WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

CSE MEETING WITH UNIONS ON TRANSFERS HIGHLIGHTS

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ గారు, కమిషనరు చినవీరభద్రుడు గారు మరియు ఉన్నత విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయ సంఘాల నేతల భేటీ:
✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈

🚀 జీవో నెంబర్ 145 గురించి:

జూలై ఏడో తారీఖు వరకు:

ప్రతీరోజూ పాఠశాలలకు హాజరై  పెండింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసేలా కార్యాచరణ.

జూలై 7 తర్వాత:

ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి మంగళవారం.

ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి బుధవారం

ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి శుక్రవారం 

పాఠశాలలకు హాజరై విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది.

బయోమెట్రిక్ వేయనవసరం లేదు.

🚀 రేషనలైజేషన్:

ప్రాథమిక పాఠశాలలకు: 1:30 నిష్పత్తి ప్రకారం

60 దాటితే మూడు పోస్టులు

మిగిలిన పోస్టులను స్ట్రెంత్ ప్రకారము సర్దుబాటు చేస్తారు.


ప్రాథమికోన్నత పాఠశాలలకు:
గతంలో మాదిరిగానే

ఉన్నత పాఠశాలలకు:
240 ప్రతిపాదన ప్రభుత్వం తీసుకురాగా, ఉపాధ్యాయ సంఘాల నేతలు 180 ప్రతిపాదనకై పట్టు పట్టినందువలన  పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు.

ఇంగ్లీష్ మీడియం ఉంటే నాలుగు పోస్టులు కొనసాగుతాయి.

🚀  బదిలీలు:
 
బదిలీలకు కనీసం రెండు సంవత్సరాలు.

గరిష్ఠంగా ఎనిమిది అకడమిక్ సంవత్సరాలు.

హెచ్ఎంలకు ఐదు సంవత్సరాలు

అప్ గ్రెడేషన్ పోస్టుల గురించి పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు.

మోడల్ స్కూల్  మరియు కేజీబీవీలో కూడా బదిలీలు.

పాయింట్లు:

 రేషనలైజేషన్ కి 2 పాయింట్లు.

స్పౌజ్  వారికి 5 పాయింట్లు.

క్యాటగిరి 1 కి  1 పాయింట్.
కేటగిరి 2 కు  2 పాయింట్లు.
కేటగిరీ 3 కు 3 పాయింట్లు.
క్యాటగిరి 4 కు  5 పాయింట్లు.

సర్వీస్ పాయింట్ ల గురించి స్పష్టత రాలేదు. కనుక  పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు.