1
NCTE 1 Year B.Ed Course 2026-27 latest update. నాలుగేళ్ల డిగ్రీ లేదా PG అర్హతతో 1 Year B.Ed. మూడేళ్ల డిగ్రీ మరియు డిస్టెన్స్ విద్యార్థులకు 2 Year B.Ed. పూర్తి వివరాలు తెలుగులో చదవండి.
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTE) దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఒక సంవత్సరం బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) కార్యక్రమాన్ని తిరిగి ప్రవేశపెట్టింది.
ఈ మార్పు 2026-27 విద్యా సంవత్సరం నుండి అమల్లోకి రానుంది. 2014లో ప్రవేశపెట్టిన రెండు సంవత్సరాల B.Ed కోర్సుకు బదులుగా, ఈ కొత్త విధానం జాతీయ విద్యా విధానం (NEP) 2020కి అనుగుణంగా ఉపాధ్యాయ విద్యలో సౌకర్యవంతమైన అభ్యాస మార్గాలను అందించనుంది.
ఒక సంవత్సరం B.Ed – అర్హతా ప్రమాణాలు
- నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసినవారు
- లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) డిగ్రీ పొందినవారు
- వారికి మాత్రమే 1 Year B.Ed కోర్సుకు అర్హత ఉంటుంది
రెండు సంవత్సరాల B.Ed – ఎవరికంటే?
- మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసినవారు
- డిస్టెన్స్ మోడ్‌లో డిగ్రీ చేసినవారు
- వారు తప్పనిసరిగా 2 Year B.Ed చేయాలి
గమనిక: నాలుగేళ్ల డిగ్రీ లేదా PG పూర్తి చేసినవారే 1 Year B.Ed కు అర్హులు. మిగతావారు 2 Year B.Ed చేయవలసి ఉంటుంది.
Disclaimer: పై సమాచారం వివిధ మీడియా నివేదికల ఆధారంగా అందించబడింది. అధికారిక నోటిఫికేషన్ కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను పరిశీలించగలరు.
