ANDHRA PRADESH RESIDENTIAL SCHOOL'S (APRS) ADMISSIONS 2021-22
ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 5వ తరగతి, జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియను సోమవారం పూర్తి చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రెసి డెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (ఏపీ ఆఐ) సొసైటీ కార్యదర్శి వి. రాములు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ (ఏపీ సీఎఫ్ఎస్ఎస్) రూపొందించిన 'ప్రవేశం' అనే ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా విద్యార్థుల ప్రవే శాల ప్రక్రియను పూర్తి చేసినట్టు ఆయన వివ రించారు.
రాష్ట్ర స్థాయి ప్రవేశాల కమిటీలో ఉన్న అధికారులు ఈ ప్రక్రియను పర్యవే క్షించారన్నారు. 5వ తరగతిలో ప్రవేశానికి 19,107 మంది దరఖాస్తు చేసుకోగా 3,187 మందికి సీట్లు కేటాయించినట్టు తెలిపారు.
జూనియర్ ఇంటర్మీడియట్ కోసం 33,547 మంది దరఖాస్తు చేయగా 1,378 మందికి సీట్లు ఖరారు చేసినట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను https://aprs.apcfss.in వెబ్సైట్లో పొందుపర్చడంతోపాటు ఎంపికైన అభ్యర్థుల మొబైల్ ఫోన్లకు సందేశాలు (ఎస్ఎంఎస్) పంపించినట్లు తెలిపారు.
జూనియర్ ఇంటర్ అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు, 5వ తర గతికి ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు అవసరమైన ధ్రువపత్రాలతో నిర్దే శించిన ప్రాంతాల్లో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. ఎంపిక ప్రక్రియను పూ ర్తి పారదర్శకంగా నిర్వహించి వెబ్ క్యాస్టింగ్ (వీడియో చిత్రీకరణ) చేసినట్టు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (8), 3&4 అంతస్తులు, పాములపాటి శివయ్య కాంప్లెక్స్, కొరిటిపాడు, గుంటూరు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో లాటరీ పద్ధతి ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి 15 వ తరగతి ప్రవేశము కొరకు సమాచారము ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో (రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకుల బాలుర పాఠశాలలు తాడికొండ గుంటూరు జిల్లా, కొడిగెనహళ్ళి అనంతపురం జిల్లా తో సహా) 2021-22 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీషు మీడియం) లో విద్యార్థులను జిల్లావారీగా సంబంధిత జిల్లా కలెక్టరు వారి కార్యాలయంలో లాటరీ పద్ధతి ద్వారా తేదీ 14-07-2021 న -ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాఠశాల కేటాయింపు కౌన్సిలింగ్ ద్వారా జరుగును.
ప్రవేశానికి అర్హత
1 వయస్సు ఓసి మరియు బి.సి (O.C, B.C) లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి యస్.సి. మరియు యస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2008 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి.
2. సంబంధిత జిల్లాలో 2019-20 & 2020-21 విద్యాసంవత్సరాలలో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3 మరియు 4 తరగతులు "చదివి ఉండాలి 3.O.C మరియు B.C విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంత MINORITY, S.C మరియు S.T. విద్యార్థులు జనరల్/మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు. 4 ఆదాయపరిమితి అభ్యర్థి యొక్క తల్లి తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2020-21) రూ. 1,00,000/- మించి ఉండరాదు సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు.
APRS FIFTH CLASS RESULTS 2021-22
APRS FIFTH CLASS 2021-22 SELECTIONLIST
0 comments:
Post a Comment