HOW TO LINK MOBILE NUMBER WITH AADHAR NO
ఆధార్ లో మీ మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవడానికి ఇలా చేయండి...
🌌ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ask.uidai.gov.in/#/ ఓపెన్ చేయాలి.
🌌అందులో మీ కొత్త మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి
🌌మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ సర్వీసెస్
పేజ్ ఓపెన్ అవుతుంది.
🌌అందులో అప్‌డేట్ ఆధార్ పైన క్లిక్ చేయాలి. పర్సనల్ డీటైల్స్ సెక్షన్‌లో
వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాలి.
🌌ఆధార్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. మీరు
ఏం అప్‌డేట్ చేయాలనుకుంటున్నారో వెల్లడించాలి. మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయాలి
కాబట్టి మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే తర్వాత పేజీ
ఓపెన్ అవుతుంది.
🌌మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సేవ్ చేయాలి. ఆ తర్వాత
అపాయింట్‌మెంట్ బుక్ చేయాల్సి ఉంటుంది. మీ ప్రాంతంలో ఉన్న ఆధార్ సేవా కేంద్రంలో
అపాయింట్‌మెంట్ బుక్ చేయాలి.
🌌ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయడానికి
రూ.25 చెల్లిస్తే చాలు.
0 comments:
Post a Comment