గ్రామ సచివాలయంలో Select అయిన వారు Web Counseling ద్వారా Vacancies ను Select చేసుకోవాలని పంచాయితీ రాజ్ కమీషనర్ గారు అన్ని జిల్లాల Collectors కు ఇచ్చిన ఆదేశాలు.
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయించింది. ఉద్యోగి సొంత మండలం లో మరే గ్రామమైనా.. జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వనున్నారు. పోస్టింగ్ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది.
- సచివాలయ’ ఉద్యోగుల విధివిధానాలు ఖరారు
- మూడు ప్రాంతాలను ఎంచుకునే చాన్స్
- వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్
- ఒకే పోస్టుకు ఎక్కువ మంది పోటీ పడితే రెండు, మూడు ప్రాధాన్య స్థానాల్లో నియామకం
- అపాయింట్‌మెంట్ లెటర్ల తర్వాత ఉద్యోగులకు వేరుగా పోస్టింగ్ ఆర్డర్లు
- అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామ, వార్డు సచివాలయాలు
- ఉద్యోగులకు నేడు విజయవాడలో నియామక పత్రాలు అందజేయనున్న సీఎం వైఎస్ జగన్
0 comments:
Post a Comment