Friday, November 10, 2017

SSC/10th CLASS EXAMINATION2017-18 TIME TABLE,RESULTS SHEDULE



అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2018 మార్చి 15నుంచి 29వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అకడమిక్‌, ఓఎస్ఎస్ సీ, ఒకేషనల్‌ కోర్సులన్నింటికీ ఈ షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు జరుగుతాయి.

రెగ్యులర్‌, ప్రైవేట్‌ అభ్యర్థులకు ఇదే టైంటేబుల్‌ వర్తిస్తుంది. గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షలకు 2,850 కేంద్రాల్లో 6,36,831మంది విద్యార్థులు హాజరుకానున్నారని, వీరిలో 3,08,834మంది బాలురు కాగా 3,27,997 మంది బాలికలు ఉన్నారని వివరించారు. జవాబుపత్రాల స్పాట్‌ వాల్యుయేషన్‌ మార్చి 31నుంచి ఏప్రిల్‌15 వరకు జరుగుతుందని, మే మొదటి వారంలో ఫలితాలను విడుదల చేస్తామని, సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.


SSS

0 comments:

Post a Comment