KNOW YOUR PAN STATUS ACTIVE OR NOT
2017లో దాదాపు 10లక్షలకు పైగా పాన్ కార్డుల్లో కొన్నింటిని తాత్కాలికంగా నిలిపి వేయడం.. రద్దు చేయడం లాంటివి జరిగాయి. మరి, మీ పాన్ ఆ జాబితాలో లేకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి.
నకిలీ పాన్కార్డులను ఏరివేయడానికి.. వాటిని ఆధార్తో జత చేయాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ సూచించింది. ఇప్పటికీ ఇంకా ఈ అనుసంధానం పూర్తి చేయని వారికి మార్చి 31,
2018 వరకూ గడువు ఉంది. అయితే, డూప్లికేట్ పాన్లను గుర్తించే ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్లే నిర్వహిస్తాయి కాబట్టి, కొన్నిసార్లు చిన్న పొరపాటుతో పాన్ రద్దు అయ్యే అవకాశం ఉంది.
Know Your PAN అనే బటన్ను క్లిక్ చేయండి. అక్కడ అవసరమైన వివరాలను ఇవ్వడంతోపాటు, మీ మొబైల్ నెంబరును పేర్కొంటే.. ఓటీపీ వస్తుంది. దాన్ని పేర్కొన్న తర్వాత.. మీరు తెలిపిన అన్ని వివరాలూ సరిగ్గా ఉంటే. మీ పాన్ ‘ఆక్టివ్’గా ఉందా లేదా? అనే సమాచారం వస్తుంది. ఆక్టివ్గా ఉంటే ఇబ్బందేమీ లేదు. ఒకవేళ బ్లాక్ అయినా లేదా డీఆక్టివేట్ అయ్యిందని సమాచారం వస్తే ఏం చేయాలి?
* మీ పరిధిలోని ఆదాయపు పన్ను శాఖ అసెసింగ్ ఆఫీసర్ (ఏఓ)కు మీ పాన్ ఆక్టివేట్ చేయాల్సిందిగా లేఖ రాయాలి. దీనికి ఆదాయపు పన్ను శాఖను ఉద్దేశించి ఇండెమ్నిటీ బాండ్ను సిద్ధం చేయాలి. మీ దగ్గర ఉన్న పాన్ కార్డు నకలును, గత మూడేళ్లుగా సమర్పించిన ఆదాయపు పన్ను రిటర్నుల నకళ్లనూ దీనికి జత చేయాలి.
అన్నీ సవ్యంగానే ఉన్నాయని ఆదాయపు పన్ను శాఖ ధ్రువీకరించుకుంటే.. 10-15 రోజుల్లో మీ పాన్ తిరిగి చెల్లుబాటులోకి వస్తుంది.
0 comments:
Post a Comment