Saturday, October 9, 2021

NADU NEDU-STMS APP LATEST VERSION DOWNLOAD

 NADU NEDU/STMS APP LATEST VERSION DOWNLOAD

SCHOOL TRANSFORMATION MONITORING SYSTEM APP  LATEST VERSION 2.4.0


DOWNLOAD  STMS APP LATEST VERSION 2.4.0

🍄నాడు నేడు - మొదటి ఫేజ్, రెండో ఫేజ్ లలో మార్పులు

 

ఈసారి  సిమెంటు ,  గ్రీన్ బోర్డు మొదలైన వాటితో పాటుగా కరెంటు సామాన్లు , స్విచ్ బోర్డు, ఫ్యాన్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, బాత్రూం టైల్స్ ,బాత్ రూమ్ డోర్స్ , విండోస్ మొదలైన ఇతర సామాన్లు అన్నీ  నేరుగా  ప్రభుత్వం సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా సరఫరా చేస్తారు....ఈ సారి విండోస్, డోర్స్ తుప్పు పట్టని stain less steel వి ఇస్తారు.


నాడు నేడు మొదటి విడతలో లాగా అమౌంట్ చాల నట్లయితే మరో విడత విడుదల చేయు విధానం ఫేస్ -2 నందు ఉండదు.


కావున ప్రధానోపాధ్యాయులు పాఠశాల కమిటీ వారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సహాయంతో ముందుగానే జాగ్రత్తగా అవసరమైన అన్ని పనులకు ఎస్టిమేషన్ తయారుచేసుకుని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది.


ఇప్పటికే ఉన్నటువంటి స్టేషనరీ కి సంబంధించి గాని రిపేరు చేస్తే ఉపయోగపడే వస్తువులకు సంబంధించి requirement పెట్టకపోవడం మంచిది.


ముందస్తుగా మనం సబ్మిట్ చేసే input data వివరాలు అత్యంత జాగ్రత్తగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఇవ్వబడే నిధులు పూర్తిగా input data పై ఆధారపడి ఉంటాయి.


విద్యార్థులకు సంబంధించిన డ్యూయల్ డెస్క్ లు మరియు క్లాస్ రూమ్ కు అవసరమైన టేబుల్స్, ఫ్యాన్లు ,ట్యూబ్ లైట్లు , ఇతర సామాగ్రిని కూడా మనకున్న తరగతి గదులు, విద్యార్థుల సంఖ్య వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇండెంట్ రాయాలి. అదనంగా  రాయడం వల్ల ఇబ్బంది పడవలసి వస్తుంది.


ఈసారి STMS app లాగిన్ ప్రధానోపాధ్యాయులు తో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ఇవ్వబడుతుంది.


నాడు నేడు కమిటీలో నియమింపబడిన పీసీ కమిటీలోని ఐదుగురు సభ్యులు ఈ వర్క్ పూర్తయ్యేవరకు తప్పనిసరిగా వారే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సభ్యులను మార్చకూడదు.


నాడు నేడు సంబంధించి  స్కూల్ infrastructure అన్ని ఫోటోలను తీసి  జాగ్రత్త చేసుకోవాలి . ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నాడు ఎలా ఉంది నేడు ఎలా ఉంది అని కంపేర్ చేస్తూ ఆ ఫోటోలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.


ఈసారి నాడు నేడు పనుల పరిశీలన ప్రధానోపాధ్యాయుల తోపాటు  ఆ పాఠశాలలోని అందరు ఉపాధ్యాయులకు బాధ్యత కల్పించడం అయినది .  ప్రతి ఒక ఉపాధ్యాయుడు కూడా ఒక్కొక్క పనులకు సంబంధించి బాధ్యత వహించవలసి ఉంటుంది.నాడు--నేడు రెండవ ఫేజ్ లో ఎంపిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ముఖ్య గమనిక..

🌾నాడు నేడు రెండవ ఫేజ్ లో ఎంపిక చేయబడిన  ప్రభుత్వ పాఠశాలు ,హాస్టల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్స్ వారు దిగువ సూచించిన సభ్యులతో జాయింట్ ఎకౌంట్ ఓపెన్ చేయవలసిఉన్నది.

🍄పాఠశాల జాయింట్ ఎకౌంట్ సభ్యులు ఇలా....


1️⃣పాఠశాల ప్రధానోపాధ్యాయుల ( కన్వీనర్)

2️⃣పేరెంట్ కమిటి చైర్మన్( చైర్మన్)

3️⃣ పాఠశాల పెరెంట్ సభ్యులలో PC chairman  తో కలిపి  5గురు. ( వీరిలో  ముగ్గురు సభ్యులు  ఆడవారు ఉండాలి)

4️⃣ మీ కాంప్లెక్స్ CRP

5️⃣ సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్

6️⃣ సచివాలయ విద్యా సంక్షేమ సహాయకుడు (WE asst)


🌾ఇలా  మొత్తం 9 మంది సభ్యులతో జాయింట్ ఎకౌంట్ ఓపెన్ చేయాలి.


🌾పై విషయంలో  మన జిల్లా గౌ౹౹ DEO గారు / మీ  MEO / DyEO / DI  గార్లు ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పాఠశాలలో పేరెంట్ కమిటి సమావేశం నిర్వహించి 5 గురు సభ్యులను ఎంపిక చేసి  బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేయుటకు తగు  ఏర్పాట్లు చేసుకోవాలి.

1 comment: