WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

UGC NET December 2026 నోటిఫికేషన్: దరఖాస్తు చివరి తేదీ 28.10.2026 – అర్హతలు, పరీక్ష విధానం, ముఖ్య తేదీలు

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, Ph.D. ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే UGC NET December 2026 పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. పీజీ పూర్తి చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు 28 అక్టోబర్ 2026 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభం08.10.2026
దరఖాస్తుకు చివరి తేదీ28.10.2026
ఫీజు చెల్లింపు28.10.2026 వరకు (ఆలస్య రుసుముతో 31.10.2026 వరకు అని సమాచారం)
దరఖాస్తు సవరణలు02.11.2026 – 04.11.2026
పరీక్ష తేదీలుడిసెంబర్ 14 నుంచి (సబ్జెక్టుల వారీ షెడ్యూల్ NTA ప్రకటిస్తుంది)

అర్హతలు

  • విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ. జనరల్ / EWS కు కనీసం 55% మార్కులు. OBC-NCL, SC, ST, PwD, థర్డ్ జెండర్ వారికి 50%.
  • పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా దరఖాస్తు చేయవచ్చు.
  • JRF వయోపరిమితి: గరిష్ఠం 30 ఏళ్ళు (రిజర్వ్డ్ వర్గాలకు సడలింపు ఉంటుంది).
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ / Ph.D. అర్హతకు వయోపరిమితి లేదు.

సరిగ్గా అర్హత నిర్ణయించుకోవడానికి EWS / OBC-NCL సర్టిఫికెట్లు కేంద్ర ఫార్మాట్‌లో ఉండాలి. దీని గురించి మా "BC/OBC NCL & EWS సర్టిఫికెట్లు" పోస్ట్ చూడండి: ఇక్కడ క్లిక్ చేయండి.

పరీక్ష విధానం

పేపర్ప్రశ్నలుమార్కులు
Paper I (టీచింగ్ & రీసెర్చ్ ఆప్టిట్యూడ్)50100
Paper II (సంబంధిత సబ్జెక్ట్)100200
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), మొత్తం 3 గంటలు, నెగటివ్ మార్కింగ్ లేదు.

ఎలా దరఖాస్తు చేయాలి?

  1. ugcnet.nta.nic.in వెబ్‌సైట్ తెరవండి.
  2. Information Bulletin చదివి, కొత్త రిజిస్ట్రేషన్ చేయండి.
  3. దరఖాస్తు ఫారం నింపి, ఫోటో, సంతకం, కేటగిరీ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయండి.
  4. ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి, కన్ఫర్మేషన్ పేజీ ప్రింట్ తీసుకోండి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్ర: UGC NET December 2026 దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు?
జ: 28 అక్టోబర్ 2026.

ప్ర: నెగటివ్ మార్కులు ఉన్నాయా?
జ: లేవు.

ప్ర: ప్రభుత్వ ఉపాధ్యాయులు రాయవచ్చా?
జ: అర్హత ఉంటే రాయవచ్చు. శాఖ నిబంధనల ప్రకారం అనుమతి / సమాచారం ఇవ్వాల్సి ఉంటే పాటించండి.

గమనిక: ఫీజు, పరీక్ష సబ్జెక్టుల వారీ తేదీలు, ఇతర వివరాలకు NTA అధికారిక Information Bulletin మాత్రమే చూడండి.

అధికారిక లింకులు: UGC NET – NTA | NTA | UGC