TIS (Teachers Information System) లో డేటా ఎంట్రీ సమయంలో ఉపాధ్యాయులకు ఏర్పడుతున్న ప్రధాన సందేహాలు మరియు వాటికి సంబంధించిన స్పష్టమైన సమాధానాలు క్రింద ఇవ్వబడ్డాయి.
1. ప్రజెంట్ క్యాడర్ సీనియార్టీ కౌంటెడ్ ఫ్రం (Present Cadre Seniority From)
ప్రజెంట్ క్యాడర్ సీనియార్టీ కౌంటెడ్ ఫ్రం అనే విషయంలో చాలామంది సందేహాలు తెలియజేస్తున్నారు. దీనికి కారణం ఫస్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ లో ఆ ప్రశ్న కనిపించడం.
సమాధానం:
ఇక్కడ ప్రజెంట్ క్యాడర్ అని స్పష్టంగా పేర్కొనబడింది. కావున ప్రస్తుతం ఉపాధ్యాయుడు
పనిచేస్తున్న పోస్ట్ లోకి ఏ రోజున జాయిన్ అయినారో ఆ రోజును ఎంటర్ చేయవలెను.
అంటే ప్రస్తుత పోస్ట్ లోకి ప్రమోషన్ పొంది జాయిన్ అయిన తేదీని నమోదు చేయాలి.
2. ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల జాయినింగ్ తేదీ తప్పుగా ఉండడం
చాలామంది ఉపాధ్యాయులకు ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాల వివరాలలో, వారు పదోన్నతి లేదా బదలీ పొంది జాయిన్ అయిన తేదీ తప్పుగా నమోదు కావడం జరిగింది.
సమాధానం:
ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ లో ఆ వివరాలను సరిచేస్తే,
అవి ఆటోమేటిక్‌గా ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల వివరాలలో కనిపిస్తాయి.
3. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ – ఇంటర్మీడియట్ ఫస్ట్ లాంగ్వేజ్
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలలో ఇంటర్మీడియట్ నందు ఫస్ట్ లాంగ్వేజ్ ఏది అని చాలామందికి సందేహం ఉంది.
సమాధానం:
ఇంటర్మీడియట్‌లో ఫస్ట్ లాంగ్వేజ్ English కావున,
అక్కడ ఇంగ్లీష్‌ను ఎంటర్ చేయవలెను.
4. TET వివరాల నమోదు సమస్య
TET వివరాల నమోదులో ఇంతకు ముందు ఎంటర్ చేసిన సమాచారం కనిపించవచ్చు.
సమాధానం:
ఇంతకు ముందు ఎంటర్ చేసిన వివరాలను తొలగించి,
మళ్లీ సరైన వివరాలను రీ-ఎంటర్ చేసి సేవ్ చేస్తే,
మొత్తం వివరాల ప్రివ్యూ సరిగ్గా కనిపిస్తుంది.