Tuesday, May 26, 2020

FOREIGN SERVICE DETAILS

🌌FOREIGN SERVICE DETAILS🌌


🌌ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన జీతాన్ని ప్రభుత్వ ఆదాయం నుండి కాకుండా మరొక సంస్ధ నుండి పొందే సర్వీసును ఫారిన్ సర్వీసు అంటారు.


🌌అలాగే ఒక ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి మరొక శాఖలో పనిచేయడం లేదా అదే శాఖలో యాజమాన్యం పరిపాలనా సౌలభ్యం మేరకు లేదా ఉద్యోగ అవసరరీత్యా  అదే శాఖలో వేరే ప్రాంతంలో కొంతకాలం పనిచేయడాన్ని డిప్యుటేషన్ అంటారు.


🌌ఫండమెంటల్ రూల్స్ లో 110 నుండి 127 వరకు ఫారిన్ సర్వీసు నిబంధనలను పొందుపర్చారు.


🌌ఉద్యోగి అంగీకారం లేకుండా ఫారిన్ సర్వీసు కు పంపడానికి వీలులేదు.


🌌ఈ నిబంధన ప్రభుత్వ పరంగా పనిచేస్తున్న సంస్థలకు వర్తించదు.


🌌ప్రభుత్వ ఉద్యోగి తన మాతృ డిపార్టుమెంటు క్యాడర్ లొనే ఉన్నట్టు భావించాలి.


🌌ఉద్యోగిని ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఫారిన్ సర్వీసులో ఉంచడానికి వీలులేదు.

🌌డిపార్టుమెంటు అధిపతికి అధికారం ఉన్నట్లయితే మూడేళ్లు ఫారిన్ సర్వీసుకు పంపవచ్చును.ఆపై కాలానికి ప్రభుత్వ అనుమతి పొందాలి.


🌌విదేశాలలో ఫారిన్ సర్వీసుపై బదిలీ చేయాలంటే భారత రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి.


🌌స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు తమ పరిధిలోని NGO లను స్థానిక సంస్థలు మరియు ప్రైవేటు సంస్థలకు ఫారిన్ సర్వీసులకు బదిలీ చేయవచ్చు.


🌌ఫారిన్ సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగి తిరిగి తన సొంత ఉద్యోగానికి బదిలీ అయితే అతని పే ఫిక్స్ చేయడానికి, అతని సొంత పే(Pay)  ను పరిగణలోకి తీసుకోవాలి కాని ఫారిన్ సర్వీసులో అతను చేస్తున్న pay ను పరిగణలోకి తీసుకోరాదు.


🌌ఒకసారి పేరెంట్ డిపార్టుమెంట్ కు బదిలీ అయిన తరువాత తిరిగి డిపార్టుమెంట్ కు వెళ్లాలంటే కనీసం 6 నెలలు పేరెంట్ డిపార్టుమెంట్ లో పనిచేయాలి.

0 comments:

Post a Comment