WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

AP ఇంటర్ పరీక్షలు 2027 – జవాబు బుక్‌లెట్లు, ప్రశ్నాపత్రాల్లో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIE AP) మార్చి 2027 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం జవాబు పత్రాలు, ప్రశ్నాపత్రాల విధానంలో కీలక మార్పులు చేసింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి శ్రీ పి. రంజిత్ బాషా గారు అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమైన మార్పులు

అంశంకొత్త విధానం
జవాబు పత్రం (సాధారణ థియరీ సబ్జెక్టులు)అన్ని సబ్జెక్టులకు ఒకే విధమైన 32 పేజీల బుక్‌లెట్
వొకేషనల్ కోర్సులుప్రస్తుత 24 పేజీల బుక్‌లెట్ యథాతథం
బయాలజీ (1వ & 2వ సంవత్సరం)బోటనీ, జువాలజీకి వేర్వేరు OMR షీట్ల బదులు ఒకే OMR షీట్ + 40 పేజీల జవాబు బుక్‌లెట్
పార్ట్-II ఎలక్టివ్ సబ్జెక్టులు1వ & 2వ సంవత్సరంలో వేర్వేరు ప్రశ్నాపత్రాలు – గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, బయాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ

కళాశాలలకు ఆదేశాలు

  • ఈ మార్పులను అధ్యాపకులు, విద్యార్థులందరికీ తెలియజేయాలి.
  • మార్చి 2027 పరీక్షలకు బోర్డు జారీ చేసిన సూచనలను కచ్చితంగా పాటించాలి.
  • విద్యార్థులు కొత్త బుక్‌లెట్ విధానానికి అనుగుణంగా సమాధానాలు రాయడం సాధన చేయాలి.

అధికారిక లింక్

గమనిక: పరీక్షల టైమ్‌టేబుల్, ఇతర మార్పుల వివరాల కోసం BIE AP అధికారిక ప్రకటనలను గమనిస్తూ ఉండండి.