WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

NADU NEDU SCHOOL DEVELOPMENT PROGRAM

NADU NEDU SCHOOL DEVELOPMENT PROGRAM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన ‘నాడు- నేడు’ కార్యక్రమాన్ని నవంబర్ 14న ప్రారంభించాలని భావిస్తోంది. వచ్చే నాలుగేళ్ళలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాలనే లక్ష్యంతో ప్రతి ఏడాది రూ. 1500 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ6 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. దీనికోసం ప్రైవేటు కాంట్రాక్టర్లతో కాకుండా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతిని దేశంలోనే తొలి సారిగా అమలు చేయాలని జగన్‌ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి పాఠశాల ఆధునికరణ చేపట్టాలనే యోచనలో విద్యాశాఖ ఉంది. ‘నేడు పాఠశాల ఎలా ఉంది...నాలుగేళ్ల తరువాత ఎలా ఉందో’ తెలిపే ఫోటోలను ప్రజల ముందుంచాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు.
ఈనాడు  అమరావతి