WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

DSC 2024-25: కొత్తగా చేరబోవు ఉపాధ్యాయుల సంపూర్ణ మార్గదర్శిని & JOINING REPORTS

 

DSC 2024-25: కొత్తగా చేరబోవు ఉపాధ్యాయుల సంపూర్ణ మార్గదర్శిని

ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మీ ప్రయాణాన్ని సుఖకరంగా మరియు సులభంగా చేయడానికి సమగ్ర సమాచారం

ఉపాధ్యాయ మిత్రులారా!

కొత్తగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరిన ప్రతి ఒక్కరికి ఈ మార్గదర్శిని ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు అవసరమైన అన్ని వివరాలు సరళమైన తెలుగులో అందించబడ్డాయి.

ప్రారంభ దశలు: పాఠశాలలో చేరడం
  • Required Documents for Joiningస్: 3 కాపీలు తయారు చేయండి (ఒకటి పాఠశాలకు, ఒకటి ఎంఈఓ ఆఫీస్ కు, ఒకటి వ్యక్తిగత ఫైల్ కు)
  • చేరిక లేఖ: పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి ఒక సాధారణ లేఖ రాయండి
  • SSC తో సహా Educational qualification Certificate copies
  • Physical Fitness Certificate by a Government Medical Officer
  • Passport size photo
  • Aadhar card
  • పాఠశాలలో చేరడానికి ఇవి సరిపోతాయి
టిప్:

తదుపరి కావలసినవి జాయిన్ అయిన తర్వాత ఏర్పాటు చేసుకోవచ్చు.

అవసరమైన పత్రాలు
  • ట్రెజరీ ఐడి కోసం: జాతీయ బ్యాంక్ ఖాతా ఫస్ట్ పేజీ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, పాన్ కార్డు జిరాక్స్ (ఉంటే)
  • ట్రెజరీ ఐడి: జీతం పొందడానికి తప్పనిసరి. దరఖాస్తు చేసుకుంటే ఐడి నెంబర్ వస్తుంది
  • సర్వీస్ రిజిస్టర్ కోసం: ఇటీవలి పాస్పోర్ట్ సైజు ఫోటోలు, సర్వీస్ రిజిస్టర్ పుస్తకం, అసలు సర్టిఫికెట్లు
గమనిక:

ఆన్లైన్ ఎస్ ఆర్ రన్ చేస్తారా లేదా మాన్యువల్గా ఎస్సార్ రన్ చేస్తారా అనేది ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉన్నది.

జీతం తగ్గింపులు మరియు ఇన్సూరెన్స్ పథకాలు
  • APEGIS (ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్):
    • ఎస్ జి టి లకు నెలకు రూ. 30
    • స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ. 60
    • నవంబర్ నుండి మాత్రమే చెల్లించాలి
  • PRAN (CPS కోసం):
    • ప్రతినెల మూలవేతనము మరియు డిఏ కలిపిన మొత్తంలో 10% చెల్లించాలి
    • వీలైనంత త్వరగా సిపిఎస్ దరఖాస్తు చేసుకోండి
  • APEHS (ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఆరోగ్య పథకం):
    • ఉద్యోగి మరియు ఆధారిత కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్యం
    • నెలకు రూ. 225 చెల్లించాలి
    • ఎపిఇఎచ్ఎస్ సైట్లో దరఖాస్తు చేసుకోండి
  • ప్రొఫెషనల్ టాక్స్ (వృత్తి పన్ను): నెలకు రూ. 200 చెల్లించాలి
  • APGLI (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీమా పథకం):
    • మూలవేతనం ఆధారంగా నెలవారీ కట్టవలసిన డబ్బులు నిర్ణయించబడతాయి
    • మొదటి నెల జీతం లోనే డిడక్షన్ చేయవలసి ఉంటుంది
    • బాండు జనరేట్ అయితేనే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది
సెలవు విధానాలు
  • సాధారణ సెలవులు (క్యాజువల్ లీవ్స్):
    • క్యాలెండర్ సంవత్సరానికి 15 రోజులు
    • మధ్యలో చేరితే ప్రొపోర్షనేటుగా ఇస్తారు
    • అక్టోబర్ లో చేరితే 4 రోజులు మాత్రమే
  • స్పెషల్ క్యాజువల్ లీవులు (SCL):
    • క్యాలెండర్ సంవత్సరానికి 7 రోజులు
    • అక్టోబర్ లో చేరితే 2 రోజులు మాత్రమే
  • మహిళలకు ప్రత్యేక సెలవులు:
    • క్యాలెండర్ సంవత్సరానికి 5 రోజులు అదనంగా
    • అక్టోబర్ లో చేరితే 1 లేదా 2 రోజులు మాత్రమే
  • అర్థ జీతపు సెలవులు:
    • ఒక సంవత్సరం సేవ తర్వాత సంవత్సరానికి 20 రోజులు జమ చేయబడతాయి
    • అర్థ జీతంతో 20 రోజులు లేదా పూర్తి జీతంతో 10 రోజులు వాడుకోవచ్చు
    • వాడుకోకుంటే ప్రతి సంవత్సరం బ్రాడ్ ఫార్వర్డ్ చేయబడతాయి
  • సంపాదిత సెలవులు (ఎర్న్డ్ లీవ్):
    • సంవత్సరానికి 6 రోజులు జమ చేయబడతాయి
    • జనవరి 1వ తేదీ 3 రోజులు, జూలై 1వ తేదీ 3 రోజులు జమ చేయబడతాయి
    • ఆర్థిక సంవత్సరంలో 15/30 రోజులు నిల్వను పట్టి నగదుగా మార్చుకోవచ్చు
    • నగదుగా తీసుకుంటే ఖాతాలో గరిష్టంగా 300 రోజులు మాత్రమే ఉంటాయి
ముఖ్యమైన చిట్కాలు:
  • ట్రెజరీ ఐడి మరియు PRANకి ప్రాధాన్యత ఇవ్వండి - ఇవి జీతం మరియు పెన్షన్ కోసం అత్యంత ముఖ్యమైనవి
  • అన్ని పత్రాల డిజిటల్ మరియు ఫిజికల్ కాపీలు సురక్షితంగా ఉంచండి
  • ఏవైనా సందేహాలు ఉంటే ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ లేదా సహోద్యోగులను సంప్రదించండి
  • APEHS మరియు APGLIలో నమోదు చేసుకోండి - ఇవి ఆరోగ్యం మరియు భవిష్యత్తు రక్షణ కోసం
  • APGLI విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు - బాండు జనరేట్ అయితేనే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది
JOINING REPORTS