Tuesday, October 6, 2020

JAGANANNA VIDYA KANUKA APP DOWNLOAD


 JAGANANNA VIDYA KANUKA APP 

Andhra Pradesh government has decided to start Jagananna Vidya Kanuka Scheme 2020-21 for students. Under this scheme the state government will provide education kits to government school students. The government is launching this scheme so that the students of govt. schools can easily focus on their studies.

DOWNLOAD  JAGANANNA VIDYA KANUKA  APP 2.0  

Under the Jagananna Vidya Kanuka Scheme, the state government would provide kit to each student of class 1st to 10th in government schools.

School head master will login and he will select the class and the child to issue the kit and textbooks. Authentication of the mother / guardian will be taken while receiving the kit / textbooks using Fingerprint Authentication ( Biometric ) or IRIS. While issuing Textbooks, the titles that are being issued are to be crosschecked. Report for issued / pending children list are integrated in the application.

JVK DISTRIBUTION  MANNUAL TELUGU

JVK APP UDATE  INFORMATION:

JVK APP UDATE చేసుకోమనిNOTICE వస్తుంది.

ఈ NOTICE రావడానికి ముందు ఏ STUDENT పై CLICK చేసినా ఈ CHILD ID వేరే SCHOOL తో

MAP అయ్యి ఉంది అని error Message వస్తుంది.

ఈ పరిస్థితుల్లో App ను DIRECT గా UPDATE చేసుకుంటే UPDATED APP పనిచెయ్యదు.

SOLUTIONS

(1) Old App ను Uninstall చేసి Latest App ను Download చెయ్యాలి.

(2) Direct గా Update చేసి ఉంటే APP పై LongPress చేసి

APP INFO Select చేసి Clear Cache and Clear Storage చేసి

మళ్ళీ APP ను USE చేసుకోవచ్చు.

________

APP ను UPDATE చేసుకోకపోతే CHILD ID వేరే SCHOOL తో MAP అయ్యి ఉంది అని  error Message ప్రతి student కు Display చేస్తూనే ఉంటుంది.


'జగనన్న విద్యా కానుక' విద్యార్థులకు కిట్లను క్షేత్ర స్థాయిలో పంపిణీ కొరకు - జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు. 

 Jagananna Vidya Kanuka Kits Distribution Additional Guidelines as on 6th Oct Rc 151

 ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'జగనన్న విద్యా కానుక' కార్యక్రమం 8 వ తేదీ ప్రారంభం కాబోతుంది. ఈ పథకానికి సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లకు, సీఎంవోలకు, జిల్లా సెక్టోరియల్ అధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు.

🛑 ఇందులో ముఖ్యాంశాలు

'జగనన్న విద్యా కానుక' కిట్ అందుకోవడానికి రోజుకు 50 మందికి మించకుండా! 50 మంది లోపు విద్యార్థులు వారి తల్లి/ సంరక్షకులతో సహా ఏదో ఒక రోజు పాఠశాలకు రావచ్చు.

 ఉదాహరణకు: ఉదయం 25 మంది, మధ్యాహ్నం 25 మంది రావచ్చు. అంటే 9 నుండి 12 గంటల లోపు 25 మంది ఒక్కో తరగతికి 5 మంది చొప్పున లేదా కొన్ని తరగతులు ఉదయం, ఇంకొన్ని తరగతులు మధ్యాహ్నం పాల్గొనేలా ఆయా పాఠశాలలోని తరగతులు, విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రధానోపాధ్యాయుడు/ ఉపాధ్యాయ సిబ్బంది ప్రణాళికలు వేసుకోవాలి.

 ఆయా పాఠశాల మొత్తం విద్యార్థుల సంఖ్యను బట్టి, పాఠశాల స్థలం బట్టి ప్రణాళిక వేసుకుని మెల్లగా కొన్ని రోజుల్లో 'స్టూడెంట్ కిట్స్' పంపిణీ పూర్తి చేయాలి.

 గుంపులుగా కాకుండా విడివిడిగా, కొందరిని మాత్రమే అనుమతిస్తూ భౌతిక దూరం పాటిస్తూ , ప్రభుత్వ ఆదేశించిన / నిర్దేశించిన కోవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని అమలు చేయాలి.

 కిట్ అందుకున్న తల్లులతో బయో మెట్రిక్/ ఐరిష్ ద్వారా హాజరు వేయించాలి. 

 ఆ సమయంలో ముందు వేలిని శానిటైజ్ చేసి, ఆరిన తర్వాత బయోమెట్రిక్ వేయించాలి.

 బయోమెట్రిక్ విధానానికి సంబంధించిన 'యూజర్ మాన్యువల్' ఇప్పటికే అందరికీ ఇ-మెయిల్ ద్వారా పంపబడినది.

💢 ముఖ్య గమనిక:

👔👠🎒  కిట్ లో ఆయా తరగతులకు చెందిన పలు రకాల అంశాలు (5 నుండి 7 వస్తువులు) ఉంటాయి.


👔👠🎒  వాటిలో బ్యాగు కానీ, షూ కానీ, బెలు, యూనిఫాం వంటి వాటిలో సరైన సైజు రాకపోయినా, డ్యామేజ్ కిట్ కు సంబంధించిన వస్తువులు ఏ పాఠశాలలోనైనా మరికొన్ని అవసరమైనా, మిగిలిపోయినా (ఎక్కువగా ఉన్నా) ఆ వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంబంధిత మండల విద్యాశాఖాధికారికి తెలియజేయాలి.

👔👠🎒 మండల విద్యాశాఖాధికారులు జిల్లా అధికారులకు తెలియజేయాలి.

👔👠🎒  యూడైస్ కోడ్, చైల్డ్ ఇన్ఫోలో ఉన్న వివరాల ప్రకారం ప్రతి విద్యార్థికీ తప్పనిసరిగా అన్ని వస్తువులు అందజేయబడతాయి.

 👔👠🎒 విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు గురి కాకుండా ఈ విషయాన్ని తెలియపరచాలి.

👔👠🎒  జగనన్న విద్యాకానుక'కు సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్లు 91212 96051, 91212 96052. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు పని దినాల్లో సంప్రదించవచ్చు.

👔👠🎒  'జగనన్న విద్యాకానుక' స్టూడెంట్ కిట్ ప్రతి విద్యార్థికి తప్పకుండా అందేలా సక్రమ చర్యలకు సిద్ధం కావాలని రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్రశిక్షా అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది

0 comments:

Post a Comment