Monday, October 7, 2019

VALMIKI JAYANTHI AS AP STATE FESTIVAL

వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా ఆశ్వయుజ పౌర్ణమి నాడు వాల్మీకి జయంతి నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈనెల 13న ఈ వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని నిర్వహణకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు రూ.25లక్షల నిధులను విడుదల చేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా వాల్మీకిల జనాభా అధికంగా ఉండే అనంతపురం జిల్లాకు రూ.6లక్షలు, మిగిలిన 12 జిల్లాలకు రూ.19 లక్షలు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మహర్షి వాల్మీకి ఎవరు? వల్మీకము (పుట్ట) నుండి వెలుపలికి వచ్చిన వారు కావున వాల్మీకి. మరామరా అని తపస్సుచేసిన వారు  కావున మహర్షి, రాముడి జీవితచరిత్రను రామాయణముగా మహాకావ్యరచన గావించి నవాడిగా ఆదికవి అయ్యాడు.

అయితే వాల్మీకి జన్మము ఎట్టిది? ఆయన తల్లితండ్రులు ఎవరు? అనే విషయము పై అనేక తర్జనభర్జనలు, కట్టుకథలు ప్రాచుర్యములో ఉన్నాయి. ఏ రచయత అయినా తన గురించి ఉపోధ్గాతము మరియు పరిచయము తదితర అంశములను తెలుపుకోవటము ఈనాటి రచయతలు పాటిస్తున్న విధానము. వేదవ్యాసుడు తాను మత్స్యగంధి, పరాశరుల కుమారుడనని తన రచనలలోనే చెప్పుకోవడముతో వ్యాసుడు ఎవరన్నది కచ్చితముగా తెలిసింది. అదేవిధముగా రచయతగా తాను ఎవరన్నది ప్రత్యేకముగా వాల్మీకి వ్రాయనప్పటికీ సందర్భానుసారముగా సీతను రాముడికి అప్పచెబుతున్న సమయములో ఉత్తరకాండ (రామాయణము)లో వాల్మీకి ఇలా రాసాడు “రామా నేను ప్రాచేతసుడను ప్రచేతసుడి ఏడవ (దశమ) కుమారుడిని. వేలసంవత్సరాలు తపస్సు చేసి, ఏ పాపము చేయని, అబద్దమాడని మహర్షిని. సీత నిన్ను తప్ప మనసా, వాచా పరపురుషుడిని ఎరగని మహాపతివ్రత. నా మాట నమ్ము, సీతను ఏలుకో. నా మాటలు తప్పు, అబద్దము అయితే ఇంతకాలము నేను చేసిన తపస్సు భగ్నము అవుగాక.” అంటాడు. (వాల్మీకి రామా యణము-తెలుగు అనువాదము,క్రీ.శే.పురిపండా అప్పలస్వామి)

వాల్మీకి మహర్షి

వాల్మీకిగా పిలవబడుతున్న మహర్షి పేరు ప్రాచేతసుడని ఇక్కడ మనము గుర్తించవచ్చును.ఇది వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పుకున్న విషయము. ఆయన మాటలలో ఆర్ధత, నిజాయతీ ఉట్టిపడుతున్నాయి. అయితే ప్రచేతసుడు ఎవరు? ప్రచేతసుడు ఎవరి కుమారుడు? ఆయనది ఏ వంశము? ఈ విషయ ములను తెలుసుకోవటానికి అనేక పురాణములను, చరిత్రలను చదవవలసి ఉంటుంది. ప్రచేతసుల గురించిన ప్రస్తావన “శ్రీ మత్భాగవతము”లో ఉంది. శ్రీ మత్భాగవతము వేదవ్యాసవిరచితము. వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో శ్రీ మత్భాగవతము ఒక గొప్ప పురాణము.భారతదేశములోని మహాపురుషుల చరిత్రలు పురాణములుగా వ్రాయబడి ఉన్నాయి. భారతదేశము పై మొదటగా మహమ్మదీయులు దాడి చేయటముతో భారత చరిత్రను వ్రాసిన వారు స్థిరత్వము, ప్రోత్సాహము లేని పరిస్థితులలో చరిత్రలను వ్రాసే స్థితిలో ఉండకపోవడం జరిగింది. ఆంగ్లేయుల పాలన మొదలైన తరువాత ప్రశాంత వాతావరణము ఏర్పడింది. (శ్రే వేమన పద్యసారామృతము-సి.పి.బ్రౌన్)  చరిత్ర అనగా హిస్=అతనియొక్క, స్టోరీ=కథ అని ఆంగ్లేయులు వచ్చిన తరువాతే చరిత్ర అనే పదము వాడు కలోకి వచ్చి చరిత్రలను వ్రాయటము మొదలు పెట్టారు. అంతకు ముందు భారతదేశ చరిత్రలను పురాణముల పేరుతో తెలుసుకునే వారు.భారతదేశములో పురాణములను అనగా జరిగిపోయిన వాస్తవాలను (చరిత్రలను) కాలక్షేపానికో, పుణ్యానికో చదవటము, వినటము అలవాటుగా వస్తోంది. పురాణములంటే భారతీయులకు అత్యంత విశ్వాసము. పురాణములలోని వ్యక్తుల జీవితకథలను, అందులోని నీతి, నిజాయతీలను, సంఘటనలను నిజమనే నమ్ముతారు. వారిని ఆదర్శముగా తీసుకొంటారు. పురాణాలలోని ఆచార వ్యవహారాలను, వ్రతములను, పూజాదికార్యక్రమములను, జన్మనుండి మరణము వరకు సాగే బారసాల, అన్నప్రాశన, అక్షరాభ్యాసము నుండి పుంసవనము, శ్రీమంతము, వివాహము  తరువాత అప్పగింతలు, మరణము తరువాత  పార్థీవశరీరానికి చేసే క్రతువులు అన్నీపురాణాలలో వివరించిన విధముగానే పాటిస్తారు. పురాణ రచయతలను భగవత్‌సమానులుగా కొలుస్తారు. భగవంతుడే వాల్మీకిమహర్షిగాను (బ్రహ్మ), వేదవ్యాసుడు (శ్రీ మహావిష్ణువు) గాను జన్మించి పురాణములను రచించినారని, అవి విశ్వమానవ సౌభ్రాతత్వమును చాటుతాయని నమ్ముతారు. శ్రీ మధ్భాభాగవతము, శ్రీ విష్ణు పురాణము అన్నవి భగవాన్ విష్ణువు,ఆయన భక్తుల కథలు. ఎవరైతే శ్రీ మహా విష్ణువును నమ్మి కొలుచుకున్నారో, ఆయన వారిని కష్టాలబారి నుండి ఎలా రక్షించాడో తెలిపే కథలు ఈ పురాణాలలో తె లుపబడ్డాయి. శ్రీ మథ్భాగవతము ద్వాదశస్కంధములుగా వ్రాయబడింది. శ్రీ మథ్భాగవతము చతుర్థ స్కంధ  ములో త్రయోదశోధ్యాయములో విదుర ఉవాచ:

