BENEFITS OF INCOME TAX RETURN FILLING
LOAN PROCESSING
Regardless of the type of loan, most banks will ask you to furnish your tax returns for the past few years to understand your financial situation. Having your tax returns on hand can speed up your loan processing time.
CARRY LOSSES FORWARD
As per income tax laws you can carry forward losses (capital loss, business loss, etc.) to offset any future income, for up to eight years consecutively. So, even if you have fallen into the taxable income bracket you can carry forward and adjust your losses against your future taxable income by filing your tax return in time.
REFUND
When employed, your employer will deduct TDS on your income. However, if you have made investments that are tax deductibles, it reduces your taxable income. So, the TDS deducted can be refunded, but only If you file your taxes. The same holds true for TDS deducted by any other sources.
VISA PROCESSING
Whether your plans are in the immediate future or not, if you are planning on travelling abroad, you will realise that visa processing requires that you submit your tax returns for the past few years, to the relevant country’s embassy/consulate, including the UK, Europe, Canada and USA.
AVOID PENALTIES
While, you may not immediately receive a notice from the tax department for failing to file taxes, you may eventually receive one. If it turns out you failed to file your returns though you were required to file it, then you might be penalized up to Rs 5,000-10,000 and might face interest payment under section 234A. Source-hrblock.in
పరిమితికి మించి ఆదాయం ఉన్నవారు తప్పనిసరిగా ఆదాయపు పన్ను చెల్లించాలి.. చెల్లించాల్సిన పన్ను చెల్లించాం కదా.. ఇంకా రిటర్నులు ఎందుకు దాఖలు చేయాలనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం పన్ను చెల్లింపుదారులకు ఒక బాధ్యత. అంతేకాదు దీనివల్ల భవిష్యత్తులో ఎన్నో ఉపయోగాలూ ఉంటాయి.
గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2018-19కి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి చివరి తేదీ జులై 31. అంటే ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు చివరి నిమిషం వరకూ వేచి చూడకుండా.. రిటర్నులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గడువు దాటిన తర్వాత కూడా రిటర్నులు దాఖలు చేయొచ్చు. దీనికిగాను కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు 31, 2019 వరకూ అయితే రూ.5,000. ఆ తర్వాత రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ.. మార్చి 31, 2020. దీనికోసం రూ.10,000 చెల్లించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. రూ.5,00,000లోపు పన్ను వర్తించే ఆదాయం ఉన్నవారికి ఈ రుసుము రూ.1,000. ఈ రుసుముల భారం ఎందుకు అనుకుంటే.. గడువు తేదీలోగా రిటర్నులు దాఖలు చేయడమే ఉత్తమం.
ముందుగా మీ ఆదాయ వివరాలు, మినహాయింపులకు సంబంధించిన ఆధారాలు సిద్ధం చేసుకున్నారా? ఫారం 16, ఫారం 26ఏఎస్, పన్ను మినహాయింపు కోసం పెట్టిన పెట్టుబడులు ఉదాహరణకు.. పీఎఫ్, జీవిత బీమా పాలసీలు, పిల్లల ఫీజులు, గృహరుణానికి చెల్లించిన వడ్డీ.. అసలు రశీదులు.. ఇలా ప్రతి అంశమూ మీకు అందుబాటులో పెట్టుకోవాలి. ఇతర ఆదాయాలకు సంబంధించి, ఏదైనా మూలం వద్ద పన్ను కోతలు ఉన్నాయా చూసుకోండి.
పన్ను పరిమితి లోపు ఆదాయం ఉన్నవారు కూడా రిటర్నులు దాఖలు చేయడం మేలు. పన్ను వర్తించే ఆదాయం లేనప్పుడు రిటర్నులు ఎందుకు అని భావించకూడదు. కొన్నిసార్లు ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటికి మించి ఉద్యోగాల్లో చేరిన సందర్భాలూ ఉంటాయి. ఇలాంటప్పుడు అన్ని ఆదాయాలనూ ఒకచోటకు తీసుకొచ్చి, రిటర్నులు దాఖలు చేయాలి.
