర్వహిస్తారు అన్ని స్కూళ్లలో ఈ కార్యక్రమం నిర్వహణ తప్పనిసరి.

పాఠశాలల వారీగా పోర్టల్ లో నమోదు 

కార్యక్రమంలో పాల్గొనేందుకు అయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఫిట్ ఇండియా వీక్ పోర్టల్ లో నమోదు చేసుకోవాల్సి ఉంది. ప్రత్యేక యూజర్ ఐడి, పాస్వర్డ్ రూపొందించుకొని వారం రోజులపాటు జరిగే కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. పోర్టల్ లో  నమోదైన పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామ పెద్దల వివరాలతోపాటు రోజువారీ నిర్వహించిన కార్యక్రమాల వివరాలను అప్లోడ్ చేయాలి.

పాఠశాలలకు  రేటింగ్స్ 

ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తున్న పాఠశాలలకు భారత క్రీడా ప్రాధికార సంస్థ కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. జిల్లావ్యాప్తంగా క్రీడా అధికారులు ప్రమాణాల ఆధారంగా సమగ్ర శిక్ష అభియాన్ అధికారులతో సమన్వయం చేసుకొని పాఠశాలలకు రేటింగు ఇస్తారు. నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా గా త్రీ స్టార్, ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు.

మొత్తం 06 పనిదినాలు ఈ శారీరక సౌష్టవ ఉద్యమానికి ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో “శారీరక సౌష్టవ వారోత్సవాలు” గా జరుపుకోవాలని సమగ్రశిక్ష, పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది. అందువల్ల ఈ ఉద్యమం బాలబాలికలలో ఉన్న మందబుద్ధిని మరియు నిష్క్రియాత్మక ప్రవర్తనను తొలగించి ఉత్తేజపూరితులుగా మార్చడానికి ప్రయత్నిస్తుంది మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని సాధించడానికి విద్యార్థులందరిలో ఆటలయందు ఆసక్తిని పెంపొందించడానికి దోహదకారి అవుతుంది. ఇటువంటి కదలిక విద్యార్థులలో క్రమమైన శారీరక శ్రమ మరియు శారీర ధారుడ్యం పై అవగాహన, ఆత్మగౌరవం మరియు విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ కార్యక్రమం యొక్క ఆరు రోజుల కార్యాచరణ మరియు కృత్యాలను ఈ క్రింద పొందుపరచడం జరిగింది.

🏵శారీరక సౌష్టవ వారోత్సవాలు(తేదీ 2/12/2019 నుంచి 7/12/2019 )మార్గదర్శకాలు.

ప్రతి పాఠశాల  కచ్చితం గా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిష్ట్రేషన్ కోసం Mail Id కూడా అందుబాటులో ఉంచుకోవాలి. రిజస్ట్రేషన్ అయిన వెంటనే స్కూలు వివరాలు అడుగుతుంది. వాటి వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.

1. ప్రిన్సిపాల్ పేరు: అంటే సంబంధిత పాఠశాల ప్రధనోపాధ్యాయుడు పేరు/ ప్రిన్సిపాల్ పేరు.
2. ప్రిన్సిపాల్ మొబైల్: సంబంధిత పాఠశాల ప్రధనోపాధ్యాయుడు మొబైల్ నంబర్.
3. అఫిలియేషన్ నంబర్: సంబంధిత పాఠశాల యొక్క రికగ్నిషన్ నంబర్.
4. స్కూల్ పేరు: సంబంధిత పాఠశాల పేరు
5. పాఠశాల అడ్రస్: సంబంధిత పాఠశాల అడ్రెస్స్.
6. రీజియన్: ఇక్కడ చెన్నయ్ అని పెట్టుకోవచ్చు.
7. సిటీ: మీ దగ్గర లో గల సిటీ నీ ఎంచోకొగలరు.
8. స్టేట్: ఆంధ్ర ప్రదేశ్
9. ఫైల్ ఎన్నిక(file upload): ఇక్కడ రిజిస్టర్ అయిన పాఠశాల ఫోటో  అప్ లోడ్ చేయాలి.

ఆరు రోజుల కార్యాచరణ

మొదటి రోజు చేయవలసిన కృత్యం

(అ) ఉదయం అసెంబ్లీ-యోగా
(ఆ) విద్యార్థులు మరియు సిబ్బందికి శారీరక ధారుడ్యం మరియు పోషణపై అవగాహన కల్పించుట.

