Monday, August 12, 2019

Reliance 42nd Annual General Meeting highlights

Reliance  42nd Annual General Meeting  highlights

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  42వ వార్షిక సర్వసభ్య సమావేశం ముఖ్యంశాలు 


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  42వ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. రిలయన్స్‌ అధినేత, సీంఎడీ ముకేశ్‌ అంబానీ సహా, ఆయన కుటుంబం ఈ మీటింగ్‌కు తరలి  వచ్చింది. ముఖ్యంగా ముకేశ్‌ అంబానీ తల్లి,  భార్య నీతూ అంబానీ,  కుమార్తె ఆశ, కుమారుడు ఆకాశ్‌ అంబానీతోపాటు  కీలక వాటాదారులు, ఇతర ప్రమోటర్లు హాజరయ్యారు.

అధినేత ముకేశ్‌ అంబానీ వాటాదారులనుద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు.  దేశంలో అత్యున్నత విలువ కల కంపెనీగా తన సత్తా చాటుదోందని, భారత ఆర్థిక  వ్యవస్థలో  రిలయన్స్‌ కీలక  భూమికను పోషిస్తోందని తెలిపారు. రిలయన్స్‌ వృద్ధి, అలాగే భారత ఆర్థికవ్యవస్థ  ప్రస్తుతం ఉన్నంత ప్రకాశవంతంగా ఇంతకుముందెన్నడూ కనిపించలేదని అంబానీ పేర్కొన్నారు. ఇండియా వృద్ధిని,  రిలయన్స్‌ ఎదుగుదలను ఆపడం ఎవ్వరి తరమూ కాదని ఆయన వెల్లడించారు. న్యూ ఇండియా, న్యూ రిలయన్స్‌ అనే నినాదాన్నిచ్చారు.  ఈ సందర్భంగా  రిలయన్స్‌, బీపీ  ఒప్పందాన్నిప్రస్తావించారు. రానున్న 12 నెలల్లో జియో ఫైబర్ భారీగా విస్తరిస్తుంది  బ్రాడ్‌బాండ్ సిగ్నల్ వచ్చేలా సెట్‌టాప్ బాక్స్‌ను సిద్ధం చేశామని ముఖేశ్ స్పష్టం చేశారు.  జియో ఫైబర్‌నెట్‌ ద్వారా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ క్లౌడ్ కనెక్టివిటీ అందజేస్తామని తెలిపారు. వినియోగదారుల సంఖ్యలో 340 మిలియన్ల మార్క్‌ను దాటేశాం. రిలయన్స్  భవిష్యత్తు ప్రణాళికలపై అంబానీ చేయనున్న ప్రకటనలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

 అంబానీ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు :

2030 నాటికి భారత ఎకానమీ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.
రిలయన్స్ పెట్రోలియంతో బ్రిటిష్ ఆయిల్ కంపెనీ ‘బీపీ ఆయిల్ ఇండస్ట్రీ’ చేతులు కలపబోతోంది.
సౌదీ కంపెనీ ఆరామ్కో 20 శాతం పెట్టుబడులు .
భారతీయులు డిజిటల్‌పై ఏటా రూ.5లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని, దానిలో భాగంగా జియో రూ.3.5లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది.
జియో మూడేళ్లు పూర్తి చేసుకోబోతోంది.
వినియోగదారుల సంఖ్యలో 340 మిలియన్ల మార్క్‌ను దాటేశాం.
జియో వినియోగదారులకు  ప్రత్యేక ధన్యవాదాలు.  మీ అందరి ప్రోత్సాహంతోనే ఈ ఘనతను సాధించాం.
ప్రతి నెల కోటి మంది కొత్త వినియోగదారులు కొత్తగా జియోలో చేరుతున్నారు.
ఇషా, ఆమె సోదరుడు ఆకాశ్ అంబానీ

జియోతో హై ఎండ్ వీడియో కాన్ఫరెన్స్ ఎలా చేయవచ్చో లైవ్‌గా చేసి చూపించారు ఇషా, ఆమె సోదరుడు ఆకాశ్ అంబానీ. ఈ సందర్భంగా ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. మల్టీ ప్లేయర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు.  గిగా ఫైబర్‌లో ఉండే ఏఆర్,  వీఆర్ తో షాపింగ్‌ అనుభవాన్ని పొందవచ్చన్నారు. ఇంటి వద్దనుంచే  మనకు సరిపడే దుస్తుల షాపింగ్  చేయవచ్చని తెలిపారు.  అంతేకాదు ఇంట్లో థియేటర్‌ అనుభవాన్ని ఎలా పొందవచ్చో కూడా  చూపించారు.
జియో గిగా  పైబర్‌ ఫీచర్లు 



  • మన ఇంట్లో ఉన్న టీవీ స్క్రీన్ల పైనే వీడియో కాలింగ్‌ ద్వారా ఒకేసారి నలుగురితో మాట్లాడవచ్చు.
  • జియో నుంచి నెలకు రూ. 500తో అమెరికా, కెనడాకు అపరిమిత కాలింగ్‌ ప్యాకేజీ.
  • జియో ఫైబర్‌ ద్వారా భారత్‌లోని ఏ టెలికాం ఆపరేటర్‌కైనా ఇంటి నుంచే ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ఈ ఉచిత సేవలు జీవితకాలం ఉంటాయి.
  • ప్రీమియం జియో ఫైబర్‌ కస్టమర్లు సినిమా విడుదలైన రోజే తమ ఇంట్లో చూసుకోవచ్చు. ‘జియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’గా పిలిచే ఈ సేవలను 2020 మధ్యలో అందుబాటులోకి తీసుకొస్తాం.
  • ప్రపంచంలో  ఏమూలనున్నవారితోనైనా వీడియో కాలింగ్‌,  కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుకోవచ్చు.
  • జియో ఫైబర్‌ ద్వారా 100 ఎంబీపీఎస్‌ నుంచి 1 జీబీపీఎస్‌ వరకు డేటా.
  • జియో ఫైబర్‌ కస్టమర్లకు 4కే ఎల్‌ఈడీ టీవీ, , 4జీ సెట్‌ టాప్‌ బాక్స్‌ ఉచితం.
  • రూ. 700 - రూ.10వేల మధ్య జియో గిగా ఫైబర్‌ తారిఫ్స్‌ - ముకేశ్‌ అంబానీ . 
  • జియో మూడవ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబరు 5 న జియో గిగా ఫైబర్‌ కమర్షియల్‌ లాంచ్‌  -సాక్షి  న్యూస్ 




0 comments:

Post a Comment