WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

AP వాలంటరీ రిటైర్మెంట్ (స్వచ్ఛంద పదవీ విరమణ) – పూర్తి సమాచారం

Voluntary Retirement AP, AP Government Voluntary Retirement, VR Rules AP Employees, Voluntary Retirement Benefits, AP Teacher Voluntary Retirement, VR Pension Rules AP

వాలంటరీ రిటైర్మెంట్ (స్వచ్ఛంద పదవీ విరమణ) – పూర్తి సమాచారం

AP ప్రభుత్వ ఉద్యోగులు & ఉపాధ్యాయుల కోసం వాలంటరీ రిటైర్మెంట్ నిబంధనలు – రూల్స్, అర్హత, పెన్షన్ వివరాలు

Voluntary Retirement (VR) – ముఖ్య నిబంధనలు

✔️ వాలంటరీ రిటైర్మెంట్ కొరకు 20 సంవత్సరాల అర్హత గల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులు 3 నెలల ముందుగా నియామకపు అధికారికి నోటీసు ఇవ్వాలి.
✔️ ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నట్లు ఇద్దరు Civil Surgeons సర్టిఫికెట్ సమర్పించాలి.
✔️ అనారోగ్యం, ఉన్నత విద్యాభ్యాసం కోసం తీసుకున్న LOP తప్ప ఇతర LOP సెలవులు అర్హత గల సర్వీసుగా పరిగణించబడవు.
✔️ అధికారి అనుమతి ఇచ్చిన తరువాత మాత్రమే VR అమల్లోకి వస్తుంది.
✔️ గ్రాట్యూటీ 20 సంవత్సరాల సర్వీసుకే లభిస్తుంది. కుటుంబ పెన్షన్, కమ్యూటేషన్ సౌకర్యాలు వర్తిస్తాయి.
✔️ వాలంటరీ రిటైర్మెంట్ పొందినవారికి కారుణ్య నియామకం వర్తించదు.
✔️ VR కోసం వైద్య పరీక్షలు అవసరం లేదు.
✔️ 20 సంవత్సరాల సర్వీస్ తర్వాత VR తీసుకుంటే గరిష్ఠంగా 5 సంవత్సరాల వెయిటేజీ కలుపుతారు.

📌 Reference : A.P.R.P Rule 1980 Rule 43(5)
📌 G.O.Ms.No.413 F&P Dt:29-11-1977

సందేహాలు – సమాధానాలు (FAQ)

1) VR ఎన్ని నెలల ముందు దరఖాస్తు చేయాలి?
➡️ 3 నెలల ముందు నియామకపు అధికారికి నోటీసు ఇవ్వాలి. టీచర్లు MEO / HM ద్వారా DEO కు దరఖాస్తు చేయాలి.

2) VR ఏ కారణాలపై తీసుకోవచ్చు?
➡️ వ్యక్తిగత, అనారోగ్యం తదితర కారణాలపై తీసుకోవచ్చు.

3) 20 ఏళ్లు పూర్తయితే పూర్తి పెన్షన్ వస్తుందా?
➡️ VR అర్హత వస్తుంది కానీ పూర్తి పెన్షన్ రావదు.

4) వెయిటేజీ ఎన్ని సంవత్సరాలు కలుపుతారు?
➡️ సూపర్ అన్యుయేషన్ వయస్సుకు మిగిలిన కాలంలో గరిష్ఠంగా 5 సంవత్సరాలు వెయిటేజీ కలుపుతారు.

5) LOP / Medical Leave లో ఉండి VR అప్లై చేయవచ్చా?
➡️ అవును, అప్లై చేయవచ్చు.

6) సెలవులో ఉండి VR తీసుకోవడం ప్రయోజనమా?
➡️ స్కూల్లో జాయిన్ అయి VR తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ ప్రయోజనం పొందవచ్చు.

7) VR తర్వాత GI కొనసాగుతుందా?
➡️ GI కొనసాగదు. ప్రభుత్వ టేబుల్ ప్రకారం GI అమౌంట్ చెల్లించబడుతుంది.

VR తర్వాత పెన్షన్ శాతం పట్టిక

నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ పెన్షన్ (%)
20 Years37.87%
21 Years39.40%
22 Years40.90%
23 Years42.40%
24 Years43.93%
25 Years45.45%
26 Years46.97%
27 Years48.48%
28 Years50%

🔹 ఈ పట్టిక 58 సంవత్సరాల వయస్సులో రిటైర్మెంట్ పొందే వారికి వర్తిస్తుంది.

🌹 AP ఉద్యోగులకు ఉపయోగకరమైన సమాచారం – షేర్ చేయండి