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం వల్ల ఎలాంటి నష్టం లేకపోగా.. చాలా సందర్భాల్లో వీటి అవసరం ఉంటుంది.
బీమా పాలసీల కోసం..
అధిక మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోవాలనుకున్నప్పుడు మీకు ఆ మేరకు ఆదాయం ఉందనే ఆధారం అవసరం. దీనికోసం బీమా సంస్థలు మీ ఆదాయపు పన్ను రిటర్నులను అడిగే అవకాశం ఉంది. సాధారణంగా మూడేళ్ల ఆదాయపు పన్ను రిటర్నులను బీమా సంస్థలు అడుగుతుంటాయి. దీని ఆధారంగా మీకు ఎంత మొత్తానికి బీమా పాలసీ ఇవ్వవచ్చనే విషయంలో ఒక అంచనాకు వస్తాయి. మీకు వచ్చే అన్ని ఆదాయాలనూ విడివిడిగా చూపించడం ఎప్పుడూ కష్టమే. అవన్నీ కలిపి ఒకేచోట చూపించేందుకు ఐటీఆర్ (ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్) ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఒకటికి మించి ఆదాయ మార్గాలు ఉన్నప్పుడు కచ్చితంగా రిటర్నుల ద్వారా మొత్తం ఆదాయం లెక్క చూపడం తేలికవవుతుంది.
అప్పు కావాలంటే..
భవిష్యత్తులో మీరు రుణం తీసుకొని, ఇల్లు లేదా కారు తీసుకోవాలనుకుంటున్నారా? వ్యక్తిగత రుణం తీసుకోవాలా? కచ్చితంగా మీ దగ్గర కనీసం మూడేళ్ల పన్ను రిటర్నులు దాఖలు చేసిన ఆధారాలు ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి, రుణం తీసుకునే ఆలోచన ఉంటే.. రిటర్నులు దాఖలు చేయడం మర్చిపోవద్దు.
నష్టం వస్తే..
మీరు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా.. లేదా స్టాక్ మార్కెట్లో మదుపు చేస్తున్న సందర్భాల్లో పెట్టుబడిని నష్టపోయే అవకాశాలు ఉంటాయి. దీన్ని రిటర్నులలో చూపించుకొని, మున్ముందు సంవత్సరాలకు బదిలీ చేసుకోవచ్చు. అప్పుడు వచ్చిన లాభాలతో ఈ నష్టాన్ని సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే, ఇది వ్యవధిలోపు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినప్పుడే అని మర్చిపోకూడదు.
విదేశాలకు వెళ్లాలా?
ప్రస్తుతం విదేశీ పర్యటనలకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. అయితే, ఇలా విదేశీ విహారాలకు వెళ్లాలనుకున్నప్పుడు అవసరమైన వీసా కోసం కచ్చితంగా ఆదాయపు ధ్రువీకరణలు అవసరం. దీనికి రిటర్నుల పత్రాలే అధికారికంగా ఆధారమవుతాయి. చాలా దేశాలు తమ వీసా ఇచ్చేందుకు ముందు ఆదాయపు వివరాలను అడుగుతున్నాయి. ఇవి కచ్చితంగా ఉంటే.. వీసా కొంత సులభంగా దొరికేందుకు వీలవుతుంది.
స్వయం ఉపాధి పొందుతుంటే..
వేతనం ద్వారా ఆదాయం పొందేవారికి ఒక కచ్చితమైన ఆధారం ఉంటుంది. దీన్నిబట్టి వారు ఆదాయం ఎంతుందన్నది సులభంగా తెలుసుకోవచ్చు. కానీ, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఆదాయం గురించి కచ్చితమైన అంచనా ఉండదు. ఇలాంటి సందర్భాల్లో ఆదాయాన్ని ధ్రువీకరించుకోవడానికి రిటర్నులు ఉపయోగపడతాయి. ఈ రిటర్నుల ఆధారంగా ఎంత ఆదాయం ఉందన్నది గణించేందుకు వీలవుతుంది. ఈ రిటర్నుల ఆధారంగా అవసరమైనప్పుడు రుణాలు పొందేందుకు ఆదాయ ఆధారంగా చూపించవచ్చు.
రుసుముల భారం లేకుండా...
గత ఆర్థిక సంవత్సరంలో మీరు రిటర్నులు దాఖలు చేశారా? అయితే, ఈ ఏడాది కూడా రిటర్నులు దాఖలు చేయాల్సిందిగా మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారం వస్తూనే ఉంటుంది. ఒకవేళ ఆదాయం అంత లేదు కాబట్టి, రిటర్నులు దాఖలు చేయడం లేదు అనే ఆలోచనతో ఉన్నారా? మీకు పన్ను వర్తించే ఆదాయం లేదన్న సంగతినైనా తెలియజేయాల్సి ఉంటుంది. ఇదంతా పెద్ద తతంగమే. దీనికన్నా ఉన్న ఆదాయం ఎంతో లెక్క చూపించి, రిటర్నులు దాఖలు చేయడమే మేలు. భవిష్యత్తులో ఏదైనా అపరాధ రుసుములు పడకుండా చూసుకోవచ్చు.
తెల్లధనం అవుతుంది..
లెక్కల్లో చూపించని ఆదాయం మీ వద్ద ఉందంటే అది చట్టవిరుద్ధం. దాన్నే నల్లధనంగానూ పేర్కొంటాం. ఏదైనా తేడా వచ్చినప్పుడు ఈ నల్లధనం వల్ల మీకు చిక్కులు రావచ్చు. ఏటా క్రమం తప్పకుండా ఆదాయం పన్ను రిటర్నులు దాఖలు చేస్తూ.. వచ్చిన ఆదాయం అంతా లెక్కల్లో చూపించారనుకోండి.. అప్పుడు అది అంతా లెక్కల్లోకి వస్తుంది. ముఖ్యంగా బ్యాంకులో జమ చేసిన మొత్తాలకు లేదా ఏదైనా ఆస్తి కొనుగోలు చేసినప్పుడు దీనివల్ల ఎలాంటి కొత్త చిక్కులు రాకుండా ఉంటాయి.
పన్ను రిఫండు కోరేందుకు...
కొన్ని సందర్భాల్లో మీ ఆదాయం పన్ను వర్తించే మొత్తం కన్నా తక్కువగా ఉండవచ్చు. అయినప్పటికీ మీ యాజమాన్యం లేదా మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లు వేసిన బ్యాంకు మూలం వద్ద పన్ను కోత విధించి ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆ పన్ను వెనక్కి రావాలంటే ఎలా.. మీకు వర్తించే ఐటీఆర్ ఫారంలో రిటర్నులు దాఖలు చేయడం ద్వారా రిఫండును వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మినహాయింపులన్నీ సక్రమంగా నమోదు కాకపోవచ్చు. ఇలాంటి వాటిని సరిచేసుకునేందుకూ రిటర్నులు దాఖలు చేయాల్సిందే.
ఎవరికి ఏ ఫారం?
ఇన్‌కంట్యాక్స్‌ఇండియాఈఫైలింగ్ వెబ్‌సైటులోకి వెళ్లి మీకు వర్తించే ఫారాన్ని ఎంచుకొని, రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. అసెస్‌మెంట్ ఇయర్ 2019-20కు సంబంధించిన ఐటీఆర్ ఫారాల్ని ఎంచుకోవాలి. రూ.50లక్షల లోపు ఆదాయం ఉన్నవారు.. ఐటీఆర్-1ను ఎంచుకోవాలి. వేతనం లేదా పింఛను, ఒక ఇంటి ద్వారా ఆదాయం, ఇతర మార్గాల ద్వారా ఆదాయం వచ్చిన వారు దీన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ ఐటీఆర్-1 వర్తించని సందర్భంలో ఐటీఆర్-2లో రిటర్నులు సమర్పించాలి. వృత్తి, వ్యాపారం నిర్వహించేవారు.. ఐటీఆర్ 3, ఐటీఆర్ 4లలో రిటర్నులు దాఖలు చేయాలి.

- ఈనాడు ప్రత్యేక విభాగం
0 comments:
Post a Comment