WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

EEMT – 7వ, 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్రస్థాయి ఉచిత ఆన్‌లైన్ మెరిట్ టెస్ట్కు విద్యాశాఖ అనుమతి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 7వ, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ మెరిట్ టెస్ట్ – ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ (EEMT) నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. అలాగే ప్రకాశం / మార్కాపురం జిల్లా పరిధిలో 5వ తరగతి విద్యార్థులకు పైలట్ పరీక్ష నిర్వహణకు కూడా అనుమతి లభించింది.

ముఖ్యాంశాలు

పరీక్ష పేరుస్టేట్ లెవెల్ ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ (EEMT)
అర్హతప్రభుత్వ & ఎయిడెడ్ పాఠశాలల్లో 7వ, 10వ తరగతి విద్యార్థులు; మార్కాపురం జిల్లాలో 5వ తరగతి (పైలట్)
పరీక్ష విధానంఆన్‌లైన్ ప్రొక్టర్డ్ టెస్ట్ – పాఠశాల కంప్యూటర్ లేదా ఇంటి వద్ద మొబైల్/ల్యాప్‌టాప్ ద్వారా
రుసుముఉచితం
ప్రశ్నల రకంఆబ్జెక్టివ్ / MCQ

పరీక్ష దశలు

  1. ప్రాక్టీస్ / మాక్ టెస్టులు
  2. ప్రిలిమినరీ పరీక్ష (Prelims)
  3. మెయిన్స్ పరీక్ష (ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన వారికి)

సిలబస్ వెయిటేజీ

  • సుమారు 80% – అకడమిక్ పాఠ్యాంశాలు (గణితం, సైన్స్, సోషల్)
  • సుమారు 20% – సాధారణ పరిజ్ఞానం (GK, కరెంట్ అఫైర్స్), రీజనింగ్ / IQ

బహుమతులు

  • రాష్ట్ర స్థాయి: మొదటి 3 స్థానాలకు నగదు బహుమతులు, మెడల్స్, సర్టిఫికెట్లు
  • జిల్లా స్థాయి: టాప్ ర్యాంకర్లకు నగదు ప్రోత్సాహకాలు
  • మండల స్థాయి: మెరిట్ విద్యార్థులకు మెడల్స్, ప్రశంసా పత్రాలు

అధికారిక లింక్

గమనిక: రిజిస్ట్రేషన్, పరీక్ష తేదీల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో ప్రకటిస్తారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించగలరు.