Wednesday, December 6, 2017

AP DSC NOTIFICATION 2018 TENTATIVE SCHEDULE AND RELEASED VIDEO

AP DSC 2018 NOTIFICATION

AP DSC NOTIFICATION TO BE RELEASED ON 15th DECEMBER 2017 FOR 12203 TEACHER POSTS
  • Total DSC posts: 12,370
  • AP DSC 2018 Notification along with Syllabus 15th Dec 2017
  • Download of Hall Tickets 9th Mar Onwards
  • Conduct of Written TET cum TRT Exam 23rd Mar to 26th Mar
  • Initial Key: 9th April 2018
  • Objections on Key 10th April to 16th April
  • Final Key 30th April
  • Release of Merit List 5th May 2018
  • Provisional Selection List 11th May 2018
  • Verificatin of Certificates 14th May to 19th May
  • Final Selection List 1st June to 6th June
  • Posting Orders 8th June to 11th June 2018






అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో భారీగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ప్రకటించింది. మేరకు సచివాలయంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో మొత్తం 12,370 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. 2018 జూన్12 నాటికి ఉపాధ్యాయులకు పోస్టింగ్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఇందుకోసం డిసెంబర్26 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు.
గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగానే నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. మార్చి 23,24,26 తేదీల్లో జరిగే పరీక్షలకు అభ్యర్థులు సిద్ధం కావాలని ఆయన సూచించారు. హాల్టిక్కెట్లును వచ్చే ఏడాది మార్చి 9 వరకు డౌన్లోడ్చేసుకోవచ్చన్నారు. స్కూల్అసిస్టెంట్, ఎస్జీటీ, లాంగ్వేజ్పండింట్ఉద్యోగాలు 10,313తో పాటు తొలి దశలో మోడల్పాఠశాలల్లో 1197 ఉద్యోగాలు, ప్రత్యేక అవసరాలు కల్గిన విద్యార్థుల కోసం మరో 860 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

ముఖ్యమైన తేదీలివే..
* డీఎస్సీ నోటిఫికేషన్‌ - డిసెంబర్15
* దరఖాస్తుల స్వీకరణ: డిసెంబర్26 నుంచి ఫిబ్రవరి 2 వరకు (ఆన్లైన్లో)
* హాల్టికెట్ల డౌన్లోడ్కు చివరి తేదీ: మార్చి 9
* రాత పరీక్షలు : మార్చి 23,24,26
* రాత పరీక్ష కీ విడుదల : ఏప్రిల్9
* కీపై అభ్యంతరాల స్వీకరణ: ఏప్రిల్10 నుంచి 16 వరకు
* తుది కీ విడుదల తేదీ: ఏప్రిల్30
* మెరిట్లిస్ట్ప్రకటన : మే 5
* ప్రొవిజనల్సెలక్షన్విడుదల చేసి అభ్యర్థులకు సమాచారం: మే 11
* ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన: మే 14 నుంచి 19 వరకు 


DOWNLOAD TENTATIVE SCHEDULE CLICK HERE

0 comments:

Post a Comment