CPS ఉద్యోగులు మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటే ఏమి చేయాలి?
🚩మొదట ప్రాన్ ఖాతాలోకి లాగ్ఇన్ అయి ఏనెలలో మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయో చెక్ చేయాలి.తరువాత ఆ నెలలకు సంబందించిన వివరాలు అనగా ఆనెలలో సదరు DDO గారు CPS క్రింద అందరు ఉద్యోగులది మొత్తం ఎంత డిడక్ట్ చేశాడు? అందులో మీ అమౌంట్ ఎంత? దాని టోకన్ నంబర్ ఎంత? తదితర అంశాలు ఒక ఫార్మాట్ లో నింపాలి. అందులో DDO,STO ల సంతకాలు చేయించి DTA కి పంపాలి.
ఒక ఉదాహరణ:
🍄నేను మూడు సార్లు ట్రాన్స్ ఫర్ అయ్యాను. మూడు చోట్ల మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయి ఏమి చేయాలి??
🚩మనం ఎక్కడ పని చేసినపుడు మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయో ఆ DDO,STO ల ద్వారానే సపరేట్ గా DTA కి పంపాలి.
Ex: A అనేచోట మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటే A అనే ప్రాంత ప్రస్తుత DDO,STO ల సంతకాలతో అక్కడనుండే DTA కి పంపాలి. ఇలా B,C ప్రాంతంలో గల మిస్సింగ్ క్రెడిట్స్ B,C PLACE లలో ప్రస్తుత DDO,STO ల ద్వారా పంపితేనే DTA లో చెక్ చేసి క్రెడిట్ చేస్తారు.