Saturday, April 6, 2019

POLLING STAFF 2019 -PO'S ,APO'S OPO,S INSTUCTIONS

POLLING  STAFF 2019 -PO'S ,APO'S OPO,S INSTUCTIONS 



డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద:
...................................

1. మీ టీం సభ్యులను కలుసుకుని మెటీరియల్ ను తీసుకోండి.

2,.బ్యాలెట్ యూనిట్, controlయూనిట్,వి.వి PAT, మార్క్ డ్ కాపి ఆప్ ఎలక్టోరల్ రోల్, పోలింగ్ స్టేషన్ నంబర్  సూచించే రబ్బర్ స్టాంపు, పేపర్ సీల్స్, స్క్రిప్ట్ సీల్స్,స్పెషల్ tags, టెండర్ బ్యాలెట్ పేపర్స్,  పింక్ సీల్ , బ్లాక్ కవర్, మాదిరి పోలింగ్ స్టాంప్,మొదలగునవి మీ పోలింగ్ స్టేషన్   సంబంధించినవేనా?కాదా? అని ఒకటికి  రెండుసార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోండి!

3. మిగతా సామాగ్రినంతా checklist తో సరిపోల్చుకోండి.. ముఖ్యంగా మెటల్  సీల్, 17 సి , ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ  డిక్లరేషన్ ఫారాలు, 17 ఏ రిజిస్టర్ ,  Indelible ink, పోలింగ్ ఏజెంట్  ఐడికార్డ్స్ పోలింగ్ సిబ్బంది ఐడికార్డ్స్,           స్టాంపు ప్యాడ్,జాగ్రత్తగా చూసుకోండి!

పోలింగ్ స్టేషన్ చేరిన తర్వాత:
........................................


1. వంద మీటర్ల పరిధిలో ఎలాంటి పోస్టర్లు,   బ్యానర్లు ఫోటోలు లేకుండా చూడండి


2. పోలింగ్ స్టేషన్ కు అవసరమైన కుర్చీలు బెంచీలు, బల్లులు అటెండెంట్ సాయంతో
    సమకూర్చుకోండి!

3. పోలింగ్ సిబ్బందికి ఐడికార్డ్స్ ఇవ్వండి

4. వారికి విధులను అప్పగించండి

5. ఏ పీ ఓ చే మేల్ ఫిమేల్ ఓటింగ్ శాతాన్ని చూపించే వీలుగా తెల్ల కాగితంపై నంబర్లు                                  
   వేయించండి!
6. రెండవ పి ఓ చే 17 ఏ రిజిస్టర్ లో కనీసం 50శాతంసీరియల్ నెంబర్లువేయించండి   మరియు ఓటర్ slip లపైసీరియల్,   సీరియల్ నంబర్లు వేయించండి.

7. మూడవ పి వో సహకారంతో మీరు ',పూర్తి చేయాల్సిన ఫాంస్, కవర్లపై  స్టేషన్ నంబర్లు, పేరు మొదలగునవి'  రాయడం పూర్తి చేసుకోండి!

8. అటెండెంట్ సహకారంతో పోలింగ్ స్టేషన్ ఏరియా తెలిపే మరియు అభ్యర్థుల  వివరాలు తెలిపే పోస్టర్లను  బయట గోడకు అంటించండిమరియు ఓటింగ్ కంపార్ట్ మెంట్ సిద్ధం చేయండి.

9. మిమ్మల్ని కలిసిన పోలింగ్ ఏజెంట్లకు ఐడికార్డులు ఇవ్వండి మరియు ఉదయం ఆరు గంటలకి మాదిరి ఎన్నికకు హాజరు కావలసిందిగా సూచించండి.

ఎన్నిక రోజు మాదిరి పోలింగ్
.......................................

1. ఉదయం అయిదు గంటలకి ఈవీఎంలు సిద్ధంచేయండి

2. బ్యాలెట్ యూనిట్ న vvpatతో జత చేయండి

3. తర్వాతvvpat న కంట్రోలింగ్ యూనిట్ తోజత చేయండి

4. ఉదయం 6 గంటలకల్లా మాదిరి పోలింగ్ కు సిద్ధం కండి, పోలింగ్ ఏజెంట్ల కోసం అదనంగా 15 నిమిషాలు ఎదురు చూడండి

5. మాదిరి పోలింగ్ ముందు ఏజెంట్ల కు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మరియు vvpat  పనితీరు గురించి వివరించండి.

,6.v v pat ఆన్ చేయుట కువెనుక వైపు నాబ్ నుఅడ్డం నుండి నిలుపు దిశకు మార్చండి 

7.కంట్రోల్ యూనిట్ button ఆన్ చేయండి

8. వరుసగా అభ్యర్థుల గుర్తులకు సంబంధంలేని 7  slipలు vvpat డిస్ప్లే లో కనబడుతూ బాక్స్ లో పడి పోతాయి

9, క్లియర్ buttonనొక్కిcontrolయూనిట్ లో ఎలాంటి ఓట్లు లేవని చూపండి.

10. ఒక్కొక్క ఏజెంట్ ను. మాదిరి ఓటును వినియోగం చేసుకోవాల్సిందిగాసూచించండి

11. అందరిచేసమానంగాఓటువేయంచండి.

12.అభ్యర్థులందరి తో పాటుగా nota  buttonకి  ఓటు పడేలా జాగ్రత్త తీసుకోండి.

13. మొత్తం 50 ఓట్లను వేయించండి ఒక్కొక్క ఏజెంట్ ఎన్ని ఓట్లు వేసినారు అనేది కాగితంపై note చేయండి

14. మాదిరి ఓటింగ్ తరువాత టోటల్ బటన్ నొక్కండి. తర్వాత రిజల్ట్ బటన్ నొక్కండిControl unit డిస్ప్లే లో చూసి ఏ అభ్యర్థికిఎన్ని ఓట్లు వచ్చాయి నమోదు చేయండి. తరువాత క్లియర్ బటన్ నొక్కండి,తరువాత బటన్ ఆఫ్ చేయండి.

15. వి.వి. ప్యాట్ డ్రాప్ బాక్స్ డోరు తెరిచి Slips (50+7)ను బయటికి తీసి అభ్యర్థుల వారిగా టేబుల్ పై పరచండి.

16. ఓటింగ్ సమయంలో పేపర్ పై రాసిన  అభ్యర్థుల ఓట్లు, control unit చూపించు ఓట్లు, స్లిప్పుల ద్వారా లెక్కించిన ఓట్లు అన్ని సమానం అని ధ్రువీకరించాలి.   డిక్లరేషన్ లో ఏజెంట్లు సంతకం తీసుకోవాలి

17. మాదిరి పోలింగ్ సర్టిఫికెట్ ను నింపి ఏజెంట్ల సంతకం తీసుకోవాలి.

18. 57 slips వెనకవైపు మాదిరి పోలింగ్ స్టాంపు వేసి బ్లాక్ కవర్లో పెట్టి సీల్ చేయాలి. కవర్ పై పోలింగ్ స్టేషన్ వివరాలు రాసి, ఏజెంట్ల సంతకం తీసుకోవాలి కవర్ ను ప్రత్యేకమైన బాక్సులో పెట్టి పింక్ పేపర్ తో సీల్ చేయాలి

19, వి.వి పేట్ డ్రాప్ బాక్స్ డోర్ కు అడ్రస్ Slipకట్టి మీరు సంతకం చూసి ఏజెంట్లకు సంతకం చేయించండి

20. అడ్రస్ slip, స్పెషల్ టాగ్, గ్రీన్ పేపర్  సీల్, strips సీల్ లపై మీ సంతకం చేసి, ఏ పి ఓ  ఏజెంట్లసంతకంచేయించండి.
21. కంట్రోలింగ్ యూనిట్ లో మొదట గ్రీన్ పేపర్ సేల్ అమర్చండి , తరువాత స్పెషల్ టాగ్ అమర్చి లక్కతో సీల్ వేయండి, తర్వాత రిజల్ట్ కంపార్ట్మెంట్ డోర్ మూసి స్టెప్ సీల్ తో control యూనిట్ ను సీల్  చేయండి,

22, అడ్రస్ టాగ్ లపై సంతకాలు చేసి కంట్రోలింగ్ యూనిట్ కు బ్యాలట్ యూనిట్ లకు కట్టండి,

23, ప్రిసైడింగ్ఆఫీసర్ డైరీలో మరియు సెవెంటీన్ సి లోను స్క్రిప్ట్ సీల్, పేపర్ సీల్ స్పెషల్ టాగ్ నెంబర్ల వివరాలు రాయండి

24, డిక్లరేషన్ పై మీరు సంతకం చేసి ఏజెంటు సంతకాలు  చేయించండి.

23,  వి వి పాట్ నాబ్,control unit button లను ఆన్ చేయండి.

24, ని వి పాట్ లో 7 slips వడతాయి

 ఓటింగ్ కు ముందుగా
.........................

