గౌరవ హై కోర్ట్ వారు WP No.10034 & 10474 / 2021 కి సంబంధించిన తీర్పు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.... SA (తెలుగు) & LP (తెలుగు) పోస్టులకు సంబంధించిన ఎంపిక జాబితాలను రూపొందించి క్రింది షెడ్యూల్ ను అనుసరించవలసిందిగా DSE AP వారు అందరు DEO లను కోరారు.
👉 అభ్యర్థులకు సమాచారం అందించవలసిన తేది : 13.11.2021
👉 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ : 14.11.2021
👉 నియామక ఉత్తర్వులు జారీ : 14.11.2021
GO.NO:67, తేది 26-10-2018 కి కొనసాగింపే GO.NO:70, తేది 05-11-2018
DSC 2018 వ్రాసిన SA,LPతెలుగు కు మోక్షం
DSC 2018 స్కూల్ అసిస్టంట్ తెలుగు,లాంగ్వేజ్ పండిట్ తెలుగు నియామకాలలో నోటీఫికేషన్ సమయంలో డిగ్రీ తెలుగు లేక మూడు సంవత్సరాలు తెలుగు లేక తత్సమానమైన ఓరియంటల్ డిగ్రీ బిఇడి లో తెలుగు ఉంటే SA తెలుగు,LP తెలుగు అని DSC 2018 నోటిఫికేషన్ ఇచ్చారు.తదుపరి జి.ఓ 70 తేది 05-11-2019 ప్రకారం జిఓ 67 లోని అర్హతలతో పాటు MA తెలుగు కూడా అర్హులే అని సవరించారు.ఇరువురు పరీక్ష వ్రాయగా GO 67 ప్రకారం వ్రాసిన వారు కోర్టును ఆశ్రయించగా ది12-11-2021న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.తీర్పు ప్రకారం జిఓ 67 మరియు జీఓ 70 ఇరువురు అర్హులే జీఓ 67 కు అది కొనసాగింపు అని తీర్పుచెప్పారు.NCTE రూల్స్ కు అది విరుద్థం కాదు అన్నారు.జిఓ 70 కొట్టివేయనవసరం లేదని అన్నారు.దీనితో తెలుగు భాషా పండితుల 2018 DSC నియామకంపై నీలినీడలు తొలగిపోయాయి.కాని ఇన్ సర్వీస్ పదోన్నతి కొరకు ఉన్న నిబంధనలు మార్చుతారా?లేదా జిఓ 67 కొనసాగిస్తారా అనేది DSE వారు నిర్ణయించవలసి ఉన్నది.దీనిపై పండిత మిత్రుల ఆలోచన ఏలా ఉంటుందో వేచి చూడాలి.
0 comments:
Post a Comment