Saturday, August 26, 2017

MDM - CERTAIN COMPLAINTS OF SUPPLY OF EGGS -INSTRUCTIONS

 MDM - CERTAIN COMPLAINTS OF SUPPLY OF EGGS -INSTRUCTIONS

ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం కింద పాఠశాలలకు ఏజెన్సీల ద్వారా సరఫరా చేస్తున్న కోడిగుడ్లు తక్కువ బరువున్నా, పాడైపోయినా వెంటనే తిరస్కరించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ కె.సంధ్యారాణి ఉత్తర్వులు జారీ చేశారు.


గుత్తేదారు పాఠశాలలకు సరఫరా చేసే కోడిగుడ్లు దిగుమతి చేసుకునేటపుడు ప్రధానోపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిబంధనలు ఖాతరు చేయకుండా గుత్తేదారు కోడిగుడ్లు సరఫరా చేస్తే పాఠశాలలో దిగుమతి చేసుకోవద్దని ఆమె ఆదేశాల్లో స్పష్టం చేశారు. కోడిగుడ్లు నిబంధనలను ఎంఈవోలకు శనివారం పంపిన ఆదేశాల్లో కమిషనర్‌ వెల్లడించారు. పథకం అమల్లో పంపిణీ చేస్తున్న గుడ్లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కమిషనర్‌ తాజాగా అమలు చేస్తున్న మార్గదర్శకాలను ఎంఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు పంపించారు.

 మార్గదర్శకాలు : 


  •  పాఠశాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు విద్యార్థుల సంఖ్య మేరకు వారానికి సరిపడా మాత్రమే దిగుమతి చేసుకోవాలి. • గుడ్డు బరువు 48-52 గ్రాముల మధ్య ఉండాలి. 
  • దిగుమతి చేసుకున్న గుడ్లను తలుపులు మూసే బీరువాలు, పెట్టెల్లో ఉంచకుండా వంట గదిలో బయటే ఉండేలా దాచుకోవాలి. • కుళ్లిపోయిన కోడిగుడ్లు దిగుమతి చేసుకోకూడదు. 
  •  ఉడకబెట్టిన తర్వాత అవి నాణ్యత లేవని తేలితే వాటిని విద్యార్థులకు ఆహారంగా అందించకూడదు.
  •  ఇలా బరువు తక్కువగా ఉన్న, పాడైపోయిన కోడిగుడ్లు గుత్తేదారునికి వాపసు ఇచ్చి వాటి స్థానంలో తిరిగి నాణ్యమైనవి తీసుకోవాలి. • పాడైనపోయిన గుడ్లను బడిలో పారేయకూడదు.
  •  పాడైన, బరువు తక్కువ ఉన్న కోడిగుడ్లను తిరిగి తీసుకునేందుకు సరఫరాదారు తిరస్కరిస్తే సదరు ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో లేదా డీఈవోకు ఫిర్యాదు చేయాలి.
  •  ప్రధానోపాధ్యాయుడు భోజన పథకం గుడ్ల వివరాలను సంబంధిత పత్రంలో ఎప్పటికపుడు నమోదు చేయాలి. 
  •  ప్రతి విద్యార్థికి కోడిగుడ్డు సరఫరా చేసేందుకు రోజుకు ఒక్కో గుడ్డుకు ప్రభుత్వం రూ.2.35 పైసలు వ్యయం చేస్తోంది.

0 comments:

Post a Comment