1. ఏ పీ ఓ మార్కడ్ కాఫీకి ఇంజార్జి

2. రెండవ పోలింగ్ ఆఫీసర్ 17 ఏ రిజిస్టర్ ఇంఢిలబుల్ సీరా మరియు ఓటర్ స్లిప్స్ ఇంచార్జ్

3 మూడవ పోలింగ్ ఆఫీసర్ మోటర్ స్లిప్స్ రిసీవ్ మరియు control unit  ఇంచార్జ్

4. వీరిని వరుస క్రమంలో కూర్చోబెట్టండి

5. ఎట్టిపరిస్థితులలోనూ ఏడు గంటలకల్లాఓటర్లను ఓటింగ్ హాల్లోకి అనుమతించండి
.
ఓటింగ్ తీరు
.....................

1.ఓటర్ తీసుకొచ్చిన ప్రూఫ్ ఆధారంగా ఏ పీ ఓ ఓటర్ పేరును బయటికి వినబడేటట్టు గా చదివి, మార్కుడ్ కాపీలో ఓటర్ ఫోటోమరియు పేరు దగ్గర diagonal గా క్రాస్ చేస్తాడు. మరియు ఫిమేల్ ఓటర్ ఐతే దీంతోపాటుగా నంబర్ వద్ద రెడ్ ఇంక్ తో రౌండప్ చేస్తాడు.

2. రెండవ పోలింగ్ ఆఫీసర్ ముందుగా ఓటర్ చూపుడు వేలుకు  inkపెడతాడు తర్వాత 17 ఏ సిస్టర్ లో ఓటర్
సీరియల్ నంబర్ మరియు గుర్తింపు నంబర్ రాసి సంతకం తీసుకుంటాను తర్వాత ఓటర్ స్లిప్ పై సీరియల్ నెంబర్ రాసి సంతకం చేసి ఇస్తారు

3. మూడవ పోలింగ్ ఆఫీసర్ హోటల్ స్లిప్పులు తీసుకొని control unit లోని బ్యాలెట్ బాటలో ను నొక్కి కోటను ఓటింగ్కుఅనుమతిస్తాడు.

ఓటింగ్ సమయంలో...
..................

1, వచ్చిన ఓటర్ నిజం కాదని ఎవరైనా ఏజెంట్ చాలెంజ్ చేస్తే, చాలెంజ్ ఫీజు తీసుకొని , బి ఎల్ ఓ, తో నిజానిజాలు తెలుసుకుని నిజమైతే ఓటరును అనుమతించండి లేదా పోలీసులకు అప్పగించండి. వివరాలుఫారంలోనింపండి.

2. ఎవరైనా కళ్ళు కనబడను వారు, వయో వృద్ధులు వస్తే వారిని వారికి తోడుగా కంపెనీయన్ ను తెచ్చుకోమని చెప్పండి. తెచ్చుకున్నట్లే తే ఓటర్ వివరాలు ఫారం లలోనింపండి.

3, నిజమైన ఓటరు వచ్చినప్పుడు అంతకు ముందే ఎవరో తన ఓటును వేసినట్లుగా తెలిస్తే, అతనికి  నచ్చచెప్పి టెండర్ బ్యాలెట్ పేపర్ ను ఇవ్వండి, ఓటు వేయడానికి స్వస్తిక్ స్టాంపు ఇయ్యండి, ఓటు వేసి వచ్చిన తర్వాత దాని వెనకాల పోలింగ్ స్టేషన్ నెంబర్ స్టాంపు వేయండి, దానిని ప్రత్యేకమైన కవర్ లో పెట్టండి. వివరాలు ఫాం లో నింపండి.

4 -, ఎవరైనా  నియమాలు పాటించకుంటే రూల్ 49 m ప్రకారం బయటికి పంపించండి. ఆ వివరాలు 17 ఏ రిమార్క్ కాలంలో రాయండి.

5, ఎవరైనా ఓటర్ 18సంవత్సరాలు కు తక్కువ ఉన్నట్టు గా మీరు అనుమాన పడితే ఓటర్  డిక్లరేషన్ సంతకం చేయించి ఓటుకు అనుమతించండి.

