పాఠశాల విద్యా కమిషనర్ ఆంధ్ర ప్రదేశ్ వారి తాజా ఆదేశాలు:
13వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వారంలో ఒకరోజు, ఉన్నత పాఠశాల
ఉపాధ్యాయులు రెండు రోజులు పాఠశాలకు హాజరు కావాలి .అదేవిధంగా నాడు నేడు
అమలవుతున్న పాఠశాలలలో ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు కూడా నాడు నేడు
మొదటి దశ పనులు పూర్తయ్యే వరకు హాజరు కావాలి. CSE ఉత్తర్వులలో
బయోమెట్రిక్ హాజరు మినహాయింపు ఇవ్వలేదు .
👉 u-dise+ అప్ డేట్ ను జూలై 10 నాటికి పూర్తి చేయాలి.
👉 నాడు ౼ నేడు ఫేజ్ 1 పనులు జరుగుతున్న పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు,
ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ పాఠశాలకు హాజరు కావాలి. నాడు
నేడు లోని 9 అంశాలకు సంబంధించిన పనులను ఉపాధ్యాయులందరికీ పంపిణీ చేయాలి.
జులై 31 నాటికి సంబంధిత పనులను పూర్తి చేయాలి.
👉 ఈ పనులకు పాఠశాలలోని ఉపాధ్యాయుల్లో ఎవరైనా కంటోన్మెంట్ జోన్, పీహెచ్, వి
హెచ్, తీవ్ర వ్యాధులతో బాధపడే వారికి మినహాయింపు ఇవ్వాలి.
అన్ని పాఠశాలలకు వర్తించే అంశాలు
👉 "పాఠశాలల అభివృద్ధి ప్రణాళికను" పేరెంట్స్ కమిటీ సహాయంతో సిద్ధం చేసుకోవాలి.
👉 రాబోవు అకడమిక్ ఇయర్ కు సిద్ధమయ్యే విధంగా బ్రిడ్జి కోర్సు ను అమలు చేయుటకు
హైటెక్, లో టెక్, నో టెక్ ... వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి.
👉 ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఇచ్చిన బ్రిడ్జి కోర్సు మానిటరింగ్ నిమిత్తం
జులై 13 నుండి ఉపాధ్యాయులు వారంలో ప్రతి మంగళవారం పాఠశాలకు హాజరు
కావాలి.
👉 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో బ్రిడ్జి కోర్సు మెటీరియల్ online &
offline తయారు చేసి వారి ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యేవిధంగా సంసిద్ధులను
చేయాలి.
👉 విద్యార్థులందరికీ స్కూల్ లైబ్రరీ బుక్స్ పంపిణీ చేయాలి. పాఠశాలలు రీ
ఓపెన్ అయ్యేనాటికి సాధ్యమైనన్ని ఎక్కువ బుక్స్ చదివే విధంగా చూడాలి.
👉 గత తరగతి పాఠ్యాంశాలు ఆధారంగా ప్రస్తుత తరగతికి పనికొచ్చే విధంగా ప్రాజెక్ట్
వర్క్స్ ఇవ్వాలి.
👉 విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వారి విద్యాభ్యాసం
మానిటర్ చేయాలి.
👉 పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయుడు డిజిటల్ సాధనాలు లేని 10 నుండి 20 మంది
విద్యార్థులను దత్తత తీసుకోవాలి. పాఠశాలలు రీ ఓపెన్ అయ్యేవరకు వారి
విద్యాభ్యాసాన్ని మానిటర్ చేయాలి.
👉 ఉపాధ్యాయులందరికీ సంబంధిత వర్క్ డిస్ట్రిబ్యూషన్ ప్రధానోపాధ్యాయులు
నిర్వహించాలి.
👉 ఇందు నిమిత్తం జులై 13 నుండి ప్రాథమికోన్నత, హై స్కూల్
ఉపాధ్యాయులంతా వారంలో రెండు రోజులు సోమ, గురువారం పాఠశాలకు హాజరు
కావాలి..
👉 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూరదర్శన్ సప్తగిరి ఛానల్ లో నిర్వహిస్తున్న
విద్యా కార్యక్రమాలు విద్యార్థులందరూ చూసే విధంగా చర్యలు చేపట్టాలి.
CSE ఉత్తర్వులలో బయోమెట్రిక్ హాజరు మినహాయింపు ఇవ్వలేదు
దివ్యాంగులైన ఉపాధ్యాయులు, క్వారెంటైన్ , రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ లలో ఉన్న
ఉపాధ్యాయులు పాఠశాల విధులకు మినహాయింపు ఇస్తూ పాఠశాల విద్యాకమీషనర్ ఉత్తర్వులు
Hi, Thanks for sharing. Very informative post, that I have ever read, the strategy given is really very helpful....Here I’m giving best CRT TRAINING details, once go through it.
ReplyDeleteCRT TRAINING