Wednesday, July 24, 2019

DOWNLOAD PROMOTION FIXATION SOFTWARE

DOWNLOAD PROMOTION FIXATION SOFTWARE,LPC AND NON DRAWAL



ప్రమోషన్ పొందిన సందర్భంలో వేతన స్థిరీకరణ ఎఫ్ ఆర్ 22 బి ప్రాధాన్యత గురించి... వివరణ


 25.12.1982 తదుపరి అదనపు బాధ్యతలు గల పోస్టు నందు నియమించబడిన వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. 1992, 1998 పిఆర్సీ స్కేళ్ళలో 8సంవత్సరాల స్కేలు పొందకుండానే ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం, 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22ఎ(1)ప్రకారం వేతన స్థిరీకరణ చేయబడేది.

       2005 పిఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా ఇవ్వబడిన ఆటోమాటిక్ అడ్వాన్మెంట్ స్కీమ్ జివో 241 ఆర్థిక తేదీ: 28-09-2005 ద్వారా 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి కూడా ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకణలో రెండు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. 2010, 2015 వేతన స్కేళ్లలో ఆర్డినరీ 6/12/18 స్కేళ్లు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకరణ జరుగుతుంది.

    దీని ప్రకారం క్రింది పోస్టులో వేతనమునకు ఒక నోషనల్ ఇంక్రిమెంట్ కలిపి సదరు వేతనం ఆధారంగా పై పోస్టు యొక్క స్కేలులోని తదుపరి స్థిరీకరణ వేతన స్థిరీకరణ చేయబడుతుంది.

    ఈ నిబంధన ప్రకారం వేతన స్థిరీకరణ రెండు విధాలుగా చేయవచ్చు.

1. 'వాస్తవ ప్రమోషన్' తేదీ నాడు గానీ లేదా

2. క్రిందిపోస్టులోని తదుపరి 'ఇంక్రిమెంట్'  తేదీ నాడు గానీ వేతన స్థిరీకరణ చేయవచ్చును.

       జివో ఎంఎస్ నెం. 145, ఆర్థిక తేదీ: 19.05.2009 ప్రకారం ఉద్యోగికి లాభదాయకంగా ఉండే విధానంలో  పైరెండింటిలో దేనిప్రకారం అయిన ఉద్యోగి ఆప్షన్ తో పనిలేకుండానే వేతన నిర్ణయం చేసేబాధ్యత డ్రాయింగ్ అధికారికి కల్పించబడింది.
ఉదాహరణ: అక్టోబర్ నెల ఇంక్రిమెంట్ తేదీగా గల రమేష్    అనే ఉపాధ్యాయుడు తేదీ: 06.07.2019న స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందినాడు. సదరు తేదీనాటికి అతని వేతనం రూ.28940 - 78910 స్కేలులో రూ.44870/-లు గా ఉన్నది. వీరి వేతనం ఎఫ్ ఆర్ 22బి ప్రకారం రెండు విధాలుగా స్థిరీకరించవచ్చు.

ప్రమోషన్ తేదీనాడు వేతన స్థిరీకరణ:


1. తేదీ: 06-07-2019 నాటికి ఎస్జిటి పోస్టులో మూల వేతనం మరియు స్కేలు:రూ, 44,870/-స్కేలు 28940 - 78910

2. ఎఫ్ ఆర్ 22బి ప్రకారం ఒక నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు :రూ, 46060/- స్కేలు 28940 - 78910

3. స్కూల్ అసిస్టెంట్ స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం : రూ,47330/- స్కేలు 28940 - 78910

4. తదుపరి ఇంక్రిమెంట్ తేదీ:  01.07.2020

★ ఇంక్రిమెంట్ తేదీ ప్రమోషన్ తేదీకి అంటే జులై నెలకు మారుతుంది

క్రింది పోస్టులోని ఇంక్రిమెంట్ తేదీనాడు వేతన స్థిరీకరణ:

1. తేదీ 03.07.2019 నాటికి ఎస్జిటీ పోస్టులో మూల వేతనం మరియు స్కేలు: రూ, 44,870/- స్కేలు 28940-78910

2. పదోన్నతి పొందిన రోజున ఎఫ్ ఆర్ 22(1) ప్రకారం వేతన నిర్ణయం: రూ, 46060 స్కేలు 28940-78910

3. తేదీ 01.10.2019న ఎస్జిటి పోస్టులో వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు: రూ, 47,330 స్కేలు 28940 - 78910

4. ఎఫ్ ఆర్ 22బి ప్రకారం ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు(10/19)న:  రూ, 47330/- స్కేలు 28940 - 78910

5. స్కూల్ అసిస్టెంట్ పోస్టు స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం(10/19)న :  రూ,48,600/-  స్కేలు 28940 - 78910

6. తదుపరి ఇంక్రిమెంట్ తేదీ:  01.10.2020
   
      పై రెండు పద్దతుల్లో ఇంక్రిమెంట్ తేదీకి వేతన నిర్ణయం చేయడం లాభదాయకంగా ఉంటుంది. ఇంక్రిమెంట్ తేదీ పాతదే అంటే అక్టోబర్ నెల కొనసాగుతుంది.

👉 24 సంవత్సరాల స్కేలు పొందుతూ ప్రమోషన్ వచ్చినవారికి  ఈ నిబంధన వర్తించదు. వారికి  ఎఫ్ ఆర్22ఎ(1)నిబంధన వర్తిస్తుంది. దాని వలన ఒక ఇంక్రిమెంట్ ప్రయోజనం లభిస్తుంది.
DOWNLOAD PROMOTION FIXATION SOFTWARE CLICK HERE

MODEL  LPC DOWNLOAD AND  NON DRAWAL CERTIFICATE

LPC SOFTWARE DOWNLOAD


0 comments:

Post a Comment