6.ఏ ఓటర్ అయినా 17 ఏ లో సంతకం చేసిన తర్వాత తనకు తానుగా ఓపెన్ చేయను అనుకుంటే 49 రూల్ ప్రకారం17 ఏ లో రీమార్క కాలంలో మరోసారి సంతకం చేయించి పంపించండి, సంతకం చేయడానికి నిరాకరిస్తే.  మీరే సంతకం చేయండి. ఆ వివరాలు నోట్ చేసుకోండి,

7. ఎవరైనా ఓటరు వివి పేట్ లో డిస్ప్లే లో
ఎవరికైతే తాను ఓటు వేశారు, వారికీ కాకుండా మరొక గుర్తుకు ఓటు పడిందని ఫిర్యాదు చేస్తే ఓటర్ కు,నువ్వు చేసిన ఫిర్యాదు తప్ప అని తేలితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరించి, 49ఎం.ఎ ననుసరించి      సంతకం    తీసుకొని పోలింగ్ ఏజెంట్లతో బాటుగా  మీరు కంపార్ట్మెంట్లోకి వెళ్లి మరొకసారి ఓటును వినియోగించుకునేలా చూడండి,, అబద్ధమని తేలితే ఓటర్ ను పోలీసులకు అప్పగించండి వివరాలు 17 సి,17 ఏ లో రాయండి. 17 ఏ సీరియల్ నంబర్ ను మార్చకండి, టోటల్లో ఒక ఓటు పెరుగుతుంది,,

8, నిజమని తేలితే మరోసారి పరిశీలించి పోలింగ్ ను ఆపేయండి తర్వాత
పై అధికారులకు సమాచారం అందించండి.

9. ఓటింగ్ జరుగుతున్నంతసేపు ప్రతి గంటకు ఓటింగ్ శాతాన్ని మెయిల్ ఫిమేల్ వారిగా ఏపీవో దగ్గర నుండి తీసుకొని పై అధికారులకు తెలుపుటకు సిద్ధంగా ఉండండి

10.మధ్య మధ్యలో total బటన్ నొక్కి 17 ఏ రిజిస్టర్ సీరియల్ నెంబర్ ను మరియు control unit ప్రకారం ఓట్ల మొత్తాన్ని సరిచూసుకోండి,

11. విరామం దొరికినప్పుడల్లా కవర్లపై, ఫారాలపై సంతకాల చేయడం, డైరీ నింపడంవంటి పనులను చేస్తూ ఉండండి.

12, పోలింగ్ ఏజెంట్ లను చివరి గంటలో బయటికి వెళ్లకుండా చూడండి.

13. ఐదు గంటలకు ఎంతమంది అయితే వరుసలో నిలబడ్డారో వారికిసంతకంఛేేసిన  స్లిప్పులు ఇవ్వండి తర్వాత వచ్చిన ఓటర్లను అనుమతించకండి

14. చివరి ఓటర్ ఓటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత వి వి పాట్ nob ఆఫ్ చేసి control యూనిట్ క్లోజ్ బటన్ నొక్కండి.


ఓటింగ్ ముగిసిన తరువాత.
......................

1,

or-latin;">మొత్తం పోలైన ఓట్లు డిస్ప్లే లో ఏజెంట్లకు చూపించండి. 17 ఏ రిజిస్టర్ కూడా చూపించండి. డిక్లరేషన్ పై ఓటింగ్ ప్రక్రియ ముగిసినట్లుగా ఏజెంట్ల చె సంతకం చేయించండి,తరువాత 17 సి లలో అన్ని వివరాలు నింపి ప్రతి ఏజెంటు కు ఒకటి ఇవ్వండి, మీ దగ్గర మూడు కాపీలు ఉండేటట్టుగా చూసుకోండి.

2, పోలింగ్ ఏజెంట్లు సమక్షంలోనే బ్ Control unit, బ్యాలెట్ unit, vvpat లను బాక్సులలో పెట్టి అడ్రస్ టాగ్ కట్టి
లక్క సీల్ వేయండి.

3 అన్ని ఫారాలను పూర్తి ఛేపీ కవర్ల లో పెట్టండి. మార్కుడ్ కాఫీ ఆఫ్ electoral roll , 17, 17 సీ, డైరీ, sixteen పాయింట్స్ ఫామ్,visitsheet ,. తప్ప మిగతావి సీల్ చేయండి.

4 నియమం ప్రకారం వాటిని స్టాట్యుటరీ, అను స్టాట్యూటరీ, మరియు ఆదర్ అను మూడు గ్రూపులుగా విభజించి ఆయా పెద్ద కవర్లలో పెట్టండి


5 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వరకు అందరు పోలింగ్ ఆఫీసర్లు రావాల్సిందేనని ఖచ్చితంగా చెప్పండి, వారి సహకారంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ అప్పగించడి.

0 comments:

Post a Comment