నాడు నేడు బిల్స్ అప్లోడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసిన నాడు నేడుకు సంబంధించినటువంటి చాలా బిల్స్ రిజెక్ట్ అవుతున్నాయి . ఇందుకు ముఖ్య కారణాలు.....
1. బిల్ మీద హెడ్ మాస్టర్ పెయిడ్ అండ్ క్యాన్సిల్ అని రాసి హెడ్ మాస్టర్ మరియు పీసీసీ కమిటీ చైర్మన్ సంతకం చేయకపోవడం.
2. అప్లోడ్ చేసినటువంటి ఫొటోస్ క్లారిటీ లేకపోవడం.
3. బిల్లులో కనపరిచిన మొత్తానికి మనం ఆన్లైన్లో నమోదు చేసిన మొత్తానికి తేడాలు ఉండడం.
4. ఐదు వేల రూపాయలకు పైబడి నటువంటి బిల్లుల విషయంలో రెవిన్యూ స్టాంప్ ఉపయోగించకపోవడం.
5. బిల్లులకు బదులుగా ఇన్వాయిస్ లను అప్లోడ్ చేయడం అంటే బిల్లు పెట్టకుండా ఇన్వాయిస్ లను అప్లోడ్ చేయడం జరుగుతున్నది. అలా చేయకూడదు. బిల్లులను మాత్రమే అప్లోడ్ చేయాలి.
6. ఒకే చెక్కు ద్వారా 4 లేదా 5 బిల్లులు మనం సమర్పించి నటువంటి సందర్భంలో ఆ నాలుగైదు బిల్లును ఒక కాగితంపై అతికించి ఫోటో తీయడం వలన ఫోటో క్లారిటీ రాక అవి రిజెక్ట్ కావడం జరుగుతున్నది. కాబట్టి ఒక్కొక్క బిల్లు నెంబర్ తో అదే చెక్కు నెంబర్ను మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసినట్లయితే ఈ సమస్యను అధికమించగలరు.
మీ పాఠశాలకు సంబంధించి రిజెక్ట్ అయినటువంటి బిల్స్ యొక్క వివరాలను ఆన్లైన్ లో చూసుకోవచ్చును జిల్లా, మండలం, స్కూల్ ను select చేసి Go పై క్లిక్ చేయండి..
NOTE : లాగిన్ ఐన తర్వాత మాత్రమే క్రింది లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోగలరు
ఎంఐఎస్ లందరూ ప్రతిరోజు ఏ పాఠశాలకు చెందినటువంటి ఏ బిల్లు రిజెక్ట్ అవుతున్నది అన్న అంశాన్ని గమనించి ఆ ప్రధానోపాధ్యాయులకు సమాచారాన్ని అందించి, ఆ బిల్లును తిరిగి అప్లోడ్ చేయవలసిన అవసరం ఉన్నది.
0 comments:
Post a Comment