WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

INCOME TAX SLAB RATES FY 2020-21 ANALYSIS WITH EXAMPLES

INCOME TAX SLAB RATES FY 2020-21 ANALYSIS WITH EXAMPLES

ఈ ఆదాయపు పన్ను రేట్లు ఆప్షనల్. అంటే కొన్ని మినహాయింపులు, కొన్ని తగ్గింపులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి ఇవి వర్తిస్తాయి. ఉప శమనాలు, మినహాయింపులు వదులుకునే వారికి కొత్త ఆదాయపు పన్ను రేట్లు గణనీయంగా తగ్గుతాయని కేంద్ర మంత్రి నిర్మల అన్నారు. వచ్చే 2021-22 మదింపు సంవత్సరం లేదా 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ రేట్లు అమల్లోకి వస్తాయి. ఈ పన్ను సంస్కరణలతో ప్రభుత్వంపై వార్షికంగా రూ.40వేల కోట్ల భారం పడనుంది.

కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ శ్లాబ్స్ చూస్తే..

* రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5% పన్ను
* రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10% పన్ను (గతంలో 20శాతం పన్ను)
* రూ.7.5 లక్షల నుంచి రూ.లక్షల వరకు 15% పన్ను (గతంలో 20శాతం పన్ను)
* రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20% పన్ను (గతంలో 30శాతం పన్ను)
* రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25% పన్ను (గతంలో 30శాతం పన్ను)
* రూ.15 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారు 30% పన్ను చెల్లించాలి

కొత్త పన్ను విధానం చర్చకు దారితీసింది. దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. కొత్త పన్ను విధానంపై ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త పన్ను విధానం వల్ల ట్యాక్స్ పేయర్లకు నష్టమే తప్ప లాభం లేదంటున్నారు. కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ రేటు తగ్గించారు, దీని వల్ల ఊరట లభిస్తుందని కేంద్రం చెబుతున్నా.. వాస్తవంగా మాత్రం నష్టమే ఎక్కువ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Budget 2020 Slab rates Analysis

ఈరోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది. పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మరి కొత్త, పాత స్లాబ్ రేట్ లు ఎంతవరకు లాభమో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో చూద్దాం.

1. ఉద్యోగి Taxable Income 6,50,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో
6,50,000-1,50,000 =5,00,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500 కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా చెల్లించాల్సిన టాక్స్ 0

కొత్త విధానం లో

2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 6.5లక్షల వరకు టాక్స్
1,50,00 X10% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ 27,500

2. ఉద్యోగి Taxable Income 7,00,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో
7,00,000-1,50,000 =5,50,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 5.5లక్షల వరకు టాక్స్
50,00 X20% = 10,000
చెల్లించాల్సిన టాక్స్ 22,500

కొత్త విధానం లో

2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.0లక్షల వరకు టాక్స్
2,00,00 X10% = 20,000
చెల్లించాల్సిన టాక్స్ 32,500

3. ఉద్యోగి Taxable Income 8,50,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో
8,50,000-1,50,000 =7,00,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.0లక్షల వరకు టాక్స్
2,00,00 X20% = 40,000
చెల్లించాల్సిన టాక్స్ 52,500

కొత్త విధానం లో

2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.5లక్షల వరకు టాక్స్
2,50,00 X10% = 25,000
7.5-8.5లక్షల వరకు టాక్స్
1,00,00 X15% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ 52,500
పాత కొత్త టాక్స్ లో తేడా లేదు

4. ఉద్యోగి Taxable Income 9,00,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో
9,00,000-1,50,000 =7,50,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.5లక్షల వరకు టాక్స్
2,50,00 X20% = 50,000
చెల్లించాల్సిన టాక్స్ 62,500

కొత్త విధానం లో

2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.5లక్షల వరకు టాక్స్
2,50,00 X10% = 25,000
7.5-9.0లక్షల వరకు టాక్స్
1,50,00 X15% = 22,500
చెల్లించాల్సిన టాక్స్ 60,000

