Thursday, August 12, 2021

JAGANANNA VIDYA KANUKA KIT LATEST GUIDELINES


    PROCEEDINGS OF THE DIRECTOR OF SCHOOL EDUCATION: 

ANDHRA PRADESHAMARAVATI 

Present: Vedrevu Chinaveerabhadrudu, LA.S.,


Re No.1214144/PLG/2020 dated

Sub: School Education Jagannana Vidya Kanuka- Distribution of School Kits to the students who are studying in Government and local body management Schools in the State -Instructions issued - Regarding Read: This office proceedings Rc. even No, dated 22.08 2020, 29.08.2020. 30.09.2020, 06.10.2020 & 07.10.2020.

ORDER

In continuation of the instructions issued in the reference read above, all e Regional Joint Directors, District Educational Officers and Additional Project Coordinators of Samagra Shiksha in the State are informed that certain requests have been received with regard to the distribution of JVK kits through authentication from mothers, but as some of the students represented that due to non available of their mothers with different reasons (Legally Separated, Died, Hospitalized, and Migrated).


in the said circumstances, al the Regional joint Directors. District Educational Officers and Additional Project Coordinators. Samagra Shiksha are requested to allow the students who are studying n Government and local body management Schools in the State to get the JVK Kits by considering the biometric authentication (THUMB)by their guardian which is to be certified by the concerned Head Master Therefore all the Regional joint Directors. District Educational Officers

and Additional Project Coordinators of Samagra Shiksha in the State are requested to facilitate al the students who are studying in Government and local body management Schools in the State until the last beneficiary receives the JVK Kit without any hardship to the students and issue necessary instructions by duly ensuring that all the Biometric machines are functional Any dysfunctional machine may be kept in the notice of concerned DEO office and get it rectified/replaced to the Head masters in their jurisdiction immediately to this effect


File No.ESE02/613/2021-IT-CSE


Top priority should be given to this item of work. Note: The mobile application link user manual will be communicated separately

Chinaveerabhadrunu Vartrevu 

Director, School Education

DOWNLOAD Rc.No.1214144/PLG/2020 Dt:13-08-2021

సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ వారి కార్యావర్తనములు 

ప్రస్తుతం: శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఎ.ఎస్.,


RCNO 1021/3/2021-CMO SEC - SSA   తేదీ: 12-08-2021 

విషయం: పాఠశాల విద్యాశాఖ 'జగనన్న విద్యా కానుక 2021-22 - స్టూడెంట్ కిట్లు పంపిణీ కొరకు మరియు 'మన బడి-నాడు-నేడు' జిల్లా విద్యాశాఖాధికారులకు సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు, సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు.

నిర్దేశాలు: 1) ఆర్.సి.నెం. SS-16021/3/2021-CMO SEC-SSA తేదీ: 07-06-2021 

2) ఆర్.సి. నెం. SS-16021/3/2021-CMO SEC - SSA తేది: 05-08-2021.

***

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా "మన బడి-నాడు-నేడు' అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో మౌలిక వసతులను మెరుగుపరచడం జరిగినది. మొదటి దశ పూర్తి అయిన సందర్భంగా దీనిని ప్రభుత్వం 2021 ఆగస్టు 16న ప్రజలకు అంకితం చేయనున్నారు. అలాగే అదేరోజు రెండవ దశలో భాగంగా 16.368 పాఠశాలల్లో రూ.4,535 కోట్లతో మౌలిక వసతులు మెరుగుపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే విధంగా ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది నిర్వహిస్తున్న 'జగనన్న విద్యాకానుక' కార్యక్రమం అదే రోజు ప్రారంభించనున్నారు.


గత సంవత్సరం 'జగనన్న విద్యా కానుక 'లో భాగంగా విద్యార్థులకు 3 జతల యూనిఫాం నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు మరియు రెండు జతల హక్కులు, బెల్టు, బ్యాగు మరియు పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో అదనంగా 6 నుండి పదో తరగతి విద్యార్థులకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ. 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు పిక్టోరల్ డిక్షపరీల (బొమ్మల నిఘంటువు) ను అందించనున్నారు. దీనికోసం రూ. 731 30 కోట్లతో 47, 32, 064 మంది విద్యార్థులకు బట్టి చేకూరనుంది.


"మన బడి నాడు-నేడు" మొదటి దశ ముగింపులో భాగంగా సంబంధిత జిల్లా కలెక్టర్లు ఉత్తమ సేవలందించిన ఇద్దరు హెడ్ మాస్టర్స్, ఇద్దరు ఇంజనీర్లు మరియు రెండు పేరెంట్స్ కమిటీలను గుర్తించి, వారికి తగిన విధంగా సన్మానించాలని | అభ్యర్థించారు.

 JVK MATERIALS CLASS WISE DITRIBUTION DETAILS

జగనన్న విద్యాకానుకలో భాగంగా పాటించవలసిన విషయాలు

JVK DISTRIBUTION AND MBNN LATEST GUIDELINES 12-08-2021


సమగ్ర శిక్షా 'జగనన్న విద్యా కానుక' 2021-22 - మండల రిసోర్సు కేంద్రాల నుంచి స్కూల్ కాంప్లెక్సులకు యూనిఫాం క్లాత్ - బూట్లు& సాక్సులు మరియు బ్యాగులు సరఫరా - సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు.

రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్రశిక్షా, ఆంధ్రప్రదేశ్ వారి కార్యావర్తనములు

ప్రస్తుతం: శ్రీమతి కె. వెట్రిసెల్వి ఐ.ఎ.ఎస్..


