SBI DEBIT CARDLESS ATM CASH WITHDRAWALS PROCESS
YONO CASH... FOR ALL CARDLESS ATM CASH WITHDRAWALS
Forgot or lost your ATM card? Don't let that be a dampener on good times! Withdraw cash without your Debit Card from SBI ATMs using #YONOSBI's #YONOCash feature.
జేబులో ఏటీఎం కార్డు లేదా? OR ఏటీఎం కార్డు పోగొట్టు కున్నారా ? అయినా డబ్బులు డ్రా చేయండి ఎలా?
🔖SBI YONO CASH | ఏటీఎం కార్డు మర్చిపోయి మార్కెట్‌కు వెళ్లారా? అర్జెంట్‌గా డబ్బులు అవసరమయ్యాయా? కార్డు లేదని డబ్బులు డ్రా చేయలేకపోతున్నారా? ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు. ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన ఎస్‌బీఐ యోనో క్యాష్‌తో ఇది సాధ్యం. ఎలాగో తెలుసుకోండి.
🔖1. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమరా? మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉందా? మీరు ఏటీఎం కార్డు మర్చిపోయినా... మీ కార్డు అందుబాటులో లేకపోయినా... ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు
🔖2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఫీచర్ ఇది. ఇందుకోసం మీకు YONO యాప్ ఉండాలి. ఈ యాప్ ఉంటే దేశంలోని 16,500 ఎస్‌బీఐ ఏటీఎంలల్లో ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయొచ్చు.
🔖3. ఈ సర్వీసు ఉన్న ఏటీఎంలకు 'యోనో క్యాష్ పాయింట్స్' అని నామకరణం చేసింది ఎస్‌బీఐ. కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయడం ద్వారా స్కిమ్మింగ్, క్లోనింగ్ లాంటి మోసాలను తగ్గించొచ్చని ఎస్‌బీఐ భావిస్తోంది
🔖4. యోనో యాప్‌లో యోనో క్యాష్ ద్వారా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సాధ్యమవుతుంది.2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది
🔖5. కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్ కోసం ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో YONO యాప్ డౌన్‌లోడ్ చేయాలి. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లల్లో ఈ యాప్ పనిచేస్తుంది.
🔖6. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ యోనో క్యాష్ క్లిక్ చేయాలి. అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి.
🔖7. ఆరు అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది.
🔖8. మీకు దగ్గర్లో ఉంటే యోనో క్యాష్ పాయింట్‌కు వెళ్లాలి. ముందుగా మీకు ఎస్ఎంఎస్‌లో వచ్చిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు యాప్‌లో ఎంటర్ చేసిన అమౌంట్‌ను ఏటీఎంలో ఎంటర్ చేయాలి.
🔖9. మీరు యాప్‌లో క్రియేట్ చేసిన 6 అంకెల యోనో క్యాష్ పిన్‌ను ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
🔖10. ఇలా కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం కల్పించిన మొట్టమొదటి బ్యాంక్ ఎస్‌బీఐ కావడం విశేషం.
వీడియో చూసి అవగాహనా చేసుకోగలరు
SBI DEBIT CARDLESS CASH WITHDRAWALS PROCESS VIDEO
0 comments:
Post a Comment