5. ఉద్యోగి Taxable Income 12,50,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో
12,50,000-1,50,000 =11,00,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 10లక్షల వరకు టాక్స్
5,00,00 X20% = 1,00,000
10.0 - 11లక్షల వరకు టాక్స్
1,00,00 X30% = 30,000
చెల్లించాల్సిన టాక్స్ 1,42,500

కొత్త విధానం లో

2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.5లక్షల వరకు టాక్స్
2,50,00 X10% = 25,000
7.5-10.0లక్షల వరకు టాక్స్
2,50,00 X15% = 37,500
10.0 - 12.5లక్షల వరకు టాక్స్
2,50,00 X20% = 50,000
చెల్లించాల్సిన టాక్స్ 1,25,000

6. ఉద్యోగి Taxable Income 16,00,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో
16,00,000-1,50,000 =14,50,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 10లక్షల వరకు టాక్స్
5,00,00 X20% = 1,00,000
10.0 - 14.5లక్షల వరకు టాక్స్
4,50,00 X30% = 1,35,000
చెల్లించాల్సిన టాక్స్ 2,47,500

కొత్త విధానం లో

2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.5లక్షల వరకు టాక్స్
2,50,00 X10% = 25,000
7.5-10.0లక్షల వరకు టాక్స్
2,50,00 X15% = 37,500
10.0 - 12.5లక్షల వరకు టాక్స్
2,50,00 X20% = 50,000
12.5 - 15లక్షల వరకు టాక్స్
2,50,00 X25% = 62,500
15.0 - 16లక్షల వరకు టాక్స్
1,00,00 X30% = 30,000

చెల్లించాల్సిన టాక్స్ 2,17,500

పై ఉదాహరణలతో చూస్తే Taxable Income 8,50,000 వరకు ఉండి 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం.

ఈరోజు ప్రకటించిన 6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5లక్షల లోపు taxable income ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు.

కొత్త పన్ను విధానంతో కలిగే నష్టాలు

▪పాత రేట్ల ప్రకారం పన్ను చెల్లించేందుకు కూడా అనుమతి.

▪పన్ను చెల్లింపుదారులకు కొత్త రేట్లు ఐచ్చికమే

▪కొత్త విధానంలో మినహాయింపులు ఉండవు

▪100 రకాల పన్ను మినహాయింపుల్లో 70 తొలగింపు

▪కొత్త విధానంలో పన్నులు చెల్లిస్తే 80C , 80D లోని మినహాయింపులు ఉండవు

▪కొత్త విధానంలో పన్నులు చెల్లిస్తే 80C లోని మినహాయింపులను ఇవ్వరు. అంటే PF , CPS , LIC , PLI  తదితర పొదుపు మొత్తాలు వదులుకున్న వారికి మాత్రమే ఈ కోత్త రేట్లు.మిగిలిన వారికి పాత రేట్లే.

▪ఈ సంవత్సరం బడ్జెట్ లో ఇచ్చిన పన్ను Slabs next year IT returns కు వర్తిస్తాయి.

▪2.5 లక్షల నుండి 5 లక్షల వరకు పన్ను యథాతథం!అంటే 5 లక్షల లోపు ఆదాయం (Taxable Income)  కలిగి ఉంటే పన్ను ఉండదు కానీ,ఆదాయం 5 లక్షల రూపాయలు దాటితే 2.5 లక్షల నుండి పన్ను 5%  చెల్లించాల్సి ఉంటుంది.

▪మరో ట్విస్ట్ ఏంటంటే ... గతంలో 500000 వరకూ ఉన్న వాళ్ళకి 12500 టాక్స్ రిబేట్ వచ్చేది.అంటే చెల్లించవలసి టాక్స్ zero..  ఇప్పుడు కొత్త పద్దతిలో 500000 ఆదాయం ఉన్నవాళ్ళకి టాక్స్ రిబేట్ తీసేసారు....అంటే 12500 టాక్స్ కట్టవలసిందే

▪Taxable Income 8,50,000 వరకు ఉండి 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం.

