WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

INTER 2021 SHORT MEMOS DOWNLOAD

 Short Memos - Second Year (General) - 2021

ఇంటర్‌ ఫలితాలు: ‘అసంతృప్తి ఉంటే.. పరీక్షలకు సిద్ధం’: మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌ ఫలితాలపై విద్యార్థులకు అసంతృప్తి ఉంటే కోవిడ్‌ తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ లో ఇబ్బంది లేకుండా మార్కులే ప్రకటించామని, మొదటి సంవత్సరం విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తున్నామన్నారు.

ఫెయిల్ అయిన విద్యార్థులకూ 35 శాతం మార్కులు

అమరావతి: ఏపీ ఇంటర్ మీడియేట్ సెకండియర్‌ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారం ముందుగానే ఫలితాలను విడుదల చేశామన్నారు. మినిమమ్‌ పాస్‌ మార్కులతో అందరినీ పాస్‌ చేస్తామని మంత్రి సురేష్‌ ప్రకటించారు. bie.ap.gov.in వెబ్‌సైట్‌లో ఏపీ ఇంటర్‌ ఫలితాలను చూసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26న సా.5 గంటల నుంచి వెబ్‌సైట్‌లో మెమోలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఫెయిల్, ఆబ్సెంట్‌ అయిన విద్యార్థులకు కూడా 35 శాతం మార్కులు ఇస్తామని ఆయన ప్రకటించారు. పరిస్థితులు చక్కబడ్డాక ఫస్టియర్‌ విద్యార్థులకు బెటర్మెంట్‌ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేష్‌ తెలిపారు.

DOWNLOAD INTER 2021 SHORT MEMOS