సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ Teach Tool తరగతి గది పరిశీలనలు (Classroom Observations) పై తాజా ఉత్తర్వులు జారీ చేశారు. పరిశీలనలు ప్రారంభించని / ఇన్‌యాక్టివ్‌గా ఉన్న Teach Tool అబ్జర్వర్లను యాక్టివేట్ చేయాలని RJDలు, DEOలు, సమగ్ర శిక్ష APCలను ఆదేశించారు.
ఉత్తర్వుల వివరాలు
| Rc. No. | 2981961/SS-15023/23/2025-SAMO-SSA |
| జారీ చేసినవారు | రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్ష, AP |
| విషయం | Teach Tool Classroom Observations – Instructions to activate the inactive observers of Teach Tool |
| రిఫరెన్సులు | Rc. No. SS-15024/21/2026-SAMO-SSA, తేదీ 23.06.2026; Leadership for Equity మెయిల్ తేదీ 14.10.2026 |
Teach Tool అంటే?
2022 నుంచి పాఠశాల విద్యాశాఖ Teach Tool ఫ్రేమ్‌వర్క్ ద్వారా తరగతి గది పరిశీలనలు నిర్వహిస్తోంది. ఇది మూడు ముఖ్య అంశాలపై బోధనను పరిశీలిస్తుంది:
- Classroom Culture (తరగతి గది వాతావరణం)
- Instruction (బోధన)
- Socio-Emotional Skills (సామాజిక-భావోద్వేగ నైపుణ్యాలు)
సర్టిఫైడ్ Teach Tool అబ్జర్వర్లు LEAP యాప్ ద్వారా పరిశీలనలు నమోదు చేస్తారు. ఉపాధ్యాయులకు ఫీడ్‌బ్యాక్, మెరుగుదల సహాయం అందించడమే లక్ష్యం.
2026-27 పరిశీలన సైకిళ్లు
2026-27 విద్యా సంవత్సరంలో పరిశీలనలు 27.06.2026 న ప్రారంభమయ్యాయి. మొత్తం 5 సైకిళ్లు:
| సైకిల్ | కాలం |
|---|---|
| సైకిల్ 1 | జూన్ – జూలై 2026 |
| సైకిల్ 2 | ఆగస్టు – సెప్టెంబర్ 2026 |
| సైకిల్ 3 (ప్రస్తుతం) | అక్టోబర్ – నవంబర్ 2026 |
| సైకిల్ 4 | డిసెంబర్ 2026 – జనవరి 2027 |
| సైకిల్ 5 | ఫిబ్రవరి – మార్చి 2027 |
ఇన్‌యాక్టివ్ అబ్జర్వర్లు – తాజా గణాంకాలు (14.10.2026 నాటికి)
| అంశం | సంఖ్య |
|---|---|
| రాష్ట్రంలో మొత్తం సర్టిఫైడ్ Teach Tool అబ్జర్వర్లు | 14,023 |
| చురుగ్గా పరిశీలనలు చేస్తున్నవారు | 11,016 |
| ఇన్‌యాక్టివ్‌గా ఉన్నవారు | 3,010 |
ఇన్‌యాక్టివ్ శాతం ఎక్కువగా ఉన్న జిల్లాలు: వైఎస్ఆర్ కడప (50%), అల్లూరి సీతారామరాజు (49%), మన్యం (43%). కర్నూలు జిల్లాలో 604 మంది అబ్జర్వర్లలో 503 మంది యాక్టివ్, 101 మంది (17%) ఇన్‌యాక్టివ్. గుంటూరు (4%), కోనసీమ (8%) అత్యుత్తమంగా ఉన్నాయి.
- ఇన్‌యాక్టివ్ అబ్జర్వర్లు 31.10.2026 లోగా LEAP యాప్ ద్వారా కనీసం రెండు తరగతి గది పరిశీలనలు పూర్తి చేయాలి.
- ఇన్‌యాక్టివ్‌కు కారణాలతో అప్‌డేట్ చేసిన Excel షీట్‌ను DEO / APC లు 05.11.2026 లోగా రాష్ట్ర కార్యాలయానికి పంపాలి.
అబ్జర్వర్లు చేయాల్సినవి
- LEAP యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసి లాగిన్ అవ్వాలి.
- కేటాయించిన పాఠశాలల్లో ప్రస్తుత సైకిల్ పరిశీలనలు గడువులోగా పూర్తి చేయాలి.
- పరిశీలన తర్వాత ఉపాధ్యాయునికి ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి.
అధికారిక లింక్
- పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్: https://cse.ap.gov.in