ఆర్.సి. నెం. SS-16021/3/2021-CMO SEC - SSA              తేది: 05/08/2021

విషయం: సమగ్రశిక్షా 'జగనన్న విద్యా కానుక 2021-22 - మండల రిసోర్సు కేంద్రాల నుంచి స్కూల్ కాంప్లెక్సులకు యూనిఫాం క్లాత్ బూట్లు& సాక్సులు మరియు బ్యాగులు సరఫరా సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు.

నిర్దేశాలు: 1) ఆర్.సి. నెం. SS-16021/3/2021-CMO SEC-SSA తేది: 07-06.2021

ఆదేశములు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్రశిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక' పేరుతో స్టూడెంట్ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం మండల రిసోర్సు కేంద్రాలకు చేరిన యూనిఫాం, బూట్లు & సాక్సులు, బ్యాగులు వంటి వాటిని చేరిన ఒకటి రెండు రోజుల్లో స్కూల్ కాంప్లెక్సులకు సరఫరా చేయవలసి ఉంటుంది.

• మండల విద్యాశాఖాధికారులు తమ మండల రిసోర్సు కేంద్రానికి యూనిఫాం/ బూట్లు & సాక్సులు మరియు బ్యాగులు చేరిన ఒకట్రెండు రోజుల్లో స్కూల్ కాంప్లెక్సులకు చేర్చేలా ప్రణాళిక వేసుకోవాలి. నిర్ణీత తేదీలు కేటాయిస్తూ తమ పరిధిలోని స్కూల్ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులకు సమాచారం అందించాలి.

• మండల విద్యాశాఖాధికారులు జగనన్న విద్యా కానుక యాప్ లో పొందుపరిచిన సమాచారం మేరకు ఆయా స్కూల్ కాంప్లెక్సులకు చెందిన తరగతి వారీగా బాలబాలికలకు ఏయే వస్తువులు ఎన్నెన్ని ఇవ్వవలసి ఉంటుందో సరిచూసుకొని సరఫరా చేయాలి.

ఎంఆర్సీ/ స్కూల్ కాంప్లెక్సులలో వస్తువులు పంపిణీ కోసం టేబుళ్లు, కుర్చీలు, డిస్ ప్లే బోర్డు, మార్కర్లు, స్టాప్లర్, శానిటైజర్, దుస్తులు కొలిచే టేపు/ స్కేలు వంటివి అవసరానికి అనుగుణంగా ఉపయోగించాలి. ఎంఆర్సీల నుంచి స్కూల్ కాంప్లెక్సులకు యూనిఫాం క్లాత్, బూట్లు & పొత్సులు మరియు బ్యాగుల సరఫరా


విధానం


• ఈ కార్యక్రమం అమలు కోసం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు మరియు కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం సమష్టి బాధ్యతగా భావించాలి.

File No.SS-1602 021-CMO SEC-SSA

ఆ) యూనిఫాం క్లాత్ సంబంధించి:

యూనిఫాం బేల్స్ రూపంలో ఉంటాయి. ఒక్కో బేల్ లో ఎన్నెన్ని ప్యాకెట్లు ఉంటాయో వాటిపై ముద్రించి ఉంటుంది. బాలికలవైతే 'G' అని బాలుర వైతే 'B'అని, దీంతోపాటు తరగతికి ఎదురుగా 'టిక్' మార్క్ ఉంటాయి.

* ఒకటి నుండి 5వ తరగతి బాలికలకు, అన్ని తరగతుల బాలురకు కేటాయించిన ప్యాకెట్లలో రెండు రకాల క్లాత్ పీసులు ఉంటాయి. 6-10 తరగతుల బాలికల ప్యాకెట్లలో 3 రకాల క్లాత్ పీసులు ఉంటాయి. తరగతి వారీగా పర్టింగ్, సూటింగ్, చున్నీకి సంబంధించిన కొలతలు ప్యాకెట్ మీద ముద్రించి ఉంటాయి.

DOWNLOAD JVK PROCEEDING

* నక్షత్రం గుర్తు ఉన్నవి నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు మాత్రమే వర్తిస్తుంది.

* ఒక్కో తరగతికి చెందిన ఒక్కో బేల్‌ నుండి ఒక ప్యాకెట్‌ తీసుకొని పైన ఇచ్చిన పట్టిక ప్రకారం యూనిఫాం కొలతలు ఉన్నాయో లేదో సరి చూసుకోవాలి.


మండల రిసోర్సు కేంద్రంలో సరఫరా కోసం కేటాయించిన ఒక గదిలో తరగతి వారీగా బాలుర యూనిఫాం, బాలికల యూనిఫాం విడివిడిగా పెట్టుకోవాలి.


* ప్రతి స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు తరగతుల వారీగా బాలురు, బాలికలకు ఎన్నెన్ని యూనిఫాం ప్యాకెట్లు కావాలో తీసుకొని విడివిడిగా కవర్లలో పెట్టుకోవాలి. బాలురు, బాలికల యూనిఫాం వేర్వేరు గోనె సంచుల్లో వేసుకోవాలి.


అ) బూట్లు &సాక్సులకు సంబంధించి:


* ప్రతి స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు తరగతుల వారీగా, సైజులు వారీగా బాలురు, బాలికలకు

ఎన్నెన్ని బూట్లు మరియు సాక్సులు కావాలో తీసుకొని విడివిడిగా కవర్లలో పెట్టుకోవాలి. బాలురు,

బాలికల బూట్లు మరియు సాక్సులు వేర్వేరు గోనె సంచుల్లో వేసుకోవాలి.


బాలబాలికలకు సంబంధించి బూట్లు సైజులకు అనుగుణంగా, సుమారుగా తీసుకెళ్లవలసిన సాక్సులు


వివరాలు:


0 comments:

Post a Comment