Sunday, October 15, 2017

SWACHH VIDYALAYA PURASKAR 2017-18 APP,USER MANNUAL AND STEPS TO ACCESS INFORMATION

స్వచ్ఛ విద్యాలయం

దరఖాస్తులు ఆహ్వానిస్తున్న కేంద్ర మానవవనరుల శాఖ
ఆక్టోబర్‌ 31 చివరితేది
దేశాన్ని స్వచ్ఛ భారత్‌గా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతోంది. పరిశుభ్రత పాటించే పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయఅవార్డుతో సత్కరించి నగదు ప్రోత్సాహకాలు అందజేస్తోంది. ఈ ఏడాది ప్రతి పాఠశాల ఈ అవార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ వీలుకల్పించింది.

గత ఏడాది స్వచ్ఛ విద్యాలయ పురస్కార అవార్డుకు కేవలం ప్రభుత్వ పాఠశాలల నుంచే దరఖాస్తులను స్వీకరించారు. ఈ సంవత్సరం సర్కారు పాఠశాలలతో పాటు ప్రైవేటు బడులు సైతం అర్జీ చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. దీంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు అవార్డులను కైవసం చేసుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలతో పోటీపడుతున్నాయి.


దరఖాస్తు చేయడమిలా...

పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఎంహెచ్‌ఆర్డీ స్వచ్ఛవిద్యాలయ పురస్కార్‌ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దీనిలో ముందుగా పాఠశాల యుడైస్‌ కోడ్‌తో రిజిస్ట్రేషన్‌ ప్రారంభించాలి. అనంతరం బడి చిరునామా, ప్రధానోపాధ్యాయుడి పేర్లతో పాటు పాఠశాలకు సంబంధించి అడిగిన వివరాలు నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన అనంతరం రిజిస్టర్‌ మొబైల్‌ నంబరుకు ఓటీపీ(ఒన్‌ టైం పాస్‌వర్డ్‌) వస్తుంది. ఇదే పాఠశాల పాస్‌వర్డ్‌ అవుతుంది. ఆ తర్వాత లాగిన్‌ అని ఉన్నచోట క్లిక్‌ చేయగానే యూజర్‌ పేరు, పాస్‌వర్డ్‌ అడుగుతుంది. యూజర్‌ పేరు వద్ద పాఠశాల యూ డైస్‌ కోడ్‌, పాస్‌వర్డ్‌ కింద ఓటీపీని నమోదు చేయాలి. లాగిన్‌ అయిన తర్వాత 39 ప్రశ్నలు కనిపిస్తాయి. వీటన్నింటికీ సమాధానాలతో పాటు సంబంధిత ఫొటోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

ఎంపిక ఇలా...

అన్ని పాఠశాలలను గ్రామీణ, పట్టణ కేటగిరీలుగా విభజించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మూడు, పట్టణ పరిధిలో మరో మూడు పాఠశాలలను జిల్లా స్థాయి అవార్డులకు ఎంపిక చేస్తారు. ఇక్కడ ఎంపికైన తరువాత జిల్లా స్థాయి కమిటీ సభ్యులైన జిల్లా విద్యాశాఖాధికారి, సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు అధికారి, అర్‌డబ్ల్యూఎస్‌ అధికారి తదితరులు క్షేత్రస్థాయిలో ఆయా పాఠశాలలకు వెళ్లి పరిశీలిస్తారు. దరఖాస్తులో పొందుపరిచిన అన్ని అంశాలూ ఉన్నాయో, లేదో ధ్రువీకరించుకున్న తరువాత రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు.

పురస్కారానికి ఎంపికైతే రూ.50వేలు

కేంద్రమానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రకటించిన స్వచ్ఛవిద్యాలయ పురస్కారానికి ఎంపికైన పాఠశాలకు ప్రోత్సాహకం కింద రూ.50వేలను అందజేస్తారు. వీటిని పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలకు ఖర్చుచేసుకునేందుకు సర్కారు వీలు కల్పించింది. ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

పోటీతత్వం పెరుగుతుంది


కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్వచ్ఛవిద్యాలయ పురస్కార్‌ ద్వారా పాఠశాలల పరిశుభ్రత విషయంలో పోటీతత్వం పెరుగుతోంది. సర్కారు ఇలా ప్రోత్సాహకాలు అందిస్తూ అవార్డులు ఇవ్వడం శుభపరిణామం. స్వచ్ఛ విద్యాలయాల కల సాకారం కావాలంటే ప్రభుత్వ సహకారంతో పాటు దాతల చేయూత అవసరం. పరిశుభ్రతపై పాఠశాలల్లో విద్యార్థి దశనుంచే అవగాహన కల్పించాలి.
How to Apply ?

All schools are invited to apply for the awards.Registration opens from 1st September 2017 and closes on 31st October 2017.
The registration of schools would be done with the U-DISE code of the school. If you do not have a UDISE-Code, download the Data Capture Format (DCF) and submit at Block / District / State level office to generate the U-DISE Code.
Schools will first complete the Primary Information section in the prescribed format. Upon submission, a "Password" will be send to the mobile number given by the school in the primary information section. Schools will then login with the U-DISE code and Password to complete the rest of the six sections of the survey.

Steps to Access Information of Swachh Vidyalaya Puraskar 2017-18

Option  A : Download Mobile App (playstore/ istore) OR Give a Missed Call to   07097298093 to get App Links on your mobile
Option  B : Fill Online Survey
Option  C : Download Survey Format ,fill it and seek assistance to complete survey using option A or option B
Please read Instructions(USER MANNUAL ) for filling the survey


SWACHH VIDYALAYA PURASKAR 2017-18 MOBILLE APP DOWNLOAD


0 comments:

Post a Comment