Sunday, August 25, 2019

LANGUAGES FESTIVAL GUIDELINES

LANGUAGES FESTIVAL GUIDELINES

తెలుగు బాషా పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి జయంతిని పురష్కరించుకొని సోమవారం నుంచి ఈనెల 29వతేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో తెలుగు భాషా దినోత్సవాలు నిర్వహించాలి

26 ఆగస్టు 2019 - ఆంగ్ల భాష
27 ఆగస్టు 2019 -  సంస్కృతము, హిందీ మరియు ఉర్దు భాష
28 ఆగస్టు 2019 - గిరిజన భాష, కన్నడ, తమిళం మరియు ఒరియా
29 ఆగస్టు 2019 - తెలుగు భాష కీ.శే. శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతిని పురస్కరించుకొని 29 ఆగష్టు 2019 న ఈ కృత్యాలను తెలుగు భాషాభివృద్దికై నిర్వహించవలెను.
 భాషోత్సవములో విద్యార్ధులకై నిర్వహించు కృత్యములు అమలు చేయు విధానము.


🏵సోమవారం: బొమ్మలాటలతో సంభాషణా చాతుర్యం, కథలు చెప్పడం, పాటలు పడటం, బాషా క్విజ్‌ నిర్వహణ, పుస్తక పఠనం, సామూహిక చర్చ, అభినయం చేస్తూ కథలు చెప్పడం, ముకాభినయం, బాలల గేయాలు, స్పెల్‌ చెక్‌ వంటి కార్య క్రమాలు నిర్వహించాలి

🏵మంగళవారం: హిందీ, సంస్కృతం, ఉర్దూలో బాలల గేయాలు, శ్లోకపఠనం, ఉక్తలేఖనం, పుస్తక పఠనం, అభినయం చేస్తూ కథలు, దైనందిన వ్యవహారాలను ఉర్దూ బాషాలో నిర్వహించాలి

🏵బుధవారం: గిరిజన బాషలో బాలల గేయాలు, పొడుపు కథలు, గిరిజన సంప్రదాయ పాటలు, స్థానిక వనరులతో టీఎల్‌ఎం తయారీ

🏵గురువారం : తెలుగు బాష ఔన్నతాన్ని తెలిపే కార్యక్రమాలు, నాటికలు, పద్య పఠనం, పదజాలాన్ని పెంచే కార్యక్రమాలు, స్థానిక కళారూపాలపై ప్రదర్శనలు నిర్వహించాలి

భాషోత్సవాలలో విద్యార్థులకు నిర్వహించే కృత్యాలు

----------------------------------------------------------------
🛑 ఆంగ్ల భాష :
 నేటి ప్రపంచంలో ఆంగ్ల భాష అంతర్జాతీయ భాషగా ప్రాముఖ్యత పొందింది. ఈ నెల 26వ తేదీన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వివిధ రకాల ప్రదర్శనలు, ఆటలు నిర్వహించాలి. వారిలో ఇంద్రియ జ్ఞానాన్ని పెంపొందించేందుకు తోలు బొమ్మలాట, కథలు, పాటలు, క్విజ్‌లు తదితర పోటీలు నిర్వహించాలి.

☀ పఠన పోటీలు (5 లేదా ఏడు నిమిషాలలో చదవదగిన విధంగా ఉండే చిన్న కథలు)

☀ చిన్న కథలు రాయడం

☀ ఆంగ్ల భాష ప్రాముఖ్యతపై చర్చ

☀ నాటకీకరణంగా కథ చెప్పడం

☀ విద్యార్థులు వివిధ పాత్రలు పోషించే విధంగా రోల్‌ప్లే నిర్వహించడం

☀ పద్యాలు, ఉక్తలేఖనం

☀ బోధన అభ్యసన సామగ్రి తయారీలో స్థానిక వనరుల వినియోగం.
----------------------------------------------------------------

🛑సంస్కృతం ....

☀ భారతదేశ సంస్కృతిలో జ్ఞానాన్వేషణకు సంస్కృత భాష గొప్ప పాత్ర పోషించింది. పాఠశాలలో ఉన్నత విద్యాభ్యాసంలో సంస్కృత భాష బోధించాలని 2019 నూతన విద్యావిధాన చట్టం సూచించింది. ఈ నెల 27వ తేదీన 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కృత్యాలు నిర్వహించాలి.