• రెండవ రోజు చేయవలసిన కృత్యం 

(అ) ఉదయం అసెంబ్లీ-చేతులతో వ్యాయామం
(ఆ) మానసిక ధారుడ్యంపై అవగాహనా కార్యక్రమం (ఉదా : చర్చలు, క్రీడా, మానసిక తత్వవేత్తల ఉపన్యాసాలు)
• మూడవ రోజు చేయవలసిన కృత్యం

(అ) ఖేల్ ఇండియా యాప్ ద్వారా విద్యార్ధుల "ఫిట్ నెస్ అసెస్ మెంట్” ప్రారంభం.
(ఆ) “ఫిట్ బాడీ - ఫిట్ మైండ్ - ఫిట్ ఎన్విరాన్ మెంట్” అనే అంశాలపై విద్యార్థులందరికీ పోస్టర్ తయారీ పై పోటీ నిర్వహణ.
• నాల్గవ రోజు చేయవలసిన కృత్యం 

(అ) నృత్యము, ఏరోబిక్స్, యోగా, మార్షల్ ఆర్ట్స్, రోప్-స్కిప్పింగ్, గార్డెనింగ్ మొదలైన అంశములపై విద్యార్థులందరికీ శిక్షణా కార్యక్రమం.
(ఆ) "ఫిట్ ఇండియా స్కూల్” అనే అంశంపై విద్యార్థులందరికీ వ్యాసరచన / పద్య రచన పోటీల నిర్వహణ.
• ఐదవ రోజు చేయవలసిన కృత్యం

(ఆ) విద్యార్థులందరికీ ఫిట్ నెస్ పై స్పోర్ట్స్ క్విజ్

 • ఆరవ రోజు చేయవలసిన కృత్యం

 సాంప్రదాయ / స్వదేశీ / ప్రాంతీయ ఆటలలో ( ఉదా : కబడ్డీ, ఖోఖో ఆట, బొంగరాల ఆట, దొంగ పోలీస్ ఆట, గొలుసు ఆట, గోటి ఆట, పులి ఆట) విద్యార్థులు, సిబ్బంది మరియు తల్లిదండ్రుల కోసం పోటీల నిర్వహణ, మన దేశ వైవిధ్యంలో ఐక్యతను, మన దేశ ప్రజల మధ్య సాంప్రదాయకంగా ఉన్న భావోద్వేగ బంధాలను బలోపేతం చేయడం మొదలగు అంశాలపై విద్యార్థులను, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసి ఉత్తేజ పూరితమైన మరియు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయుట.

నా ఈవెంట్ అన్న విషయం లో మనం చేయాల్సినది, ముఖ్యమైనవి.

🏵మొదటగా మీ యొక్క ఈవెంట్స్ అన్న చోట క్లిక్ చేసినప్పుడు, ఈవెంట్ కేటగిరీ అని వస్తుంది. అప్పుడు స్కూల్ వీక్ అని ఎంచుకోవాలి,

తరువాత ఈవెంట్ కోసం పోస్టర్ చిత్రాన్ని అప్ లోడ్ చేయండి అని ఉన్న చోట మీ స్కూల్ తరుపున ఏర్పరిచిన పోస్టర్ ను అప్లోడ్ చేయాలి.

తరువాత ఈవెంట్ రకం రిజిష్టర్ అన్న చోట పబ్లిక్ మరియు మల్టీ డే ను ఎంచుకోవాలి. ఆలా ఎంచుకున్న వెంటనే కార్యక్రమం యొక్క డేట్స్ ను నమోదు చేయాలి.

తరువాత ఈవెంట్ పేరు, ఆ కార్యక్రమంలో మీరు ఏమి చేయబోతున్నారు మరియు మిగతా వివరాలు నమోదు చేసి పూర్తీ చేయాలి.

అ) పాల్గొనే వారి వివరాలు గురించి :

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొత్తం అనగా టీచర్స్, స్టూడెంట్స్, ఇతర పెద్దలు మరియు గ్రామస్తులు యొక్క వివరాలు నమోదు చేయాలి? ఈ విధంగా నమోదు చేయబడిన అందరికి డిజిటల్ సరిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెంట్ ఫోటోలను అప్లోడ్ చేయండి :
ఈ కార్యక్రమంలో చాల ముఖ్యమైన పని ఏమిటంటే మీరు చేసిన ప్రతి చిన్న మరియు పెద్ద కార్యక్రమాలను ఎప్పుఇకప్పుడు చిత్రాలు మరియు వీడియోస్ రూపంలో పొందుపరుచుకోవాలి. వాటిని మీ లేదా స్కూల్ యొక్క ఫేస్ బుక్/యూట్యూబ్ ద్వారా పంచుకోవాలి. ఇక్కడ ఈ కార్యక్రమాలకు సంబందించిన వారు తీసిన చిత్రాలు, మొబైల్ / వీడియోస్ మరియు మీడియా క్లిప్పింగ్స్ ను అప్ లోడ్ చేయాలి.


2 comments: