రాష్ట్రపతి ఉత్తర్వులు – 2025 (AP Public Employment Order, 2025) ప్రకారం పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయ పోస్టులను జిల్లా, జోన్ కేడర్లుగా విభజిస్తూ సాధారణ పరిపాలన (SPF&MC) శాఖ నాలుగు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు G.O.Ms.No.201, MPP/ZPP పాఠశాలలకు G.O.Ms.No.202 (రెండూ 02-10-2026), మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలకు G.O.Ms.No.203, మున్సిపల్ పాఠశాలలకు G.O.Ms.No.204 (రెండూ 04-10-2026). SA, SGT, LP సహా దాదాపు అన్ని బోధనా పోస్టులు జిల్లా కేడర్లోనే ఉంటాయి; Gr-II HM (గెజిటెడ్) పోస్టు మాత్రం జోన్ కేడర్.
| ప్రభుత్వ పాఠశాలలు | G.O.Ms.No.201, 02-10-2026 |
| MPP / ZPP పాఠశాలలు | G.O.Ms.No.202, 02-10-2026 |
| మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు | G.O.Ms.No.203, 04-10-2026 |
| మున్సిపల్ పాఠశాలలు | G.O.Ms.No.204, 04-10-2026 |
| జిల్లా కేడర్ నియామక అధికారి | DEO |
| జోన్ కేడర్ (Gr-II HM) నియామక అధికారి | RJDSE |
| లోకల్ రిజర్వేషన్ | డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో 95% |
| సంతకం | G. సాయి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి |
జిల్లా కేడర్ పోస్టులు (నియామక అధికారి: DEO)
| పోస్టు | 201 ప్రభుత్వ | 202 MPP/ZPP | 203/204 మున్సిపల్ |
|---|---|---|---|
| SA – గణితం, PS, BS, సోషల్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం | ✔ | ✔ | ✔ |
| SA – కన్నడ, ఒరియా, తమిళం | ✔ | ✔ | తమిళం (203) |
| SA – అరబిక్ | — | — | ✔ (204) |
| SA – ఫిజికల్ ఎడ్యుకేషన్ | ✔ | ✔ | ✔ |
| మోడల్ ప్రైమరీ స్కూల్ HM / SA | ✔ | ✔ | ✔ |
| సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) | ✔ | ✔ | ✔ |
| లాంగ్వేజ్ పండిట్ | హిందీ | — | LP Gr-II |
| క్రాఫ్ట్, ఆర్ట్/డ్రాయింగ్, మ్యూజిక్, వీవింగ్, సూయింగ్ టీచర్, వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ | ✔ | ✔ | ✔ |
| SA / SGT (స్పెషల్ ఎడ్యుకేషన్) | ✔ | ✔ | — |
| ల్యాబ్ / లైబ్రరీ అసిస్టెంట్ (హైస్కూల్) | — | — | ✔ |
| ELTC ఇన్‌ఛార్జ్, ASO, APO | ✔ | — | — |
జోన్ కేడర్ పోస్టు (నియామక అధికారి: RJDSE)
- ప్రభుత్వ పాఠశాలల Head Master Gr-II (గెజిటెడ్) – G.O.201
- ZPP పాఠశాలల Head Master Gr-II (గెజిటెడ్) – G.O.202
- మున్సిపల్ కార్పొరేషన్ / మున్సిపల్ పాఠశాలల Head Master Gr-II – G.O.203 / 204
కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు జోన్ VIలో ఉన్నాయి. అంటే మన ప్రాంతంలో Gr-II HM సీనియారిటీ, బదిలీలు ఈ నాలుగు జిల్లాల జోన్ పరిధిలో జరుగుతాయి.
ఉపాధ్యాయులపై ప్రభావం
- జిల్లా లేదా జోన్ – ఏది వర్తిస్తే అదే నియామకం, సీనియారిటీ, పదోన్నతి, బదిలీలకు ప్రత్యేక యూనిట్.
- ప్రభుత్వ, MPP/ZPP, మున్సిపల్ యాజమాన్యాలు వేర్వేరు ఉత్తర్వులు – ఒకే కేడర్‌గా కలపలేదు.
- భవిష్యత్తులో మంజూరయ్యే కొత్త పోస్టులకూ ఇదే విభజన వర్తిస్తుంది.
- ఈ విభజనకు తగ్గట్టు సర్వీస్ రూల్స్ సవరించాలని పాఠశాల విద్యాశాఖను, MA&UD శాఖను ఆదేశించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు
ప్ర: SGT, SA పోస్టులు ఏ కేడర్?
జ: జిల్లా కేడర్. నియామక అధికారి DEO.
ప్ర: Gr-II HM ఏ కేడర్?
జ: జోన్ కేడర్. నియామక అధికారి RJDSE.
ప్ర: MPP, ZPP, ప్రభుత్వ టీచర్ల సీనియారిటీ కలుస్తుందా?
జ: లేదు. యాజమాన్యాల వారీ వేర్వేరు G.O.లు ఇచ్చారు.
ప్ర: DSC లో లోకల్ రిజర్వేషన్ ఎంత?
జ: 95% స్థానిక అభ్యర్థులకు.