▪6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5లక్షల లోపు taxable income ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు.

▪ట్రావెల్ అలవెన్స్ (LTC) మినహాయింపు కోల్పోతారు. గతంలో వేతన జీవులకు నాలుగేళ్లలో రెండు సార్లు ట్రావెల్ అలవెన్స్ మినహాయింపు పొందే అవకాశం ఉంది.

▪జీతంలో భాగంగా వేతన జీవులకు ఇచ్చే హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) ను ట్యాక్స్ కింద పరిగణిస్తారు.

▪వేతన జీవులకు ఇచ్చే స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలు కోల్పోతారు.

▪సెక్షన్ 16 కింద ఇచ్చే వినోద అలవెన్స్, వృత్తి పన్ను కోల్పోతారు.

▪హౌసింగ్ లోన్ పై కట్టే వడ్డీపై రాయితీ కోల్పోతారు. సెక్షన్ 24 కింద ఈ రాయితీ ఇస్తున్నారు.

▪సెక్షన్ 57 కింద ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్ రూ.15వేలు డిడక్షన్ కోల్పోతారు.

▪సెక్షన్ 80సీ కింద ఇచ్చే డిడక్షన్లు కోల్పోతారు. (ఫండ్ కాంట్రిబ్యూషన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్, స్కూల్ ట్యూషన్ ఫీజు).

▪80 D కింద ఆరోగ్య బీమా (మామూలు వ్యక్తులకు రూ.25 వేలు, వృద్ధులకైతే రూ.30 వేలు) పై మినహాయింపు పోతుంది.

▪సెక్షన్ 80డీడీ, 80డీడీబీ కింద పొందే ట్యాక్స్ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకోలేరు.

▪సెక్షన్ 80E కింద ఎడ్యుకేషన్ లోన్ మీద చెల్లించే వడ్డీని క్లెయిమ్ చేసుకోలేరు.

▪స్వచ్చంద సంస్థలకు ఇచ్చే విరాళాలపై రాయితీ కోల్పోతారు. ఇప్పటివరకు సెక్షన్ 80G కింద రాయితీ పొందుతున్నారు.

▪ఈక్విటీ సేవింగ్‌ పథకాల్లో పెట్టే సొమ్ములో 50 శాతం (గరిష్ఠంగా రూ.25 వేలు)పై 80 CCG  కింద వర్తించే పన్ను మినహాయింపు లభించదు.

▪ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై సెక్షన్‌ 80EEB కింద.. ఉన్నత విద్యకు తీసుకునే రుణాలపై వడ్డీకి సంబంధించి సెక్షన్‌ 80ఈ కింద (దీనికైతే పరిమితి లేదు).. దాతృత్వ సంస్థలకు ఇచ్చే విరాళాలపై 80జీ కింద.. వైద్య ఖర్చులపై సెక్షన్‌ 80 డీడీబీ కింద.. ఉద్యోగులకు ఎల్టీసీ, హౌస్‌ రెంటు అలవెన్స్‌ (అద్దె భత్యం)కింద ఇస్తున్న చాలా మినహాయింపులు పోతాయి.

▪సెక్షన్‌ 80 TTA  కింద.. పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ (రూ.10 వేల లోపు) మినహాయింపు పోతుంది.


▪80C, 80CCC, 80CCD, 80D, 80DD, 80DDB, 80E, 80EE, 80EEA, 80EEB, 80G, 80GG, 80GGA, 80GGC, 80IA, 80-IAB, 80-IAC, 80-IB, 80-IBA సెక్షన్ల కింద పొందే రాయితీలన్నీ.. కొత్త పన్ను విధానం ఎంచుకుంటే.. కోల్పోవాల్సి ఉంటుంది. క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు.