Tuesday, July 23, 2019

WHATS APP AUDIO MESSAGES NEW FEATURE

WHATS APP  AUDIO MESSAGES NEW FEATURE


నేటి యువత నేరుగా ఫోన్‌లో మాట్లాడేకంటే సందేశాలపైనే మొగ్గు చూపుతున్నారు. వాట్సాప్‌ రాకతో అది మరింత విస్తృతమైంది. సాధారణంగా వాట్సాప్‌లో వీడియో, రాతరూప సందేశాలు పంపేముందు ఒకసారి పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల తప్పుడు సందేశాలు పంపే అవకాశం ఉండదు. కానీ సంక్షిప్త అడియో సందేశాలను పంపే ముందు వాటిని మరోసారి సరిచూసుకునేందుకు అవకాశం ఉండదు. నేరుగా అవతలి వ్యక్తికి చేరుకుంటాయి. ఆ రికార్డింగ్‌లో పొరపాట్లు జరిగితే ఇంకా అంతే సంగతులు. ఆ ఇబ్బందిని తొలగించేందుకు ఇపుడు వాట్సాప్ సంస్థ సన్నద్ధమౌతోంది. ఆడియో రికార్డింగ్‌ సందేశం పంపేముందు పరిశీలించుకునే విధంగా యాప్‌లో మార్పులు చేస్తోంది. ఈ ఫీచర్‌ ఐవోఎస్‌లో బీటా దశలో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.

0 comments:

Post a Comment