కే తే ప్రచేతసోనామ కస్యాపత్యాని సువ్ర

కస్యా న్వవాయే ప్రఖ్యాతా: కుత్ర వా సత్రామాసత                                       

అర్థము: గొప్ప భగవత్ భక్తిని గలిగిన ఆచార్యా    “ప్రచేతసులు చేయుచున్న సత్రయాగములో నారదులు గానము జేసితిరని చెప్పితిరి గదా. ఆ ప్రచేతసులు ఎవరు?వారెవరి కుమా రులు? ఎవరి వంశమందు ప్రసిద్ధిని పొందిరి.”అని విదురుడు  ప్రశ్నిస్తూ మైత్రేయునితో ఇంకా ఇలా అన్నాడు.

స్వధర్మశీ లై:పురుషైర్భగవాన్ పురుషోత్తమ:

ఇజ్యమానో భక్తిమతా నారాదేనేరిత:కి ల

అర్థము:క్షత్రియులైన ప్రచేతసులు తమతమ ధర్మముల మూలకముగా శ్రీ హరిని యజ్ఞ యాగాదులచే పూజించుచుండిరి. అచ్చటికి వచ్చిన నారదులు, యజ్ఞమయుడు, పురుషో త్తముడైన విష్ణువును గురించి ఉపదేశించిరని వినియున్నాము.

ఇక్కడ తెలిసిన విషయము ప్రచేతసులు విష్ణుభక్తులు. క్షత్రియులు. వీరికి విష్ణువు, యజ్ఞయాగాదుల గురించి నారదుల వారు ఉపదేశము చేశారు. ఆ తరువాత కథా క్రమములో ధ్రువుడి తపస్సు, శ్రీహరి ప్రత్యక్షమవటము, వరాల అను గ్రహము, ధ్రువ వంశవిస్తరణ, సూర్యవంశస్థులు, బోయలవంశక్రమము వత్సరుడు, పుష్పార్ణుడు, సాయంకాలుడు, చక్షుడు, ఉల్కకుడు, అంగుడు, వేనుడు, పృథ్వీరాజు, విజితాశ్వుడు, పావనుడు, హవిర్ధానుడు, ప్రచేతసుడు, ప్రాచేతసులు (10మంది) అని తెలియబడతారు. వీరి జన్మవృత్తా౦తములు, అంగుడి బాధ, వేనుడి దుశ్చర్యలు, పృథ్వీ రాజు ఔన్నత్యము, నిషాదుడు అడవులలోకి పంపబడి కిరాతరాజవ్వటము, ప్రచేతసుడికి 10 మంది ప్రాచేతసులు జననము వివరించబడ్డాయి. ఆ 10మంది ప్రాచేతసులలో 7వ (పదవ) వాడు వాల్మీకి మహర్షి.

ప్రాచేతసుడు క్షత్రియవంశములో జన్మించాడు, నారదుల ఉపదేశముతోనూ, తండ్రి, తాతల, ముత్తాతల  సుకృతము, శ్రీహరిపై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిని మహర్షిగా రూపొందింపచేశాయి. వాల్మీకిమహర్షి యొక్క నిజకథ ఇది. ఈ విషయములను కప్పిపుచ్చి అనేక కథలు తరతరాలుగా ప్రాచుర్యము పొందాయి.వాల్మీకి మహర్షి గురించి ఎవ్వరూ పరిశోధనలు గావించక పోవడముతో కట్టుకథలు ఇంత వరకు ప్రాచుర్యములో ఉన్నాయి. రాముడు అనే పాత్రను లోకానికి  ఆదర్శపురుషుడిగా చూపించాలని ఆదికవి తపనే గాని ఆపాత్రకు గుణగణాలు రూపొందిచటమే తన ధృష్టి తప్ప తన గురించి తానెవరో అనే గొప్పలు చెప్పాలనే ఆలోచన తన రచనల్లో కనిపించదు. వాస్తవాన్ని కూడా చెప్పక పోవడముతో ఎవరికి తోచినది వారు ఊహాగానాలు చేశారు. మహానుభావులు ఎప్పుడూ ఇతరుల గురించి, వారి బాగుగురించి ఆలోచిస్తారే తప్ప వారి గురించి వారు తపించరు.

మహర్షివాల్మీకి ఎప్పుడూ, ఎక్కడా తాను తన జీవితచరిత్రను వెలి బుచ్చక పోవటముతో కొందరు వాల్మీకి పేరు రత్నాకరుడని ఆయన పూర్వాశ్రమములో దొంగ, దారి దోపిడీదారుడని వ్రాశారు. మరి కొందరు ఆయన బ్రాహ్మణుడని,పేరు అగ్నిశర్మ అని  దొంగల ముటాలో పెరిగి దొంగ అయినాడని వ్రాశారు. ఈ కట్టు కథలకు ఎక్కడా ఆధారాలు  లేవు (ఇలపావులూరి  పాండురంగారావు,ఆచార్య సహదేవ, జస్టిస్ భల్లా).భగవధ్గీతలో కూడా అనేక మార్పులు, చేర్పులు జరిగాయని, మూల గీతలో లేని అనేక శ్లోక ములు చేర్చబడ్డాయని డాక్టర్ రాధాకృష్ణన్, రుడాల్ఫ్ ఓటో అభిప్రాయ బడ్డారు. (దర్శనములు-మతములు-విజ్ఞాన సర్వస్వము, నాలుగవ సంపుటము-ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి)  వాల్మీకిమహర్షి గురించి కొందరు ఓర్వలేక, అసూయతో లేదా దొంగ కూడా తపస్సు చేసి మహర్షి కావచ్చు అనేందుకు ఉదాహరణగా చూపేందు కో  అల్లిన కట్టు కథలు.

భారతీయ సాహిత్య నిర్మాతలు-వాల్మీకి అనే ఆంగ్లపుస్తకములో ఇలపావులూరి పాండురంగారావు గారు ఈ క్రింది విధముగా వాల్మీకిమహర్షి పై వ్యాఖ్యానించారు.

“వాల్మీకి తన జీవితారంభ దశలో కిరాతుడని, సప్తరుషులచే  ఋషిగా పరివర్తన పొందగలిగాడని  ప్రచారములో ఉన్న కథ వినడానికి ఉత్కంఠ భరితముగా ఉండవచ్చుగాని దానికి తగిన చారిత్రాత్మక ఆధారాలు లేవు. జీవితాన్ని గూర్చి సంపూర్ణ అవగాహన గలిగి, శాస్త్రీయ ధృక్పథముతో రసజ్ఞ సౌందర్యాన్ని కవితామయముగా  మేళవించిన వ్యక్తిని గూర్చి అలా చెప్పడము భావ్యము కాదు. వాల్మీకి కిరాతుడు అనే కథ బహుళ ప్రచారములో ఉన్నందున ఆ ధృక్పథము తోనే చూస్తున్నారు.”


రామాయణ కర్తగా వాల్మీకి

వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు 7 కాండాలుగా (ఉత్తరకాండ సహా)విభజించబడి ఉన్నాయి. రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి. ఇది మహాభారత కావ్యంలో దాదాపుగా పావు వంతు భాగం. ప్రసిద్ధ ఆంగ్ల రచన ఇలియాడ్కు ఇది నాలుగు రెట్లు పెద్దది. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. రామాయణంలో తెలుపబడిన విషయాలననుసరించి కనీసం లక్ష సంవత్సరాల ప్రాచీనమవవచ్చని భారత దార్శనికుల నమ్మకం. ఇతర ఇతిహాసాల్లాగానే రామాయణం కూడా ఎన్నో మార్పులకు, కలుపుగోరులకు, తీసివేతలకు గురి అయింది.

వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది.

తొలి శ్లోకం

వాల్మీకి తపస్సంపన్నత తరువాత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా. భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు. చూసి పరవశానికి గురి అవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు:

మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥

ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.
ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి[3]. ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం సాంతం రాసేవరకూ సాగింది.

0 comments:

Post a Comment