రాష్ట్ర ఉద్యోగులకు 2018, 2019 సంవత్సరాలకు సంబంధించి ఇంకా అందని పాత DA బకాయిల (Old DA Arrears) క్లెయిమ్ కోసం ఆర్థిక శాఖ CFMS Nidhi Payroll – DA Arrear Moduleను మళ్లీ తెరిచింది. ఇందుకు సంబంధించి Finance (HR.VI-PC&TA) Department, Memo No.3105894/5/PC-TA/2026 ద్వారా DTA, APCFSS CEO లకు ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో క్లెయిమ్ చేయని లేదా పెండింగ్‌లో ఉన్న అర్హమైన బకాయిలను మాత్రమే ఇప్పుడు DDOలు బిల్లుగా సమర్పించాలి. ఏ G.O.లు వర్తిస్తాయి, ఏ పత్రాలు అవసరం, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అనే వివరాలు ఇక్కడ చూడండి.
| మాడ్యూల్ | CFMS Nidhi Payroll – DA Arrear Module (Reopened) |
| మెమో | Memo No.3105894/5/PC-TA/2026, Finance (HR.VI-PC&TA) Dept. |
| వర్తించే DA కాలాలు | 01-07-2018 మరియు 01-01-2019 DA పెంపులు |
| ఎవరికి | ఇంకా క్లెయిమ్ చేయని / అందని అర్హమైన బకాయిలు ఉన్న ఉద్యోగులు |
| బిల్లు సమర్పించేది | సంబంధిత DDO |
| చివరి తేదీ | ఇంకా ప్రకటించలేదు |
ఏ G.O.ల బకాయిలు ఈ మాడ్యూల్‌లో?
| DA అమలు తేదీ | G.O. నంబర్, తేదీ | DA మార్పు | పెంపు |
|---|---|---|---|
| 01-07-2018 | G.O.Ms.No.94, Fin (PC-TA), 04-11-2020 | 27.248% → 30.392% | 3.144% |
| 01-01-2019 | G.O.Ms.No.51, Fin (PC-TA), 31-07-2021 | 30.392% → 33.536% | 3.144% |
- కొన్ని మెసేజ్‌లలో G.O.Ms.No.94 మాత్రమే ప్రస్తావిస్తున్నారు. కానీ మెమో ప్రకారం G.O.Ms.No.51 (01-01-2019 DA) బకాయిలు కూడా ఈ మాడ్యూల్ పరిధిలోకి వస్తాయి.
- "ప్రతి ఉద్యోగికీ Non-Drawal Certificate తప్పనిసరి" అని ప్రచారం జరుగుతోంది. మెమోలో పేర్కొన్న ప్రకారం, క్లెయిమ్ కాలంలో ఉద్యోగి ప్రస్తుత DDO పరిధిలో లేకపోతే (బదిలీ వంటి సందర్భాల్లో) మాత్రమే గత కార్యాలయం నుంచి Non-Drawal Certificate తీసుకోవాలి. మీ జిల్లా ట్రెజరీ / DDO సూచనను పాటించండి.
- మాడ్యూల్ తిరిగి తెరిచినంత మాత్రాన అందరికీ బకాయి వస్తుందని కాదు. ఇప్పటికే చెల్లించిన / పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని మళ్లీ క్లెయిమ్ చేయకూడదు.
DDOలు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు
- ఉద్యోగికి గతంలో ఏ DA బకాయిలు చెల్లించారో ముందుగా పరిశీలించి, మిగిలిన అర్హమైన మొత్తాన్ని మాత్రమే క్లెయిమ్ చేయాలి.
- CFMS HCM Module ద్వారా గతంలో ప్రాసెస్ అయిన క్లెయిమ్‌లు, Nidhi Payroll రిపోర్టులను సరిచూసుకోవాలి. CFMSలో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న బిల్లును మళ్లీ పెట్టకూడదు.
- Foreign Service కాలానికి DA బకాయిలు క్లెయిమ్ చేయకూడదు.
- రిటైర్డ్ / మరణించిన ఉద్యోగుల విషయంలో గత చెల్లింపులను ధృవీకరించిన తర్వాతే క్లెయిమ్ చేయాలి. మరణించిన ఉద్యోగుల LTA బిల్లులను ట్రెజరీ అధికారులు పరిశీలిస్తారు.
- సర్వీస్ వివరాలు, కాలం, వర్తించే G.O., SR రికార్డులు సరిచూసుకుని బిల్లు పంపాలి.
- తప్పుడు, అదనపు లేదా డూప్లికేట్ క్లెయిమ్‌లకు సంబంధిత DDOనే బాధ్యులు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
బిల్లు తయారీలో నమోదు చేయాల్సిన వివరాలు
మాడ్యూల్‌లో ఈ క్రింది ఫీల్డ్‌లు ఉన్నాయని బిల్లులు తయారు చేస్తున్న DDOలు చెబుతున్నారు. ముందుగానే SR, పాత పే స్లిప్స్, బిల్ రికార్డులు సిద్ధం చేసుకుంటే పని సులభమవుతుంది.
| విభాగం | వివరాలు |
|---|---|
| ప్రాథమిక | Category (GPF), G.O. Number, Month-Year, From Date – To Date, Number of Days |
| పే వివరాలు | PRC Type & Year, Pay Scale, Future Pay, Basic Pay, Basic Pay Drawn |
| బిల్లు / మొత్తాలు | Bill Number, Old DA, New DA, Arrear Amount as per G.O., Deduction, Net Amount |
ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలు
- Bill Number: గతంలో అసలు బిల్లు పెట్టని ఉద్యోగులకు ఈ కాలమ్‌లో ఏమి నమోదు చేయాలనే దానిపై అధికారిక స్పష్టత రాలేదు.
- Cancel అయిన పాత బిల్లులు: గతంలో సమర్పించి రద్దయిన బిల్లుల నంబర్లు చాలా కార్యాలయాల్లో అందుబాటులో లేవు.
- Future Pay, Deduction, Net Amount వంటి ఫీల్డ్‌లను ఎలా లెక్కించి నమోదు చేయాలనే దానిపై మార్గదర్శకాలు అవసరం.
- GPF Account Number లేనివారు: GPF నంబర్ ఇంకా కేటాయించని కొంతమంది ఉద్యోగుల (ముఖ్యంగా మున్సిపల్ టీచర్లు) పేర్లు మాడ్యూల్‌లో కనిపించడం లేదని సమాచారం.
ఈ అంశాలపై ట్రెజరీ / ఆర్థిక శాఖ నుంచి స్పష్టత వచ్చిన వెంటనే ఈ పోస్ట్‌ను అప్‌డేట్ చేస్తాం.
ఇప్పుడే సిద్ధం చేసుకోవాల్సినవి
- ఉద్యోగి Service Register (2018–2019 కాలపు పే వివరాలు)
- ఆ కాలంలో డ్రా చేసిన పే బిల్లులు / పాత DA బిల్లుల వివరాలు
- బదిలీ అయినవారికి గత కార్యాలయం నుంచి Non-Drawal Certificate
- GPF Account Number వివరాలు
తరచుగా అడిగే ప్రశ్నలు
ప్ర: ఇప్పటికే DA బకాయి పొందినవారు మళ్లీ క్లెయిమ్ చేయవచ్చా?
జ: లేదు. ఇంకా అందని / క్లెయిమ్ చేయని అర్హమైన మిగులు మొత్తం మాత్రమే క్లెయిమ్ చేయాలి.
ప్ర: ఉద్యోగి స్వయంగా బిల్లు పెట్టవచ్చా?
జ: లేదు. CFMS Nidhi Payroll ద్వారా సంబంధిత DDO బిల్లు సమర్పిస్తారు. ఉద్యోగులు అవసరమైన రికార్డులను DDOకు అందించాలి.
ప్ర: మాడ్యూల్ ఎప్పటి వరకు ఓపెన్?
జ: చివరి తేదీ ఇంకా ప్రకటించలేదు. అందుకే వీలైనంత త్వరగా వివరాలు సిద్ధం చేసుకోవడం మంచిది.
ప్ర: Foreign Service కాలానికి బకాయి వస్తుందా?
జ: మెమో ప్రకారం Foreign Service కాలానికి ఈ మాడ్యూల్‌లో క్లెయిమ్ చేయకూడదు.