ఆకాశంలో ఖగోళపరమైన అద్భుతం ఆవిష్కృతమైంది. దేశ వ్యాప్తంగా రాహుగ్రస్త్య సూర్యగ్రహణం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఉదయం 9.16 గంటల నుంచి సూర్యగ్రహణం మొదలవ్వగా భారత్‌లో మాత్రం 10.14 గంటలకు పూర్తి స్థాయిలో గ్రహణం కనిపించింది. గగనతలంలో వలయాకార సూర్యగ్రహణం అరుదైన సుందరదృశ్యంగా కనువిందు చేసింది. సూర్యుడి కేంద్రం భాగం కనిపించకుండా జాబిల్లి అడ్డు వచ్చింది. మధ్యాహ్నం 3.04 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మనదేశంలో గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో తొలుత కనిపించింది. తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.44 గంటల వరకు 51 శాతం, ఏపీలో ఉదయం 10.21 నుంచి మధ్యాహ్నం 1.49 వరకు 46 శాతం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు. గ్రహణం కారణంగా భూమి మీద పడే అతి నీలలోహిత కిరణాల వల్ల కరోనా వైరస్ కొంతమేరకు (0.001 శాతం) నశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యగ్రహణం నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ మూసివేశారు. గ్రహణం విడుపు తర్వాత మహాసంప్రోక్షణం అనంతరం ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఈ ఏడాది డిసెంబరులో మరోసా సూర్యగ్రహణం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మళ్లీ 2022లో సూర్యగ్రహణం ఏర్పడుతుందని వెల్లడించారు.
0 comments:
Post a Comment