పూర్వ ప్రాథమిక విద్య నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యను ప్రధానంగా 2 విభాగాలుగా విభజించటం జరిగింది.
1. ఫౌండేషనల్ పాఠశాలలు
2 హై స్కూల్స్
1. ఫౌండేషనల్ పాఠశాలలు :
పూర్వ ప్రాథమిక విద్య పిపి-1, పిపి-2 మరియు 1,2 తరగతులకు ఫౌండేషన్ పాఠశాలలుగా గుర్తించడం జరిగింది. అయితే ఆయా స్థానిక పరిస్థితులు, పాఠశాలల అందుబాటు, పాఠశాలలకు వెళ్ళుటలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫౌండేషన్ పాఠశాలలను 3 రకాలుగా విభజించడం జరిగింది.
1. శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్స్ :
ఇవి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు లేని ఆవాస ప్రాంతాలో పిసి-1, పిపి-2 తరగతులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటిలో 3 నుండి 4 సం॥ల వయస్సు గల పిల్లలు విద్యనభ్యసిస్తారు.
2. ఫౌండేషనల్ పాఠశాలలు :
ఈ పాఠశాలల్లో పిపి-1, వివి-2, 1, 2 తరగతులు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ప్రాథమిక పొఠశాల ఉంది 3, 4, 5 తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలపడానికి వీలున్న ఆవాస ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో నుండి సం॥ల పిల్లలు విద్యను అభ్యసిస్తారు.
3. ఫౌండేషనల్ ప్లస్ స్కూల్ :
ఈ పాఠశాలల్లో విని-1, సిసి-2, 1, 2, 3, 4, 5 తరగతులు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉండి సమీపంలోని ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలకు 3, 4, 5 తరగతులను కలుపుటకు సాధ్యం కాని ఆవాస ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. ఇందులో 3 నుండి 10 సం॥ల పిల్లలు విద్యను అభ్యసిస్తారు..
2. హై స్కూల్స్
1. ప్రీ-హైస్కూల్స్ :
ఈ పాఠశాలల్లో 3వ తరగతి నుండి 7 లేదా 8వ తరగతి వరకు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్న ఆవాస ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు. ఇందులో 7 వం॥ నుండి 13 లేదా 14 సం॥ల పిల్లలు విద్యను అభ్యసిస్తారు.
2. హై స్కూల్స్ :
ఈ పాఠశాలల్లో 3 నుండి 10వ తరగతి వరకు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ఉన్నత పాఠశాలలున్న ఆవాస ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు. ఇందులో 7 నుండి 15 సం॥ల పిల్లలు విద్యనభ్యసిస్తారు.
3. హై స్కూల్ ప్లస్ :
ఈ పాఠశాలల్లో 3 నుండి 12వ తరగతి వరకు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ఉన్నత పాఠశాలలు ఉన్న ఆవాస ప్రాంతాలలో అవసరం ఉన్నచోట 11, 12 తరగతులను కలిపి వీటిని ఏర్పాటు చేస్తారు. ఇందులో 7 నుండి 17 సం॥ల పిల్లలు విద్యను అభ్యసిస్తారు.
DOWNLOAD ALL SCHOOLS TIME TABLE
0 comments:
Post a Comment