Friday, September 24, 2021

HOW TO EDIT STUDENT PROFILE DETAILS

 SIMS - STUDENT INFO - STUDENT PROFILE నందు విద్యార్థి సమగ్ర వివరాల మార్పుల/చేర్పులకు ప్రస్తుతం అవకాశం కల్పించడం జరిగింది.

HOW TO EDIT STUDENT PROFILE DETAILS


ప్రధానోపాధ్యాయులందరికీ తెలియజేయునది ఏమనగా, స్టూడెంట్ ఇన్ఫో సైట్ నందు ఎడిట్ ఆప్షన్ ఇవ్వబడినది. స్టూడెంట్ డేటా ఎంట్రీ చేసినపుడు ఏమైన పొరపాటు జరిగినట్లయితే, వాటిని కరెక్ట్ చేయడానికి 100% ఎడిట్ ఆప్షన్ ఇవ్వబడినది. 

ముఖ్యంగా విద్యార్థులు పేరు, తల్లిదండ్రులు పేరు, ఆధార్ నెంబర్లు, బ్యాంకు ఖాతా నెంబర్, వాటి పూర్తి వివరములు కరెక్ట్ గా ఉండేలా తగు చర్యలు తీసుకోవలసినదిగా తెలియజేయడమైనది. 

ఎందుకంటే రానున్న జనవరి నెలలో తల్లుల ఖాతాలో జమ కాబడే జగనన్న అమ్మ ఒడి యొక్క డేటా మొత్తం ఈ వెబ్ సైట్ నుండే రాష్ట్ర స్థాయిలో తీసుకుంటూన్న విషయము మనందరికీ విధితమే. 

అమ్మ ఒడి ప్రక్రియ మొదలైనపుడు ఈ వెబ్సైట్ కొన్ని నెలలు పాటు ఫ్రీజ్ చేయడం, ఎడిట్ ఆప్షన్లు అవకాశం లేకుండా చేయడం వంటివి చేయడం వలన మనమంతా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం విధితమే.

 కావున ప్రస్తుతం ఎడిట్ ఆప్షన్ ఇచ్చినందున ప్రతి విద్యార్ది యొక్క వివరములు మరియు తల్లుల బ్యాంకు ఖాతా వివరములు సరిచూసి కరెక్ట్ చేయించుటకు తగు చర్యలు గైకొనవలసినదిగా తెలియజేయడమైనది.

0 comments:

Post a Comment