☀ పఠన పోటీలు (శ్లోకాలు), డిక్టేషన్‌

☀ చిన్న కథలు రాయడం, చర్చ

☀ బోధన అభ్యసన సామగ్రి తయారీలో స్థానిక వనరుల వినియోగం.
----------------------------------------------------------------
🛑 ఉర్దూ...

☀ మదర్సాలు, ఉర్దూ మాధ్యమం కలిగిన పాఠశాలల్లో చదువుతున్న మైనారిటీ విద్యార్థులలో ఉర్దూ భాషాభివృద్ధి కోసం ఈ నెల 27వ తేదీ పలు కృత్యాలు నిర్వహించాలి.

☀ ఉర్దూ భాషలో పద్యాలు, పొడుపు కథలు

☀ గజల్స్‌

☀ ఉర్దూలో చిన్న కథలు

☀ బోధన అభ్యసన సామగ్రి తయారీలో స్థానిక వనరుల వినియోగం.
--------------------------------------------------------

🛑 గిరిజన భాషలు

☀ గిరిజన పాఠశాలల్లోని విద్యార్థులకు గిరిజన భాషలైన సవర, కొండ, కువి, ఆదివాసీ - ఒరియా, సుగాలీ, లంబాడీ భాషాభివృద్ధి కోసం పలు కృత్యాలను ఈ నెల 28వ తేదీన నిర్వహించాలి.

☀ పద్యాలు, పొడుపు కథలు

☀ నృత్య ప్రదర్శనలు (గిరిజన సంప్రదాయ సంబంధిత)

☀ పాటలు (గిరిజన సంప్రదాయ సంబంధిత)

☀ గిరిజన సంస్కృతికి చెందిన చిన్న కథలు

☀ బోధన అభ్యసన సామగ్రి తయారీలో స్థానిక వనరుల వినియోగం.
-------------------------------------------------------------------

🛑 తెలుగు..

☀ సుగంధభరితమైన, మాధుర్యం కలిగిన భాష తెలుగుభాష. గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని పురస్కరించుకొని ఈ నెల 29వ తేదీన పలు కృత్యాలను తెలుగు భాషాభివృద్ధి కోసం నిర్వహించాలి.

☀ తెలుగు భాషకు గౌరవం ఆపాదించేలాగా వక్తృత్వ, నాటకాలను నిర్వహించాలి.

☀ తెలుగు భాషాభివృద్ధిలో చిన్నచిన్న కథల రచనా ప్రాబల్యం

☀ తెలుగు భాషలో పాటలు, చర్చా కార్యక్రమాలు

☀ బోధన, అభ్యసన కార్యక్రమాల తయారీలో స్థానిక వనరుల వినియోగం.
-----------------------------------------------------------------------------------------
🛑 హిందీ...

☀ హిందీ భాషాభివృద్ధి కోసం కృత్యాలను 6 నుంచి 8వ తరగతి విద్యార్థులతో ఈ నెల 27వ తేదీన నిర్వహించాలి.

☀ పద్యాలు, ఉక్తలేఖనం

☀ పఠన పోటీలు (ఐదు నిమిషాలలో)

☀ చిన్న కథలు రాయడం

☀ జాతీయ భాష హిందీపై చర్చ

☀ నాటకీకరణంగా కథ చెప్పడం

☀ విద్యార్థులకు వివిధ రకాల ప్రదర్శనలు, ఆటలు నిర్వహించడం

☀ విద్యార్థులు వివిధ పాత్రలు పోషించే విధంగా రోల్‌ప్లే నిర్వహించాలి


భాషోత్సవ లక్ష్యాలుభాషోత్సవాల ప్రయోజనంభాషోత్సవములో విద్యార్ధులకై నిర్వహించు కృత్యములు,
అమలు చేయు విధానము ,నిధుల కేటాయింపు మరియు పర్యవేక్షణ  వంటి  పూర్తి వివరాలు 
ఫైల్  నందు   చూడగలరు. 




0 comments:

Post a Comment