WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Dasara Sankranti Holidays Prefix Suffix Rules

దసరా / సంక్రాంతి సెలవులు – Prefix & Suffix (CL) పై పూర్తి వివరణ

దసరా లేదా సంక్రాంతి టర్మ్ సెలవులు 9 రోజులకన్నా ఎక్కువగా (అంటే 10 రోజులు) మరియు 15 రోజులకన్నా తక్కువగా (అంటే 14 రోజులు) ఉన్న సందర్భంలో, Closing Day కానీ Opening Day కానీ Casual Leave (CL) పెట్టుకోవడానికి అవకాశం లేదు.

అందువల్ల ఆ పరిస్థితిలో Closing Day మరియు Opening Day రెండూ స్కూల్‌కు తప్పనిసరిగా హాజరు కావాలి.

👉 RC No.10324, Dated: 07-11-1969


ఒకవేళ టర్మ్ సెలవులు 10 రోజులలోపు (అంటే 9 రోజులు) గానీ, లేదా 14 రోజులకంటే ఎక్కువగా (అంటే 15 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ) గానీ ఇచ్చినట్లయితే, Closing Day లేదా Opening Day నాడు CL పెట్టుకునే అవకాశం ఉంటుంది.

👉 RC No.815, Dated: 01-09-1999


సరళంగా చెప్పాలంటే:

  • టర్మ్ సెలవులు 10, 11, 12, 13, 14 రోజులు ఉన్నపుడు — 👉 Closing Day లేదా Opening Day నాడు CL పెట్టుకోవడానికి వీలులేదు.

⚠️ ముఖ్య గమనిక:

ఏదైనా అనివార్య కారణం చేత CL / Special CL ఉపయోగించినట్లయితే, ప్రకటించబడిన మొత్తం సెలవులన్నీ Earned Leaves (ELs) లేదా Half Pay Leave నుంచి మినహాయించబడతాయి.


ప్రస్తుత సంవత్సరం (2026) సంక్రాంతి సెలవులు:
సంక్రాంతి సెలవులు 10-01-2026 నుండి 18-01-2026 వరకు — మొత్తం 9 రోజులు.

కావున ఈ సందర్భంలో Last Working Day లేదా Re-opening Day నాడు CL పెట్టుకోవచ్చు.