Tuesday, May 5, 2020

DON,T BELIEVE RUMORS ON 10 TH EXAMS

DON,T BELIEVE RUMORS ON 10 TH EXAMS

పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

:: పత్రికా ప్రకటన ::                                                              తేది: 05.5.2020

 పదో తరగతి పరీక్షలపై వదంతులు నమ్మవద్దు


-        పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు

కోవిడ్-19 లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రస్తుతానికి వాయిదా వేసిన సంగతి విధితమే. కొంతమంది ఈ నెల 15 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలంటూ అనధికార టైమ్ టేబులును సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వదంతులు సృష్టిస్తున్నారని, వాటిని నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి వదంతుల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. వదంతులు పుట్టించినవారిపై, షేర్ చేసినవారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందవద్దని విద్యాశాఖ కమీషనర్ స్పష్టం చేశారు.

     

శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఏ.ఎస్

కమీషనర్, పాఠశాల విద్యాశాఖ (పూ.అ.బా.),  ఆంధ్రప్రదేశ్.

0 comments:

Post a Comment