Saturday, August 19, 2017

KURNOOL DIST –LPG SUBSIDY UNDER MDM THROUGH U –DISE NO WITH BANK A/C NO – IMPLEMENTATION OF NON –DOMESTIC EXEMPT CATEGOR SCHEME –REQ-REG

KURNOOL DIST –LPG SUBSIDY UNDER MDM THROUGH  U –DISE NO WITH BANK A/C NO – IMPLEMENTATION OF NON –DOMESTIC EXEMPT CATEGOR SCHEME –REQ-REG



భోజన ఏజెన్సీలకు తీపి కబురు  కట్టెల పొయ్యి కష్టాలకు చెల్లు  గ్యాస్తో వంట :


 భోజన ఏజెన్సీలకు ప్రభుత్వం తీపి కబురు పంపింది. ఇన్నాళ్లు తరగతి గదులకు సమీపంలో వంట చేయడం వల్ల పిల్లలు పొగతో ఉక్కిరి బిక్కిరి అయ్యేవారు. దీంతో చదువులపై ఏకాగ్రత నిలపలేని పరిస్థితి. నిర్వాహకులకూ వంట చెరుకు భారంగా ఉండేది. వర్షాకాలంలో వంట చెరుకు తడిస్తే నిప్పు రాజేయడానికి గొట్టంతో వూదివూది సొమ్మసిల్లే పరిస్థితి. వీటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పాఠశాలల్లో పొగలేని వాతావరణం కల్పించే లక్ష్యంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు వంట గ్యాస్సమకూర్చే చర్యలు చేపట్టింది. బాధ్యతలను గ్యాస్డీలర్లకు అప్పగించింది. ఈమేరకు మండల విద్యాధికారులకు మార్గదర్శకాలు అందాయి.

ఈనెల 20లోగా పాఠశాలకు దగ్గరలో ఉన్న గ్యాస్ఏజెన్సీని సంప్రదించి గ్యాస్కనెక్షన్పొందాలని సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇక మీదట మధ్యాహ్న గ్యాస్తో వంట చేయనున్నారు. దీంతో ఏజెన్సీలకు పొగ, కట్టెలపొయ్యి కష్టాలు, పిల్లలకు పొగ బాధలు తప్పనున్నాయి.

సిలిండర్లు ఇలా ఇస్తారు :

 ఆయా మండలాల్లో ఎంఈవోలు భోజన ఏజెన్సీలతో వెళ్లి దగ్గరలోని గ్యాస్ఏజెన్సీని సంప్రదించాలి. అక్కడ యూడైస్ఆధారంగా కోడ్, ఏజెన్సీ బ్యాంకు ఖాతా, గ్యాస్వినియోగదారు పత్రం భర్తీచేస్తే గ్యాస్సిలిండరు ఇస్తారు
ధర ఎంతంటే:

🌻మధ్యాహ్న భోజన ఏజెన్సీకి ఇచ్చే సిలిండరు ధరను ప్రభుత్వం ఖరారు చేసింది. ధరావతు రూ.1600, నిండు సిలిండరు రూ.587 (ఆయా ప్రాంతాలను బట్టి ధర మారుతుంది), సురిక్షిత పైపు రూ.150 పుస్తకం రూ.50 మొత్తం రూ.2387గా నిర్ణయించారు. నిధులు పాఠళాల గ్రాంటు నుంచి తీసుకుని కొనుగోలు చేయాల్సి ఉంది. మధ్యాహ్న భోజన పథకం కింద గ్యాస్తీసుకోవడానికి ఆధార్కార్డు అవసరం లేదు. ఏజెన్సీలు సహకరించక పోతే ఫిర్యాదు చేయాలని సూచించింది. గ్యాస్పుస్తకం పాఠశాల హెచ్ఎం, పాఠశాల పేరుమీద తీసుకోవాలి. గ్యాస్కనెక్షన్తీసుకున్న వెంటనే డీఈవో కార్యాలయం  సమాచారం ఇవ్వాలి.
KURNOOL DIST –LPG SUBSIDY UNDER MDM THROUGH  U –DISE NUMBE APPLICATION DOWNLOAD CLICK HERE


💧సందిగ్ధంలో ఏజెన్సీలు

🌻వంటగ్యాస్కొనుగోలుకు ఏజెన్సీలు తటపటాయిస్తున్నాయి. గ్యాస్మీద వండడం రాదని, ప్రమాదాలు జరుగుతాయని భయపడుతున్నారు. ఇంతకీ ఎన్ని సిలిండర్లు ఇస్తారో చెప్పలేదని, ఒకేసారి ఎన్ని సిలిండర్లు బుక్చేసుకోవాలి. రాయితీ ఎవరి ఖాతాలోకి వేస్తారు. ధరావతు ఎవరు కడతారు, స్టవ్ఎవరిస్తారో చెప్పలేదు. సిలిండరు అయిపోతే ఎవరిని సంప్రదించాలి వంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నిర్వాహకులకు ప్రయోజనం

ప్రస్తుతం వంట చెరకు ధర టన్ను సుమారు రూ. 5వేలు ఉంది. 300-500మంది పిల్లలు ఉన్న బడుల్లో ఏజెన్సీలకు నెలకు వంట చెరకు టన్నుకు అవసరం అవుతుంది. వర్షాకాలంలో తడిసి ఇబ్బంది పడేవారు. దీని వల్ల పాత్రలు ఏడాదికే పాడుకావడం, వాటి శుభ్రత కష్టంగా ఉండేది. అదే వంట గ్యాస్పై వంట చేస్తే ఇబ్బందులు పూర్తీగా తొలిగిపోతాయి. సకాలంలో వంట చేసి వడ్డించవచ్చు.




0 comments:

Post a Comment